
సాక్షి, హైదరాబాద్ : రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్‌కు ఉన్న ఉజ్వల భవిష్యత్తు దేశంలో ఏ నగరానికి లేదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సోమవారం టీఎస్‌బీపాస్‌ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధరణి, టిఎస్ ఐపాస్ మాదిరిగా టీఎస్ బీపాస్‌ను సీఎం కేసీఆర్ అందుబాటులోకి తెచ్చారన్నారు. 75 గజాల వరకు ఎలాంటి అనుమతి అవసరం లేదని తెలిపారు. అనుమతి కాగితమే ఆయుధమని, 600 చదరపు గజాలలోపు ఉన్న స్థలాలు ఉన్న వారికి స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతి ఇస్తామని తెలిపారు. 600 గజాలపైన ఉన్న వారికి 21 రోజుల్లో అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చదవండి: సర్వశక్తులూ ఒడ్డాల్సిందే!
ఇలాంటి పారదర్శకమైన విధానం దేశంలో ఎక్కడా లేదని, రాబోయే రోజుల్లో కొత్త జీహెచ్‌ఎంసీ చట్టాలు తీసుకువస్తామన్నారు. ఈ చట్టాలు కొంత కఠినంగా ఉంటాయని తెలిపారు. దశాబ్దాల నుంచి దశల జరిగిన తప్పిదాలతో వర్షాలతో నగర ప్రజలు ఇబ్బంది పడ్డారని, స్వీయ ధ్రువీకరణలో తప్పులు ఉంటే.. ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చే అధికారం అధికారులకు ఉందని స్పష్టం చేశారు. చెరువుల్లో, ఎఫ్‌టీఎఫ్ స్థలాల్లో ఉన్న భవనాలు కూల్చేందుకు కొత్త జీహెచ్‌ఎంసీ చట్టం తెస్తామన్నారు. రాబోయే 5 నుంచి 7 ఏడేళ్లలో తెలంగాణలో 51 శాతం ప్రజలు నగరాల్లో జీవించే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో 40 శాతం జనాభా ఓఆర్‌ఆర్ లోపల జీవనం సాగిస్తున్నారన్నారు. సగం ఆస్తి పన్ను మాఫీ
రియల్ ఎస్టేట్ ధరలు పెంచవద్దని మంత్రి హెచ్చరించారు. ఇక నుంచి ఇంటి నిర్మాణ అనుమతులు పారదర్శకంగా, ఆన్‌లైన్ విధానంలో లభ్యం కానున్నట్లు తెలిపారు. తెలంగాణలో 140 మండలాలు పెరిగాయని, పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్లు త్వరగా ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుగా వికేంద్రీకరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ 70కి పైగా సాహసాలు చేశారని పేర్కొన్న కేటీఆర్ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత పారదర్శకంగా, వేగంగా సామాన్యులకు సేవలు అందుతున్నాయన్నారు. తెలంగాణ తెచ్చిన చట్టాలు దేశానికి బెంచ్ మార్క్‌గా నిలుస్తాయని తెలిపారు. రైతు బంధు కేంద్రం కూడా అనుసరిస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment