ఇది పేదింటి మహిళల శిరస్సులపై వైఎస్ జగన్ ప్రభుత్వం అలంకరిస్తున్న ఆత్మగౌరవ కిరీటం. సాధికారతా పథంలో మహిళలను ముందడుగు వేయించే ఉజ్వల ఘట్టం. ఒకేసారి 30.61 లక్షల మందికి ఇళ్లస్థలాల పట్టాలివ్వడం ఒక జాతీయ రికార్డు. అందునా వారంతా మహిళలే కావడంఒక సామాజిక విప్లవం. ఇస్తున్నవి కంటితుడుపు ‘డీ’ పట్టాలు కావు.. గుండె బలమిచ్చే రిజి్రస్టేషన్ పత్రాలు. ఈ కన్వేయన్స్ డీడ్స్ పదేళ్లలో సేల్‌డీడ్స్‌గా మారుతాయి.
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా ఒకేసారి 30.61 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చి పేదల సొంతింటి కలను నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిష్టర్ చేసి మరో చరిత్ర సృష్టించనుంది. తద్వారా పేదలకు ఇచ్చిన ఇళ్లను రిజిష్టర్ చేసిన తొలి ప్రభుత్వంగా సీఎం జగన్ సర్కారు రికార్డుకెక్కనుంది. దీనివల్ల పట్టాలు పొందిన పేదలకు తమ ఇళ్లపై పూర్తి భరోసా దక్కుతుంది. రిజిస్ట్రేషన్ తర్వాత లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్‌లు అందచేస్తారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నేడో రేపో పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది.
ఒకేసారి 30.61 లక్షల రిజిస్ట్రేషన్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అక్కచెల్లెమ్మలకు సీఎం జగన్ ప్రభుత్వం 30.61 లక్షల ఇళ్ల స్థలాలను ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.31,832 కోట్ల విలువైన 71,811 ఎకరాల భూమిని సేకరించి 17 వేలకుపైగా లేఅవుట్లు నిర్మించింది. అందులో భాగంగా 25,374 ఎకరాల ప్రైవేటు భూమిని రూ.11,343 కోట్లు ఖర్చు పెట్టి భూసేకరణ ద్వారా సేకరించింది. ఇళ్ల పట్టాల కోసం ప్రైవేట్ భూమిని సేకరించడం, రూ.వేల కోట్లు వెచ్చించి పేదల ఇంటి కలను నెరవేరుస్తున్న తొలి ప్రభుత్వం ఇదే కావడం గమనార్హం.
ఇప్పటివరకు ‘డి’ పట్టాలే..
ఇప్పటివరకు ప్రభుత్వాలేవీ ఇళ్ల పట్టాలను పేదల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదు. 1977 అసైన్డ్ భూముల చట్టం (పీఓటీ) ప్రకారం గత ప్రభుత్వాలు పేదలకు ‘డి’ పట్టాలు మాత్రమే జారీ చేసేవి. అది కూడా చాలా స్వల్ప సంఖ్యలోనే ఉండేవి. సీఎం జగన్ ప్రభుత్వం మొదటిసారిగా లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు వాటిని మహిళలకు సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనుంది.
వాస్తవానికి 2020 ఉగాది నాడే ఇళ్లతోపాటు రిజిస్ట్రేషన్లు కూడా చేసి ఇవ్వాలని సీఎం జగన్ భావించారు. ఇందుకోసం పదేళ్ల తర్వాత ఇళ్ల పట్టాలపై లబ్ధిదారులు యాజమాన్య హక్కులు పొందేలా అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించారు. కానీ అప్పట్లో కొందరు రాజకీయ స్వార్థంతో పేదలకు మేలు చేసే ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో అప్పటికి తాత్కాలికంగా ‘డి’ పట్టాల ప్రకారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
మాటకు కట్టుబడి రిజిస్ట్రేషన్లు
అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం సర్వ హ క్కులతో వారి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసేందుకు అ సైన్డ్ భూముల చట్టాన్ని ప్రభుత్వం ఇటీవల సవ రించింది. దాని ప్రకారం 2021లో ‘డి’ పట్టాలు ఇ చ్చిన 30.61 లక్షల మందికి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి ఆ స్థలాల లబ్ధిదారులైన అక్క చెల్లెమ్మలకు కన్వేయన్స్ డీడ్‌లు అందించనుంది. ఈ డీడ్‌లు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా సేల్ డీడ్‌లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వ జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చు.
సంక్లిష్ట ప్రక్రియకు తెర
ప్రస్తుతం గడువు ముగిసిన ‘డి’ పట్టాలను క్రమబద్ధీరించుకోవడం ఎంత కష్టమో అందరికి తెలిసిన విషయమే. దానికి రెవెన్యూ శాఖ నుంచి ఎన్‌వోసీ, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించడం క్లిష్టమైన ప్రక్రియ. పేద మహిళలు అలాంటి అవస్థలు పడకుండా వారికిచ్చిన ఇళ్ల స్థలాలను వారి పేరుతోనే ప్రభుత్వం రిజిష్టర్ చేసి కన్వేయన్స్ డీడ్‌లు ఇస్తోంది. ఈ డీడ్‌ల వల్ల ఆ స్థలా లు విలువైన స్థిరాస్తిగా వారికి సమకూరనున్నాయి. ఆ ఆస్థిపై బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణా లు పొందే అవకాశం కలుగుతుంది.
ప్రైవేట్ ఆస్థి మాదిరిగానే లబ్ధిదారులు, వారి వారసులు అనుభ వించే అవకాశం ఏర్పడుతుంది. ఆ ఆస్థి వివాదంలో చిక్కుకునే అవకాశం ఉండదు. తద్వారా పేద మహిళలకు వారు పొందిన ఇళ్ల పట్టాలపై పూర్తి భరోసా లభిస్తుంది. పదేళ్ల తర్వాత ఎవరితోనూ సంబంధం లేకుండా ఆ స్థలాలపై వారికి పూర్తి హక్కు లు సంక్రమిస్తాయి. తహశీల్దార్ల నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ స్థలాలు వారి పేరు రిజిష్టర్ అయి ఉండడం, కన్వేయన్స్ డీడ్‌లు కూడా ఇస్తున్నందున వాటిని ఆస్తిపత్రాలు (సేల్ డీడ్స్)గా వినియోగించుకునే అవకాశం లభిస్తుంది.
ఇప్పటికే డమ్మీ రిజిస్ట్రేషన్లు..
ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టేందుకు నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. మంగళవారం కొన్ని డమ్మీ రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల కోసం ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం రాష్ట్రంలోని 15 వేలకుపైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా గుర్తించారు. అక్కడి వీఆర్‌ఓలను ప్రభుత్వం తరఫున రిజిస్ట్రేషన్ చేసే ప్రతినిధులుగా నియమించారు. రిజిస్ట్రేషన్ల శాఖ ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ రూపొందించింది. ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో 30.61 లక్షల ఇళ్ల పట్టాలు పొందిన వారి డేటాను పొందుపరిచింది. లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరగనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా సర్వర్ల సామర్థ్యాన్ని కూడా పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment