house lands
-
నవయుగంపై జగన్ సంతకం
ఇది పేదింటి మహిళల శిరస్సులపై వైఎస్ జగన్ ప్రభుత్వం అలంకరిస్తున్న ఆత్మగౌరవ కిరీటం. సాధికారతా పథంలో మహిళలను ముందడుగు వేయించే ఉజ్వల ఘట్టం. ఒకేసారి 30.61 లక్షల మందికి ఇళ్లస్థలాల పట్టాలివ్వడం ఒక జాతీయ రికార్డు. అందునా వారంతా మహిళలే కావడంఒక సామాజిక విప్లవం. ఇస్తున్నవి కంటితుడుపు ‘డీ’ పట్టాలు కావు.. గుండె బలమిచ్చే రిజి్రస్టేషన్ పత్రాలు. ఈ కన్వేయన్స్ డీడ్స్ పదేళ్లలో సేల్డీడ్స్గా మారుతాయి. సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా ఒకేసారి 30.61 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చి పేదల సొంతింటి కలను నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిష్టర్ చేసి మరో చరిత్ర సృష్టించనుంది. తద్వారా పేదలకు ఇచ్చిన ఇళ్లను రిజిష్టర్ చేసిన తొలి ప్రభుత్వంగా సీఎం జగన్ సర్కారు రికార్డుకెక్కనుంది. దీనివల్ల పట్టాలు పొందిన పేదలకు తమ ఇళ్లపై పూర్తి భరోసా దక్కుతుంది. రిజిస్ట్రేషన్ తర్వాత లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్లు అందచేస్తారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నేడో రేపో పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది. ఒకేసారి 30.61 లక్షల రిజిస్ట్రేషన్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అక్కచెల్లెమ్మలకు సీఎం జగన్ ప్రభుత్వం 30.61 లక్షల ఇళ్ల స్థలాలను ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.31,832 కోట్ల విలువైన 71,811 ఎకరాల భూమిని సేకరించి 17 వేలకుపైగా లేఅవుట్లు నిర్మించింది. అందులో భాగంగా 25,374 ఎకరాల ప్రైవేటు భూమిని రూ.11,343 కోట్లు ఖర్చు పెట్టి భూసేకరణ ద్వారా సేకరించింది. ఇళ్ల పట్టాల కోసం ప్రైవేట్ భూమిని సేకరించడం, రూ.వేల కోట్లు వెచ్చించి పేదల ఇంటి కలను నెరవేరుస్తున్న తొలి ప్రభుత్వం ఇదే కావడం గమనార్హం. ఇప్పటివరకు ‘డి’ పట్టాలే.. ఇప్పటివరకు ప్రభుత్వాలేవీ ఇళ్ల పట్టాలను పేదల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదు. 1977 అసైన్డ్ భూముల చట్టం (పీఓటీ) ప్రకారం గత ప్రభుత్వాలు పేదలకు ‘డి’ పట్టాలు మాత్రమే జారీ చేసేవి. అది కూడా చాలా స్వల్ప సంఖ్యలోనే ఉండేవి. సీఎం జగన్ ప్రభుత్వం మొదటిసారిగా లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు వాటిని మహిళలకు సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనుంది. వాస్తవానికి 2020 ఉగాది నాడే ఇళ్లతోపాటు రిజిస్ట్రేషన్లు కూడా చేసి ఇవ్వాలని సీఎం జగన్ భావించారు. ఇందుకోసం పదేళ్ల తర్వాత ఇళ్ల పట్టాలపై లబ్ధిదారులు యాజమాన్య హక్కులు పొందేలా అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించారు. కానీ అప్పట్లో కొందరు రాజకీయ స్వార్థంతో పేదలకు మేలు చేసే ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో అప్పటికి తాత్కాలికంగా ‘డి’ పట్టాల ప్రకారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. మాటకు కట్టుబడి రిజిస్ట్రేషన్లు అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం సర్వ హ క్కులతో వారి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసేందుకు అ సైన్డ్ భూముల చట్టాన్ని ప్రభుత్వం ఇటీవల సవ రించింది. దాని ప్రకారం 2021లో ‘డి’ పట్టాలు ఇ చ్చిన 30.61 లక్షల మందికి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి ఆ స్థలాల లబ్ధిదారులైన అక్క చెల్లెమ్మలకు కన్వేయన్స్ డీడ్లు అందించనుంది. ఈ డీడ్లు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వ జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చు. సంక్లిష్ట ప్రక్రియకు తెర ప్రస్తుతం గడువు ముగిసిన ‘డి’ పట్టాలను క్రమబద్ధీరించుకోవడం ఎంత కష్టమో అందరికి తెలిసిన విషయమే. దానికి రెవెన్యూ శాఖ నుంచి ఎన్వోసీ, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించడం క్లిష్టమైన ప్రక్రియ. పేద మహిళలు అలాంటి అవస్థలు పడకుండా వారికిచ్చిన ఇళ్ల స్థలాలను వారి పేరుతోనే ప్రభుత్వం రిజిష్టర్ చేసి కన్వేయన్స్ డీడ్లు ఇస్తోంది. ఈ డీడ్ల వల్ల ఆ స్థలా లు విలువైన స్థిరాస్తిగా వారికి సమకూరనున్నాయి. ఆ ఆస్థిపై బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణా లు పొందే అవకాశం కలుగుతుంది. ప్రైవేట్ ఆస్థి మాదిరిగానే లబ్ధిదారులు, వారి వారసులు అనుభ వించే అవకాశం ఏర్పడుతుంది. ఆ ఆస్థి వివాదంలో చిక్కుకునే అవకాశం ఉండదు. తద్వారా పేద మహిళలకు వారు పొందిన ఇళ్ల పట్టాలపై పూర్తి భరోసా లభిస్తుంది. పదేళ్ల తర్వాత ఎవరితోనూ సంబంధం లేకుండా ఆ స్థలాలపై వారికి పూర్తి హక్కు లు సంక్రమిస్తాయి. తహశీల్దార్ల నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ స్థలాలు వారి పేరు రిజిష్టర్ అయి ఉండడం, కన్వేయన్స్ డీడ్లు కూడా ఇస్తున్నందున వాటిని ఆస్తిపత్రాలు (సేల్ డీడ్స్)గా వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే డమ్మీ రిజిస్ట్రేషన్లు.. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టేందుకు నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. మంగళవారం కొన్ని డమ్మీ రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల కోసం ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం రాష్ట్రంలోని 15 వేలకుపైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా గుర్తించారు. అక్కడి వీఆర్ఓలను ప్రభుత్వం తరఫున రిజిస్ట్రేషన్ చేసే ప్రతినిధులుగా నియమించారు. రిజిస్ట్రేషన్ల శాఖ ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రూపొందించింది. ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో 30.61 లక్షల ఇళ్ల పట్టాలు పొందిన వారి డేటాను పొందుపరిచింది. లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరగనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా సర్వర్ల సామర్థ్యాన్ని కూడా పెంచారు. -
‘పట్టా’లతో పట్టలేని ఆనందం
సాక్షి నెట్వర్క్: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యజ్ఞం మంగళవారం కూడా లబ్ధిదారుల ఆనందోత్సాహాల మధ్య పండుగ వాతావరణంలో సాగింది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 30.75లక్షల మందికి ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుండడంతో తమ కల సాకారమవుతోందని అక్కచెల్లెమ్మలు పట్టలేని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఎక్కడికక్కడ.. తమకు కేటాయించిన స్థలాలను చూసుకునేందుకు వారంతా లేఅవుట్ల వద్దకు బంధుమిత్రులతో పెద్ద ఎత్తున వస్తుండడంతో అక్కడంతా కోలాహలంగా ఓ జాతరను తలపిస్తోంది. ఎవరికి వారు సెల్ఫీలు దిగుతున్నారు. కొందరైతే పట్టాలు తీసుకున్న వెంటనే శంకుస్థాపన చేసుకుంటున్నారు. ► అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిధిలో 19వ రోజు మంగళవారం 2,474 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 14 నియోజకవర్గాల పరిధిలో 85,761 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలంతో పాటు పట్టాలను పంపిణీ చేశారు. ► చిత్తూరు జిల్లావ్యాప్తంగా మంగళవారం నాటికి 8,158 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ► కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలో మంగళవారం 1,233 మందికి ఇంటి స్థలాల పట్టాలను అందజేశారు. అలాగే, ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. మిగిలిన ప్రాంతాల్లో అధికారులు పట్టాల పంపిణీ చేపట్టారు. ► వైఎస్సార్ కడప జిల్లాలో మంగళవారం 3,901 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీంతో మొత్తం 1,10,001 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయింది. ► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం 1,582 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు, 261 మందికి టిడ్కో ఇళ్లు పంపిణీ చేశారు. ► ప్రకాశం జిల్లాలో మంగళవారం 762 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 84,027 మందికి పట్టాలివ్వాల్సి ఉండగా 63,360 మందికి పట్టాలిచ్చారు. అలాగే, జిల్లాలో మొత్తం 9,568 టిడ్కో ఇళ్ల సేల్ అగ్రిమెంట్లు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 3,004 మందికి ఇచ్చారు. ► గుంటూరు జిల్లాలో మంగళవారం 530 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ► తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం వరకు 2,45,911 మందికి ఇళ్లు పట్టాలను పంపిణీ చేశారు. 1,93,506 మందికి ఇళ్ల పట్టాలు, 19,981 మందికి టిడ్కో గృహాలు, 32,424 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు అందజేసినట్లు తెలిపారు. మంగళవారం ఒక్కరోజు 3,094 ఇళ్ల స్థలాల పట్టాలు అందించినట్లు వివరించారు. అదే విధంగా 1,33,540 మందికి గృహనిర్మాణం చేపట్టేందుకు మంజూరు ఉత్తర్వులు ఇచ్చామన్నారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం మొత్తం 1,403 మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ► శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంగళవారం 1,293 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 19 రోజుల్లో 61,394 పట్టాలను అందజేశారు. -
ఉత్సాహంగా పట్టాల పంపిణీ
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇంటిస్థలం పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాల పంపిణీ కొనసాగుతోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇల్లు’ పథకం కింద 15వ రోజు శుక్రవారం కూడా వీటి పంపిణీ ఉత్సాహంగా సాగింది. ఆయా లే అవుట్ల వద్ద వేలాదిమంది ప్రజలతో కోలాహలం నెలకొంది. స్థలం వచ్చినవాళ్లు, ఇళ్లు మంజూరైనవాళ్లు, టిడ్కో ఇళ్లు వచ్చినవాళ్లు పట్టాలు, పత్రాలు తీసుకుని ఉత్సాహంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడం కనిపించింది. తూర్పుగోదావరి జిల్లాలో 41,913 మందికి పట్టాలు, పత్రాలు అందజేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ పాల్గొన్నారు. విశాఖలో 16,475 మందికి పట్టాలు అందజేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు విజయసాయిరెడ్డి, సత్యవతి, ఎమ్మెల్యే కన్నబాబు పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో 7,630 ఇళ్లపట్టాలను పేదలకు అందజేశారు. మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎమ్మెల్యేలు రక్షణనిధి, కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో 4,246 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 3,639 మందికి పట్టాలు అందజేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 3,383 మందికి ఇంటి స్థలం పట్టాలు, 469 మందికి టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 2,900 మందికి పట్టాలు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాలో 2,805 మందికి పట్టాలిచ్చారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో 2,133 మందికి పట్టాలు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లాలో 1,236 పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యేలు తొగురు ఆర్థర్, డాక్టర్ జె.సుధాకర్ పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో 956 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలం పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. -
అర్హతే ప్రామాణికం
సాక్షి నెట్వర్క్: కులం చూడం.. మతం చూడం.. పార్టీ చూడం.. అర్హులైన ప్రతిపేదకు సంక్షేమ ఫలాలు అందిస్తాం.. లబ్ధిపొందడానికి అర్హతే ప్రామాణికం.. ఇవీ సీఎం వైఎస్ జగన్ చెప్పే మాటలు. ఆ మాటలు క్షేత్రస్థాయిలో నిరూపణ అవుతున్నాయి. ఏళ్ల తరబడి జాగాకోసం కళ్లు కాయలుకాచేలా చూస్తూ.. చెప్పులరిగేలా తిరుగుతూ.. పడిన కష్టాలు తీరుతున్నాయని లబ్ధిదారులు సంతోషంగా చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాల పంపిణీ కార్యక్రమం 13వ రోజు బుధవారం కోలాహలంగా సాగింది. టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థికి, జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి భార్యకు ఇంటిపట్టాలు పంపిణీ చేశారు. తనకు గతంలో టీడీపీ అంటే అభిమానమని, ఆ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లు తనకు స్థలం ఇవ్వలేదని.. ఇప్పుడు తాను కాలు కదపకుండా స్థలమేకాదు.. ఇల్లు కూడా మంజూరు చేశారని మరో లబ్ధిదారు చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే అర్హతే ప్రామాణికమన్న సీఎం మాటలు నూరుశాతం అమలవుతున్నాయని ప్రజలు జేజేలు పలుకుతున్నారు. కృష్ణాజిల్లాలో 25,645 ఇంటిస్థలం పట్టాలు, ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. మంత్రులు వెలంపల్లి, కొడాలి నాని పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 17,285 మందికి పట్టాలు పంపిణీ చేశారు. మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో 15,809 ఇంటిస్థలం పట్టాలు, ఇళ్ల పత్రాలను పంపిణీ చేశారు. మంత్రులు మేకతోటి సుచరిత, బొత్స పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 14,990 పట్టాలు అందజేశారు. విశాఖ జిల్లాలో 10,904 పట్టాలు పంపిణీ చేశారు. వైఎస్సార్ జిల్లా మీనాపురం వద్ద ఇళ్ల స్థలాల లేఅవుట్ మంత్రి ముత్తంశెట్టి పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో 8,809 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో 8,577 పట్టాలు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 8,401 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో 4,624 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వైఎస్సార్ జిల్లాలో 4,430 మందికి, కర్నూలు జిల్లాలో 4,333 మందికి పట్టాలు పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 3,529 మందికి పట్టాలు అందజేశారు. డిప్యూటీ సీఎం కృష్ణదాస్, మంత్రి శ్రీరంగనాథరాజు, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో 3,322 మందికి పట్టాలు పంపిణీ చేశారు. -
స్థలం మాది.. ఇల్లు మాది.. జగనన్న వరం ఇది..
సాక్షి నెట్వర్క్: బెలూన్లు ఎగురవేసేవారు.. మిఠాయిలు పంచేవారు.. పరస్పరం అభినందించుకునేవారు.. పట్టాలను పైకి చూపిస్తూ చేతులు జోడించేవారు.. జై జగన్ అంటూ ప్లకార్డులు పట్టుకున్నవారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోలు పట్టుకుని కృతజ్ఞతగా చూస్తున్నవారు.. వైఎస్సార్ జగనన్ననగర్ పేరుతో వేసిన ముగ్గులు.. ఎటు చూసినా కోలాహలమే. పండుగ వాతావరణమే. కొత్తబట్టలు ధరించి సంబరంగా స్థలాలు చూసుకుంటూ ‘ఈ స్థలం మాది..’ అనుకుంటూ భావోద్వేగంతో చెమ్మగిల్లిన కళ్లతో కనిపించినవారు లెక్కలేనంతమంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకంలో జరుగుతున్న పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం 12వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపించిన దృశ్యాలివి. అన్ని జిల్లాల్లోను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. పట్టాల పంపిణీ జరిగిన గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. అందరూ తమ ఇంట్లో శుభకార్యం అన్నట్లుగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎవరెవరికి స్థలాలు వచ్చాయి, ఇళ్లు ఎంతమందికి మంజూరయ్యాయి.. అంటూ చర్చించుకోవడం కనిపించింది. భార్యాభర్తలు, పిల్లలతో కలిసి తమ స్థలం వద్ద ఫొటోలు తీసుకుంటూ ఆనందంగా కనిపించారు. కొందరు తమ స్థలాల్లో శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లాలో 43,937 స్థలం పట్టాలు, ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. విశాఖ జిల్లాలో 39,203 మందికి పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, గుడివాడ అమర్నాథ్, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పెట్ల ఉమాశంకర్‌గణేష్, యూవీ రమణమూర్తిరాజు, శెట్టి ఫాల్గుణ, వాసుపల్లి గణేష్‌కుమార్, తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో 35,124 పట్టాలు పంపిణీ చేశారు. మంత్రులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 22,968 పట్టాలు పంపిణీ చేశారు. మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, ఎంపీ వంగా గీతా, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో 11,743 మందికి, కర్నూలు జిల్లాలో 8,831 మందికి పట్టాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 8,649 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 7,881 పట్టాలు అందజేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి హాజరయ్యారు. గుంటూరు జిల్లాలో 7,787 మందికి పట్టాలు పంపిణీ చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 4,762 స్థలపట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో 4,417 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో 3,776, శ్రీకాకుళం జిల్లాలో 3,357 మందికి పట్టాలు, ఇళ్ల పత్రాలు అందజేశారు. సీఎంకు రుణపడి ఉంటాను నేను దివ్యాంగుడిని. తల్లిదండ్రులు మృతి చెందడంతో పిన్నమ్మ ఇంట్లో ఉంటున్నా. సొంతిల్లు లేదు. తల్లిదండ్రులు ఉన్న సమయంలోనూ అద్దె ఇంట్లోనే ఉండేవాళ్లం. గతంలో పలుసార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వలంటీర్ మా ఇంటికి వచ్చి స్థలం కోసం దరఖాస్తు చేయించాడు. ప్రస్తుతం ఇంటి పట్టా మంజూరు అయ్యింది. ఎట్టకేలకు సొంతింటి కల నెరవేరుతోంది. జగనన్నకు రుణపడి ఉంటాను. – మహేశ్వరరెడ్డి, తుమ్మలపెంట, కొలిమిగుండ్ల మండలం, కర్నూలు జిల్లా ఐదేళ్ల కల తీరింది మా ఇద్దరిదీ నక్కలదిన్నె గ్రామమే. ఐదేళ్ల కిందట పెళ్లయింది. మేం ఇద్దరు పిల్లలతో పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాం. ఇంటి స్థలం కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మాకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు కూడా మంజూరైంది. ఐదేళ్ల సొంతింటి కల నెరవేరుతోంది. స్థలం, ఇల్లు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – చిరంజీవి, నవీన దంపతులు, నక్కలదిన్నె, చాపాడు మండలం, వైఎస్సార్ జిల్లా -
పండుగలా పట్టాల పంపిణీ
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా నూతన సంవత్సరం తొలిరోజు కూడా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల ఒప్పంద పత్రాలు, ఆస్తిహక్కు పత్రాలు పంపిణీ చేశారు. కృష్ణాజిల్లాలో 8వ రోజైన శుక్రవారం 950 పట్టాలను పంపిణీ చేశారు. నందివాడ మండలం జనార్ధనపురంలో మంత్రి కొడాలి నాని పాల్గొని పేదలకు ఇళ్ల పట్టాలను అందజేసి ఇళ్లకు భూమిపూజ చేశారు. కైకలూరు మండలంలో 586 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. ► గుంటూరు జిల్లాలో శుక్రవారం 329 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. డిసెంబర్ 25 నుంచి ఇప్పటివరకు మొత్తం 86,879 మందికి పట్టాలు అందజేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడులో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో ఎమ్మెల్యే విడదల రజిని, మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్ మండలం ఇప్పటంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం మాదలలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేదలకు పట్టాలను పంపిణీ చేశారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం మొత్తం 785 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 59,962 మందికి ఇళ్ల పట్టాలు అందించినట్లయింది. ► తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం 7,169 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు 70,553 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ► విశాఖ జిల్లాలో మొత్తం 1,271 మందికి ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల ఒప్పంద పత్రాలు, ఆస్తిహక్కు పత్రాలు శుక్రవారం పంపిణీ చేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గంలో 1,021 మందికి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో మాడుగులలో 150 మందికి పట్టాలను పంపిణీ చేశారు. ► విజయనగరం జిల్లాలో శుక్రవారం 1,043 ఇళ్ల పట్టాలు, 500 టిడ్కో ఇళ్లు, 236 పీసీ/ఈఆర్ పట్టాలు పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో శుక్రవారం 32 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల్ని పంపిణీ చేశారు. ఎనిమిది రోజుల వ్యవధిలో మొత్తం 32,592 మంది పేదలు పట్టాలు అందుకున్నారు. ► చిత్తూరు జిల్లావ్యాప్తంగా శుక్రవారం 1,371 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాలో శుక్రవారం 35 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ► అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరులో మంత్రి శంకరనారాయణ 95 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ► కర్నూలు జిల్లా నందికొట్కూరు మండల పరిధిలో ఎంపీ పోచా బ్రహా్మనందరెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఆదోని మండల పరిధిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, కర్నూలు మండలం పంచలింగాలలో ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. -
కాలువ గట్టు నుంచి కలల లోగిళ్లలోకి..
సాక్షి, అమరావతి: ఈమె శీలం జ్యోతి.. విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని బుడమేరు కాలువగట్టుపై టార్పాలిన్‌ను కప్పిన చిన్న పాకలో పదేళ్లుగా ఉంటోంది. భర్త చనిపోగా కూలి పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. ఈమెకు సొంత ఇల్లు అన్నది కలలో కూడా ఊహించలేని విషయం. కానీ.. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు– పేదలు అందరికీ ఇళ్లు’ జ్యోతి జీవితంలో వెలుగులు నింపింది. ..ఇలా శీలం జ్యోతే కాదు. బుడమేరు కాలువ గట్టుపై దశాబ్దకాలంగా బతుకులు వెళ్లదీస్తున్న నిరుపేదల సొంతింటి కలలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేస్తున్నారు. వారికి ఇంటి స్థలాలు మంజూరు చేశారు. అంతేకాదు.. వారికి ఇల్లు కట్టించి కూడా ఇవ్వనున్నారు. లక్ష మందికిపైగా పేదల దుస్థితి ఇదీ.. ‘నవరత్నాలు–పేదలు అందరికీ ఇళ్లు’ పథకం నిరుపేదల జీవితాల్లో కొత్త కాంతులు తీసుకువచ్చింది. విజయవాడలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలు, గన్నవరం, మైలవరం, పెనమలూరు నియోజకవర్గాల్లోని నిరుపేదలు దశాబ్దాలుగా కాలువ గట్లు, ఆటోనగర్‌లోని ఇరుకు సందులు, శివారు ప్రాంతాల్లోని మురికివాడలు, కొండప్రాంతాలు, రోడ్ల పక్కన చిన్నచిన్న పాకలు, రేకుల షెడ్లు వేసుకుని లక్షమందికి పైగా పేదలు ఉంటున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఈ పథకం అలాంటి లక్షలాది పేదల సొంతింటి ఆశలను నిజం చేసింది. సువిశాలమైన లే అవుట్లలో ఇళ్ల స్థలాలిచ్చింది. అందులో ప్రభుత్వం వారికి బృందావనాన్ని తలపించే రీతిలో ‘వైఎస్సార్–జగనన్న’ కాలనీలు నిర్మించనుంది. రోడ్లు, వీధి దీపాలు, పాఠశాలలు, హెల్త్ సెంటర్లు, పార్కులు.. ఇలా అన్ని వసతులు సమకూర్చనుంది. విజయవాడ రూరల్ మండలం నున్నలో వేసిన లే అవుట్ ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలుస్తోంది. ఓ వైపు కొండలు మరోవైపు తోటలతో ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలుస్తోంది. అందులో 1,265 ఇళ్ల స్థలాలతో వేసిన లే అవుట్ గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తోంది. అలాగే, ఇబ్రహీంపట్నంలో కృష్ణానదికి సమీపంలో వేసిన లే అవుట్ ‘రివర్ వ్యూ’ శోభతో అలరారనుంది. కొండపల్లిలో వేసిన లే అవుట్లు కూడా కార్పొరేట్ కంపెనీలు నిరి్మంచే గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తున్నాయి. 2,215.19 ఎకరాల్లో 151 లేఅవుట్లు.. ఈ విధంగా విజయవాడలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలు, గన్నవరం, మైలవరం, పెనమలూరు నియోజకవర్గాల్లోని పేదల కోసం ఏకంగా 2,215.19 ఎకరాల్లో 151 లే అవుట్లు వేయడం విశేషం. తద్వారా 1,33,470 మంది పేదలకు ఇళ్ల స్థలాలు సమకూర్చి వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వనుంది. అప్పుడు ఇంటి కోసం పదేళ్లు తిరిగినా ఇవ్వలేదు మేం బుడమేరు కాలువగట్టుపై చిన్నపాకలో పదేళ్లుగా ఉంటున్నాం. సొంత ఇంటి కోసం పదేళ్లుగా తిరిగాను. చంద్రబాబు ప్రభుత్వంలో అప్పటి మా ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమాను ఎన్నిసార్లు అడిగినా మాకు ఇల్లు రాలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక మా కల నెరవేరింది. ఇంతకంటే మాకేం కావాలి. – నాగమణి, ఇబ్రహీంపట్నం మా కుటుంబానికి పండుగరోజు జగనన్న మాకు ఇంటి స్థలం ఇచ్చిన రోజే మాకు పండగ రోజు. అందుకే మాకు స్థలం ఇచ్చిన రోజే అక్కడకు వెళ్లి పూజ చేశాం. నున్నలో సెంటు భూమి రూ.5 లక్షలకు పైగా ఉంది. మేం రూ.లక్ష కూడా పెట్టలేం. అలాంటిది మాకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చి.. ఇల్లు కూడా కట్టించి ఇస్తోంది. – సారేపల్లి కుమారి, నున్న గ్రామం, విజయవాడ రూరల్ మండలం నోట మాట రావడంలేదు ఎన్నో ఏళ్లుగా రోడ్డు పక్కన పాకలో ఉంటున్నాం. అడగకుండానే మా ఇంటికి వచ్చి మరీ ఇంటి స్థలం కేటాయించారు. ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. ఈ సంతోషంతో నోటి నుంచి మాట రావడంలేదు. మాకు ఇంతకన్నా ఏం కావాలి. – మల్లీశ్వరి, నున్న, విజయవాడ రూరల్ మండలం సొంతిల్లు కట్టుకుంటానని అనుకోలేదు రేకుల షెడ్డులోనే సగం జీవితం అయిపోయింది. ఇక ఈ జీవితానికి సొంతింటి యోగం లేదనుకున్నాను. కానీ, జగనన్న నా కల నిజం చేశారు. నాకంటూ ఓ సొంత ఇంటిని ఇస్తున్నారు. ఎందరో పేదలకు మేలు చేసిన సీఎంను ఆ దేవుడు చల్లగా చూడాలి. – పరసా స్వర్ణకుమారి, నున్న గ్రామం విజయవాడ రూరల్ -
ఇళ్ల పట్టాలపై ప్రశంసలు.. సీడీ ఆవిష్కరణ
సాక్షి, అమరావతి : రేపు (శుక్రవారం) జరగబోయే ఇళ్ల పట్టాల పంపణీ యావత్ ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ మహిళా సాధికారతకు పెద్దపీట అంటూ ప్రముఖులు కొనియాడుతున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీపై పలురంగాలకు చెందిన మహిళా ప్రముఖులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సీడీని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి తయారు చేయగా.. దీనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులు మీదగా గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. ఇళ్ల పట్టాల పంపిణీపై పీవీ సింధు, కరణం మల్లేశ్వరి, పీటీ ఉష, సుధామూర్తి, అపోలో సంగీతరెడ్డి పద్మావతి వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ జమున, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ఫ్రీడ్ హాగ్ యూనిసెఫ్ యస్మిన్ ఆలీ, కర్ణాటక ఉమెన్స్ కమిషనర్ చైర్పర్సన్ ఒడిశా చైర్పర్సన్, మణిపూర్ చైర్పర్సన్, ఎంపీ నవనీత్ కౌర్ హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే రోజా సంతోషం వ్యక్తం చేస్తూ సీడీలో వారి అభిప్రాయాలను చెప్పారు. (పులివెందుల రుణం ఎప్పటికీ తీరనిది) నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా డిసెంబర్ 25న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 30,68,281 మంది అర్హులను అత్యంత పారదర్శకంగా ఎంపిక చేసి సచివాలయాల నోటీసు బోర్డుల్లో జాబితాను పొందుపరిచారు. అర్హుల్లో ఏ ఒక్కరికీ ఇంటి స్థలం రాలేదనే మాట వినిపించరాదని సీఎం వైఎస్ జగన్ పలుమార్లు స్పష్టం చేశారు. ఏవైనా కారణాలతో ఎక్కడైనా అర్హుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. 90 రోజుల్లోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి స్థలాలు కేటాయిస్తామని ప్రకటించింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 66,518 ఎకరాల భూమిని సేకరించి లేఔట్లు వేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. చివరిలో దరఖాస్తు చేసుకుని అర్హులుగా ఎంపికైన 80 వేల మంది కోసం వచ్చే నెల 10లోగా స్థల సేకరణతోపాటు ప్లాట్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. స్థలాల పంపిణీతోపాటు 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కోసం ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి కావచ్చాయి. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు : బొత్స ఇళ్ల పట్టాల పంపిణీపై రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో మాట్లాడారు. రేపు పేదల సొంతింటి కల నెరవేర్చే రోజుఅని అన్నారు. తొలుత 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామన్నారు. తొలివిడతలో 15 లక్షల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేపడతామని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. ‘ఇంత పెద్దఎత్తున పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి. 300 ఎస్ఎఫ్టి ఇళ్లను ఒక్క రూపాయికే అందిస్తున్నాం. స్థలం ఉండి పాకలో ఉండే పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందిస్తాం. 15.60 లక్షల ఇళ్లకు రూ.1.80 లక్షల చొప్పున లబ్ధిదారులకు ఇస్తాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 17 వేల కొత్త టౌన్‌షిప్‌లు వస్తాయి. రూ.23,538 కోట్ల విలువైన భూమిని పేదలకు అందిస్తున్నాం. రాజకీయాలకు తావులేకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకోవాలని చూశారు’ అని అన్నారు. (పట్టాల పండుగకు చురుగ్గా ఏర్పాట్లు) -
కలల గృహాలకు కదలిక
సాక్షి, అమరావతి : పేదల కలల గృహాలకు కదలిక వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడున్నరేళ్లలో 30 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 15 లక్షల ఇళ్లు నిర్మించేందుకు గృహ నిర్మాణ సంస్థ అవసరమైన కసరత్తు ప్రారంభించింది. పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నందున సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా వస్తువులు కొనుగోలు చేయనున్నారు. 67.50 లక్షల టన్నుల సిమెంట్, 7.20 లక్షల టన్నుల ఇనుముతో పాటు పెద్ద ఎత్తున మెటల్, రంగులు (పెయింట్) అవసరం కావడంతో రివర్స్ టెండరింగ్ ద్వారా వాటిని సేకరించేందుకు అధికారులు విధి విధానాలు తయారు చేస్తున్నారు. డిసెంబర్ 25వ తేదీన ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో అదే రోజు ఇంటి మంజూరు పత్రాన్ని కూడా లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయనున్నారు. పట్టాలు మంజూరైన పేదలందరికీ గృహాలు నిర్మిస్తారు. నాణ్యమైన నిర్మాణ సామగ్రి, మార్కెట్ ధర కంటే తక్కువకు ఉత్పత్తిదారుల నుంచి లబ్ధిదారులకు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. లే అవుట్ కాలనీల్లో మౌలిక సదుపాయాలైన రోడ్లు, మంచి నీరు, విద్యుదీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించనున్నారు. లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా ప్రారంభం మొదలు వారి ఖాతాలకు బిల్లులు జమ అయ్యే వరకు గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించనున్నాయి. అందులో పని చేస్తున్న డిజిటల్, వెల్ఫేర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో పాటు వలంటీర్లు క్షేత్ర స్థాయిలో పని చేస్తారు. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వనుంది. నిర్మాణాలను పర్యవేక్షించే ఇంజినీర్లు, తాపీ పని చేసే వారికి ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. అందుకు గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చేలా తిరుపతి ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు లేకుండా మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్ల వివరాలను ఇప్పటికే గ్రామ, పట్టణాల వారీగా సేకరించారు. ఇళ్ల నాణ్యతను ఎప్పటికప్పుడు టెక్నికల్ కమిటీ పర్యవేక్షిస్తుంది. సొంతంగా ఇల్లు నిర్మించుకుంటే పరికరాలు ఇస్తాం లబ్ధిదారులు సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు వస్తే వారి ఐరన్, సిమెంట్, బ్రిక్స్, తలుపులు, కిటికీలు తదితర పరికరాలు ఇస్తాం. నిర్మాణానికి అవసరమైన ఇసుక కూడా ఉచితమే. డిసెంబర్ 25న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టాలు పంపిణీ చేసే రోజే 10 వేల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వడమే కాకుండా వాటికి మ్యాపింగ్ చేస్తాం. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ నిర్మిస్తాం. - చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహ నిర్మాణ శాఖ మంత్రి మొదటి విడత ఇళ్లు మంజూరు ఇలా జిల్లా ఇళ్ల సంఖ్య తూర్పు గోదావరి 2,40,100 కృష్ణా 1,75,939 విశాఖపట్నం 1,70,912 గుంటూరు 1,58,710 పశ్చిమ గోదావరి 1,54,855 చిత్తూరు 1,41,087 అనంతపురం 1,01,310 వైఎస్సార్ కడప 76,445 ప్రకాశం 70,990 కర్నూలు 58,738 శ్రీకాకుళం 56,608 విజయనగరం 51,767 నెల్లూరు 42,539 -
ఆలస్యం, అవినీతికి ఆస్కారం లేకుండా టీఎస్ బిపాస్: కేటీఆర్
-
సీఎం కేసీఆర్ 70కి పైగా సాహసాలు చేశారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్‌కు ఉన్న ఉజ్వల భవిష్యత్తు దేశంలో ఏ నగరానికి లేదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సోమవారం టీఎస్‌బీపాస్‌ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధరణి, టిఎస్ ఐపాస్ మాదిరిగా టీఎస్ బీపాస్‌ను సీఎం కేసీఆర్ అందుబాటులోకి తెచ్చారన్నారు. 75 గజాల వరకు ఎలాంటి అనుమతి అవసరం లేదని తెలిపారు. అనుమతి కాగితమే ఆయుధమని, 600 చదరపు గజాలలోపు ఉన్న స్థలాలు ఉన్న వారికి స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతి ఇస్తామని తెలిపారు. 600 గజాలపైన ఉన్న వారికి 21 రోజుల్లో అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చదవండి: సర్వశక్తులూ ఒడ్డాల్సిందే! ఇలాంటి పారదర్శకమైన విధానం దేశంలో ఎక్కడా లేదని, రాబోయే రోజుల్లో కొత్త జీహెచ్ఎంసీ చట్టాలు తీసుకువస్తామన్నారు. ఈ చట్టాలు కొంత కఠినంగా ఉంటాయని తెలిపారు. దశాబ్దాల నుంచి దశల జరిగిన తప్పిదాలతో వర్షాలతో నగర ప్రజలు ఇబ్బంది పడ్డారని, స్వీయ ధ్రువీకరణలో తప్పులు ఉంటే.. ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చే అధికారం అధికారులకు ఉందని స్పష్టం చేశారు. చెరువుల్లో, ఎఫ్టీఎఫ్ స్థలాల్లో ఉన్న భవనాలు కూల్చేందుకు కొత్త జీహెచ్ఎంసీ చట్టం తెస్తామన్నారు. రాబోయే 5 నుంచి 7 ఏడేళ్లలో తెలంగాణలో 51 శాతం ప్రజలు నగరాల్లో జీవించే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో 40 శాతం జనాభా ఓఆర్ఆర్ లోపల జీవనం సాగిస్తున్నారన్నారు. సగం ఆస్తి పన్ను మాఫీ రియల్ ఎస్టేట్ ధరలు పెంచవద్దని మంత్రి హెచ్చరించారు. ఇక నుంచి ఇంటి నిర్మాణ అనుమతులు పారదర్శకంగా, ఆన్లైన్ విధానంలో లభ్యం కానున్నట్లు తెలిపారు. తెలంగాణలో 140 మండలాలు పెరిగాయని, పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్లు త్వరగా ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుగా వికేంద్రీకరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ 70కి పైగా సాహసాలు చేశారని పేర్కొన్న కేటీఆర్ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత పారదర్శకంగా, వేగంగా సామాన్యులకు సేవలు అందుతున్నాయన్నారు. తెలంగాణ తెచ్చిన చట్టాలు దేశానికి బెంచ్ మార్క్‌గా నిలుస్తాయని తెలిపారు. రైతు బంధు కేంద్రం కూడా అనుసరిస్తుందని పేర్కొన్నారు. -
వైఎస్సార్ జగనన్న కాలనీలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్లు కట్టించే కాలనీలకు వైఎస్సార్ జగనన్న కాలనీలు అని పేరు ఖరారు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శుక్రవారం జీవో జారీ చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య కార్యక్రమమైన ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 25 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. సంతృప్త స్థాయిలో కులం, జాతి, మతంతో సంబంధం లేకుండా అర్హులందరికీ నివాస స్థల పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించనుంది. మిషన్ మోడ్‌లో స్థలాలు ఇచ్చి.. ఇళ్లు నిర్మించేందుకు విధివిధానాలు రూపొందించి అర్హులను ఎంపిక చేసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్, జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.’ అని జీవోలో పేర్కొన్నారు. -
పేదల ఇళ్ల స్థలాల కోసం 30,875 ఎకరాలు గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలందరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు అధికార యంత్రాంగం ఆ దిశగా కార్యాచరణకు దిగింది. ఒకవైపు ఇళ్ల స్థలాలకు అవసరమైన భూములను గుర్తించడంతోపాటు మరోవైపు లబ్ధిదారుల గుర్తింపును కూడా సమాంతరంగా చేపట్టింది. వచ్చే ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరాలని ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో ఉండటంతో అధికార యంత్రాంగం పేదల ఇళ్ల స్థలాల కోసం అనువైన భూములను గుర్తించే పనిలో తలమునకలైంది. ఇప్పటివరకు 10,674 గ్రామాల్లో 26,527.73 ఎకరాలు.. 72 పట్టణ ప్రాంతాల్లో 4,348.23 ఎకరాలు కలిపి 30,875.96 ఎకరాల భూములను అధికారులు గుర్తించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు పంపిణీ చేయడానికి అధికారులు లక్షల సంఖ్యలో వ్యవసాయ భూములను గుర్తించారు. ఇప్పుడు అదే తరహాలో వైఎస్ జగన్ ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం భూములను గుర్తిస్తోంది. గత ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం భూములను గుర్తించకపోగా బడా పారిశ్రామికవేత్తల కోసం ఏకంగా పది లక్షల ఎకరాలతో భూ బ్యాంకును ఏర్పాటు చేసింది. పేదల విషయంలో గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి స్పష్టమైన తేడా కనిపిస్తోందని అధికార యంత్రాంగమే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. 17.34 లక్షల మంది అర్హులు రాష్ట్రంలో ఈ ఏడాది ఆగస్టు 26 నుంచి ఇంటింటికీ వెళ్లి గ్రామ, వార్డు వలంటీర్లు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఇళ్ల స్థలాలు లేని, ఇళ్లు లేని పేదలందరినీ గుర్తించారు. గత నెలాఖరుకు రాష్ట్రంలో మొత్తం కుటుంబాల సర్వేను వలంటీర్లు పూర్తి చేశారు. లబ్ధిదారుల వివరాలను ఆధార్ అనుసంధానం ద్వారా డూప్లికేట్ లేకుండా రియల్‌టైమ్ గవర్నెన్స్ చర్యలు చేపట్టింది. తద్వారా 24.83 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించింది. ఈ లబ్ధిదారుల అర్హతలు, తనిఖీల ప్రక్రియను తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ఏకకాలంలో కొనసాగిస్తున్నారు. తనిఖీల అనంతరం ఇప్పటివరకు 12,84,611 మంది లబ్ధిదారులు ఇళ్ల స్థలాలకు అర్హులని తేల్చారు. వీరు కాకుండా 4,50,206 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి గుర్తించారు. ఇలా ఇప్పటివరకు 17,34,817 మంది లబ్ధిదారులను ఇళ్ల స్థలాలకు అర్హులుగా తేల్చారు. ఇంకా తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ల తనిఖీల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 7లోగా ఇంకా ఎంత భూమి అవసరమనేది అధికారులు నిర్ధారించనున్నారు. అవసరమైన భూమిని వచ్చే ఏడాది జనవరి 25లోగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో మార్కింగ్ చేసి చూపిస్తారు. అంతేకాకుండా ఆ కుటుంబాల మహిళల పేరిట ఉగాది నాడు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తారు. -
పోలీసులకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్న ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు ఇళ్ల స్థలాలు కేటాయించనుందని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని పోలీసులకు అపార్ట్మెంట్ల నిర్మాణంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు ప్రభుత్వ స్థలాలను కేటాయించనున్నట్లు తె లిపారు. ఆయన సోమవారం పోలీసు ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. మరో పదిహేను రోజుల్లో వీటికి సంబంధించిన శంకుస్థాపన పనులు ప్రారంభిచనున్నట్లు ఈ సందర్భంగా ఆయన అన్నారు. -
గూడు కోసం పోరు
కడప నగరంలోని అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రభుత్వ భూముల్లో వేసిన గుడిసెల తొలగింపు మానుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. సీపీఎం రాష్ట్ర నాయకుడు ఎం.బాలకాశి, జిల్లా కార్యదర్శి బి.నారాయణ శిబిరాన్ని ప్రారంభించారు. శంకర్, మగ్బూల్‌బాష, సిద్దిరామయ్య, తస్లీమ్, దస్తగిరిమ్మ దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి ఎన్.రవిశంకర్‌రెడ్డి, నాయకులు సావంత్ సుధాకర్, పాపిరెడ్డి, దస్తగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. - న్యూస్‌లైన్, కడప కలెక్టరేట్ -
సమస్యల ఏకరువు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: రెండున్నర దశాబ్దాలకుపైగా తాత్కాలిక పట్టాలతో సాగు చేసుకుంటున్న భూమిని ఆ 53 మందికి ట్రీ పట్టాలుగా ఇవ్వాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆదేశించారు. అద్దంకి మండలం నంబూరివారిపాలేనికి చెందిన 53 మంది మహిళలు స్థానిక నాయకులు కట్టా హనుమంతురావు, కట్టా శ్రీనివాసరావు నాయకత్వంలో వెళ్లి తమకు పట్టాలు ఇవ్వాలని సోమవారం ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో విన్నవించుకున్నారు. కలెక్టర్ స్పందిస్తూ సర్వే నంబర్ 955లోని ఆ భూమిని ‘ట్రీ’ పట్టాల కింద ఇవ్వాలని, ఈ మేరకు రిజల్యూషన్ పాస్ చేయాలని ఆదేశించారు. ఏడాది నుంచి వేతనాల్లేవు ఆరేళ్ల నుంచి మదర్సాలో విద్యా వలంటీర్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమకు గతేడాది జనవరి నుంచి వేతనాలు ఇవ్వడం లేదని కనిగిరికి చెందిన ఐదుగురు వాపోయారు. వేతనాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. కలెక్టర్ స్పందిస్తూ విద్యా వలంటీర్లకు ప్రతి నెలా ఐదో తేదీలోగా వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. ఒకవేళ వారికి సంబంధించిన వివరాలు రాకపోయినా బడ్జెట్ నుంచి చెల్లించాలన్నారు. ఇళ్ల స్థలాలివ్వాలి కందుకూరు మండలం పాలూరు కుంట పోరంబోకులో ఇళ్ల స్థలాలివ్వాలని పలువురు కోరారు. సర్వే నంబరు 55లో కొన్నేళ్ల నుంచి 4.45 ఎకరాల భూమి ఖాళీగా ఉందన్నారు. చిల్లచెట్లు పెరిగిన ఆ స్థలాన్ని తాము చదును చేసుకుంటే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నకిలీ పట్టాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయారు. పొలానికి వెళ్లేందుకు దారిలేకుండా చేశారు తన పొలానికి వెళ్లేందుకు దారి లేకుండా చేశారని చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలేనికి చెందిన పీ ఏసురత్నం ఫిర్యాదు చేశాడు. తమ పక్క గ్రామమైన ఇలపావులూరులోని సర్వే నంబర్ 470లో 2.76 ఎకరాల పొలం ఉందని తెలిపాడు. ఇటీవల పంచాయతీ ఎన్నికల అనంతరం తన కుటుంబంపై కక్షకట్టిన అగ్రవర్ణాలు పొలానికి వెళ్లేందుకు దారి లేకుండా చేశారని వివరించాడు. కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలి ఒంగోలు నగర పాలక సంస్థలోని ఇంజినీరింగ్ విభాగంలో వీధి లైట్లు, వాటర్ వర్క్స్ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాల చెల్లింపులో నిబంధనలు ఉల్లంఘించిన ఎస్సీఎల్సీఎస్ సొసైటీ కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు ముదివర్తి బాబూరావు, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి పీవీఆర్ చౌదరి కోరారు. 54 మందికి జీఓ నంబర్ 333 ప్రకారం కనీస వేతనం *6700 చెల్లించాల్సి ఉన్నా కాంట్రాక్టర్ నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. మంచినీటి ప్లాంట్‌ను పంచాయతీకి అప్పగించాలి కారంచేడు మండలం స్వర్ణ పంచాయతీకి చెందిన మంచినీటి ప్లాంట్‌ను పంచాయతీకి అప్పగించాలని సర్పంచ్ కే లక్ష్మణబాబు కోరారు. మాజీ సర్పంచ్ గ్రామంలోని దాతల సహకారంతో మంచినీటి ఆర్ఓ ప్లాంట్‌ను నిర్మించారన్నారు. నూతన పాలకవర్గం వచ్చిన తరువాత ఆ ప్లాంట్‌ను పంచాయతీకి అప్పగించకుండా మంచినీటి వ్యాపారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. పంచాయతీ భవనాన్ని, అందులోని ఆర్ఓ ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తుల నుంచి స్వాధీనపరచాలని కోరారు. ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలి ఒంగోలు నగరంలో ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సాధన సమితి నాయకులు ఎం శ్రీనివాసులు, ఎస్ శివరామకృష్ణ కోరారు. కమ్యూనిటీ హాలుకు తాళం వేశారు ఇంకొల్లు మండలం దుద్దుకూరులోని కమ్యూనిటీ హాలుకు తాళం వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని సర్పంచ్ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.గ్రామ కంఠంలోని సర్వే నంబర్ 225లో 2009-2010 కాలంలో అప్పటి పాలకమండలి కమ్యూనిటీ హాలు నిర్మించిందన్నారు. శిథిలావస్థకు చేరిన పంచాయతీ భవనం కూలిన తరువాత అక్కడే కార్యకలాపాలు నిర్వహించేలా తీర్మానం చేశారని తెలిపారు. నూతన పాలకవర్గం రావడంతో కమ్యూనిటీ హాలుకు తాళం వేసి స్వప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ప్రజాదర్బార్‌లో లెక్క ఇది ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: గతేడాది జనవరి ఒకటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించిన ప్రజాదర్బార్‌కు 24,538 అర్జీలు అందాయి. వీటిలో ఇప్పటి వరకు 7,665 అర్జీలు పరిష్కారమయ్యాయి. 8810 అర్జీలు పరిష్కార దిశలో ఉన్నాయి.5728 అర్జీలు పరిశీలనలో ఉన్నాయి. 5728 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. శాఖల వారీగా అర్జీలను పరిశీలిస్తే రెవెన్యూకు సంబంధించి 12334, సంక్షేమ శాఖకు 7373, వ్యవసాయ శాఖకు 249, వ్యక్తిగత అభివృద్ధికి 2748, విద్యాశాఖకు 430, ఇంజనీరింగ్ శాఖకు 488, పరిశ్రమల శాఖకు 141, వైద్య ఆరోగ్యశాఖకు 182, ప్రాజెక్టులకు 297, పంచాయతీరాజ్‌కి 296అర్జీలు వచ్చాయి. ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కలెక్టర్ ప్రజాదర్బార్‌లో అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ విజయకుమార్ ఆదేశించారు. సమస్య పరిష్కారంపై సరైన సమాచారం ఇవ్వాలన్నారు. ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఇళ్ల స్థలాల పంపిణీ అక్రమాలపై న్యాయ విచారణ జరపాలి
నిజామాబాద్ సిటీ, న్యూస్‌లైన్ : నిజామాబాద్ నగరంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీలో అనేక అక్రమాలు జరిగాయని వరంగల్ ఎంపీ రాజయ్య ఆరోపించారు. వీటన్నింటిపైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సర్వే ల్యాండ్ శాఖలో చైన్మన్గా పనిచేసే తన బావ కొంగల భాస్కర్‌ను స్కాంలో అక్రమంగా ఇరికించి ఆయన మరణానికి రెవెన్యూ అధికారులు కారణమయ్యారని విమర్శించారు. సారంగపూర్‌లోని జిల్లా జైలులో శుక్రవారం ఇద్దరు ఖైదీలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో ఒకరైన భాస్కర్ ఎంపీ రాజయ్యకు బావ అవుతారు. ఆయన అంత్యక్రియలలో పాల్గొనడానికి జిల్లాకు వచ్చిన ఎంపీ మీడియాతో మాట్లాడారు. 2006-07లో రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడితే వారిని వదిలిపెట్టి, చిన్న ఉద్యోగి అయిన భాస్కర్‌ను అక్రమంగా కేసులో ఇరికించి జైలుకు పంపారన్నారు. దాంతో ఆయన మానసికంగా కుంగిపోయారని, కోర్టు ఫీజులు చెల్లించలేక పేషీలకు హాజరు కాలేకపోయారని పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసారని ఆవేదన వక్తం చేశారు. ఇందుకు కారణమైన రెవెన్యూ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని, ఇదే తన దరఖాస్తుగా స్వీకరించాలని అధికారులను కోరారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు దీనికి పరిష్కార మార్గం కనుక్కోవాలన్నారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలకు గోరీ కట్టాలి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పార్టీలకు గోరీ కట్టాలని వరంగల్ ఎంపీ రాజయ్య అన్నారు. నిజామాబాద్ జిల్లా జైలులో శుక్రవారం మృతి చెందిన ఇద్దరు ఖైదీలలో ఒకరైన కొంగల భాస్కర్ ఎంపీ రాజయ్యకు స్వయనా బావ అవుతారు. ఆయన అంత్యక్రియలో పాల్గొనేందుకు ఎంపీ శనివారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ఏనాడో ప్రణబ్‌ముఖర్జీకి లేఖ ఇచ్చామని చె ప్పిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నేడు తెలంగాణ వ్యతిరేకంగా ఢిల్లీలో దీక్షకు పూనుకోవటం శోచనీయమన్నారు. టీడీపీ తెలంగాణలో విశ్వాసం కోల్పోవటంతో చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులతో కలిసి కుట్రలు పన్నుతున్నారన్నారు. -
కదంతొక్కిన వికలాంగులు
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ఇళ్ల స్థలాల కోసం వికలాంగులు కదంతొక్కారు. వికలాంగుల హక్కుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మల్లేశం మాట్లాడుతూ.. ప్రభుత్వం వికలాంగుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వికలాంగులందరికీ ఇళ్ల స్థలాలు, అంత్యోదయ రేషన్ కార్డులు, దీపం కనెక్షన్ కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని, జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. స్వయం ఉపాధి కోసం బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 3 శాతం వికలాంగులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడివయ్య మాట్లాడూతూ.. పారిశ్రామిక వేత్తలకు భూములిస్తున్న ప్రభుత్వం, వికలాంగులకు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. జిల్లా స్థాయిలో వికలాంగుల మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని, సర్టిఫికెట్లు కలిగిన వికలాంగులకు పింఛన్లు మంజూరు చేయాలని, ఉపాధి హామీ పథకంలో 150 రోజులపాటు పనులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, కార్యదర్శి గోపాల్, నాయకులు బస్వరాజ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
గూడు లేదు..నీడ లేదు
అలంపూర్, న్యూస్‌లైన్: నాలుగు గడిచినా వరద బాధితుల నివాసగృహ నిర్మాణాలపై సందిగ్ధం వీడటం లేదు. ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇస్తుందని మొదట్లో చెప్పిన అధికారులు ఇప్పుడేమో నిర్వాసితులే ఇళ్లను నిర్మించుకోవాలనే కొత్త మెలికలు పెడుతున్నారు. అంతేకాదు వరద బాధితుల కోసం స్థలాలు, ఇళ్ల నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేసేందుకు జీఓ జారీచేస్తామని చెప్పినా హామీలు అమలుకాకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. 2009 నాటి వరదల్లో నియోజకవర్గంలోని 28 గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. అం దులో అలంపూర్, మానవపాడు మండ లం మద్దూరు, వడ్డేపల్లి మండలం రాజోలి, తూర్పుగార్లపాడు, పడమటి గార్లపాడు, తుమ్మిల్లా, నసనూరు, తుమ్మలపల్లి, అయిజ మండలం కట్కనూరు, ఇటిక్యాల మండలం ఆర్.గార్లపాడు గ్రామాల్లో పునరావాస చర్యల్లో భాగంగా ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. స్పష్టతలేని ప్రకటనలు నియోజకవర్గంలో వరద తాకిడికి పూర్తిగా నేలమట్టమైన 10 గ్రామాల్లో ఇళ్లు నిర్మిం చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. వీటి లో ఇప్పటివరకు అయిజలోని కుట్కనూ రు, ఇటిక్యాల మండలం ఆర్.గార్లపాడు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకుని నిర్వాసితులకు అప్పగించారు. రాజోలిలో 3015 ఇళ్లు కూలిపోగా ఇప్పటివరకు 508 ఇళ్లను నిర్మించారు. కాగా, పడమటి గార్లపాడు, మానవపాడు మండలం మద్దూరు, అలంపూర్‌లో ఇప్పటికి ఇళ్ల నిర్మాణం ప్రా రంభించలేదు. అలంపూర్‌లో 926 మందికి ఇళ్లస్థలాలు చూపించారు. మిగిలిన వరద బాధితుల కోసం అదనంగా మరో 20 ఎకరాలు, మద్దూరు, పడమటి గార్లపాడు గ్రామాల్లో స్థల సేకరణను పరిశీలిస్తున్నారు. అయితే ప్రభుత్వం డిసెంబర్‌లోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని గృహ నిర్మాణశాఖ అధికారులు ప్రకటించారు. అం దుకు ఓసీ, బీసీలకు రూ.1.40 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.1.70లక్షలు ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పా రు. అందుకు వారం రోజుల్లో జీఓ విడుదల చేస్తామన్నారు. 14రోజులు గడిచినా జీఓ ఊసేలేదు. డిసెంబర్ నాటికి ఇళ్లని ర్మాణం పూర్తిచేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పినా.. పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో నిర్వాసితులు ఆం దోళన చెందాల్సి వస్తుంది. తెరపైకి కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వంతో కలిసి వరద బాధితులకు ఇళ్లు నిర్మించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. అందులో భాగంగానే రాజోలి, ఆర్.గార్లపాడు, కూట్కనూరు, టి.గార్లపాడు, తుమ్మలపల్లి, తుమ్మిల్లా, నసనూరు గ్రామాల్లో ఆర్డీటీ, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ముందుకొచ్చి ఇళ్ల నిర్మా ణం చేపడుతున్నాయి. అయితే అలంపూ ర్, మద్దూరు, పడమటి గార్లపాడు గ్రామా ల్లో స్థలసేకరణలో మెలికపడటంతో నిర్మాణ పనులు మరుగునపడ్డాయి. నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ స్థల సేకరణ విషయం ఓ కొలిక్కిరాలేదు. అయితే తా జాగా గృహనిర్మాణ శాఖ మంత్రి ఆధ్వర్యంలో కలెక్టర్, గృహనిర్మాణ శాఖ ఎండీలతో సమీక్ష సమావేశం నిర్వహించి ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. కానీ వారం రోజులు గడవక ముందే మళ్లి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ద్వారా ఇళ్లు మం జూరు చేస్తాం..నిర్వాసితులే తమ ఇళ్ల ని ర్మించుకోవాలనే ప్రతిపాదన తెరపైకి తె చ్చారు. దీంతో వరద బాధితుల ఇళ్ల నిర్మాణంపై మరోసారి అయోమయం నెల కొంది. ఈ విషయమై సంబంధిత అధికారులను సంప్రదించగా ఇప్పటివరకు తమ కు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు అందలేదని చెబుతున్నారు.