గుంటూరు జిల్లా పేరేచర్ల లేఔట్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్లకార్డులతో నిలబడిన లబ్ధిదారులు
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇంటిస్థలం పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాల పంపిణీ కొనసాగుతోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇల్లు’ పథకం కింద 15వ రోజు శుక్రవారం కూడా వీటి పంపిణీ ఉత్సాహంగా సాగింది. ఆయా లే అవుట్ల వద్ద వేలాదిమంది ప్రజలతో కోలాహలం నెలకొంది. స్థలం వచ్చినవాళ్లు, ఇళ్లు మంజూరైనవాళ్లు, టిడ్కో ఇళ్లు వచ్చినవాళ్లు పట్టాలు, పత్రాలు తీసుకుని ఉత్సాహంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడం కనిపించింది.
తూర్పుగోదావరి జిల్లాలో 41,913 మందికి పట్టాలు, పత్రాలు అందజేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ పాల్గొన్నారు. విశాఖలో 16,475 మందికి పట్టాలు అందజేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు విజయసాయిరెడ్డి, సత్యవతి, ఎమ్మెల్యే కన్నబాబు పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో 7,630 ఇళ్లపట్టాలను పేదలకు అందజేశారు.
మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎమ్మెల్యేలు రక్షణనిధి, కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో 4,246 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 3,639 మందికి పట్టాలు అందజేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 3,383 మందికి ఇంటి స్థలం పట్టాలు, 469 మందికి టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో 2,900 మందికి పట్టాలు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాలో 2,805 మందికి పట్టాలిచ్చారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో 2,133 మందికి పట్టాలు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లాలో 1,236 పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యేలు తొగురు ఆర్థర్, డాక్టర్ జె.సుధాకర్ పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో 956 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలం పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment