
కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీల్లో డిసెంబర్ 23 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. కర్నూలు కలెక్టరేట్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 21 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. మూడో ఆప్షన్ కింద ఇళ్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తే లబ్ధిదారులతో ఎంవోయూ చేయిస్తామన్నారు.
ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.15 లక్షలు ఖర్చుచేస్తుండగా.. ఇందులో రూ.1.80 లక్షలు సబ్సిడీ పోగా, మిగిలిన రూ.35 వేలను లబ్ధిదారుడికి పావలా వడ్డీ కింద ఇప్పిస్తామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద ప్రజా ప్రతినిధులు 15 వేల సచివాలయాల పరిధిలో తిరిగి వివిధ పనుల కోసం ప్రతిపాదనలు పంపారని, వాటిలో 3,344 పనులకు ఆమోదం తెలిపామని, ఇందులో 2,317 పనులు ప్రారంభమయ్యాయని కూడా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment