
సాక్షి, అమరావతి : ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించారని మంత్రి తెలిపారు. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వ భూములు కేటాయిస్తామని ఆయన వెల్లడించారు. పట్టణాల్లో 11 వేల ఎకరాల భూమి అవసరమని గుర్తించామని, అవసరమైతే భూములు కొనుగోలు చేసి పేదలకు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రైవేట్ స్థలాల కొనుగోలుకు రూ. 12 వేల కోట్లు ఖర్యు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఎక్కడా అవినీతికి తావులేకుంగా పేదలకు ఇచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని, అంతేగాక ఇళ్ల స్థలాన్ని లబ్ధిదారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.