అలంపూర్, న్యూస్‌లైన్: నాలుగు గడిచినా వరద బాధితుల నివాసగృహ నిర్మాణాలపై సందిగ్ధం వీడటం లేదు. ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇస్తుందని మొదట్లో చెప్పిన అధికారులు ఇప్పుడేమో నిర్వాసితులే ఇళ్లను నిర్మించుకోవాలనే కొత్త మెలికలు పెడుతున్నారు. అంతేకాదు వరద బాధితుల కోసం స్థలాలు, ఇళ్ల నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేసేందుకు జీఓ జారీచేస్తామని చెప్పినా హామీలు అమలుకాకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి.
2009 నాటి వరదల్లో నియోజకవర్గంలోని 28 గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. అం దులో అలంపూర్, మానవపాడు మండ లం మద్దూరు, వడ్డేపల్లి మండలం రాజోలి, తూర్పుగార్లపాడు, పడమటి గార్లపాడు, తుమ్మిల్లా, నసనూరు, తుమ్మలపల్లి, అయిజ మండలం కట్కనూరు, ఇటిక్యాల మండలం ఆర్.గార్లపాడు గ్రామాల్లో పునరావాస చర్యల్లో భాగంగా ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
స్పష్టతలేని ప్రకటనలు
నియోజకవర్గంలో వరద తాకిడికి పూర్తిగా నేలమట్టమైన 10 గ్రామాల్లో ఇళ్లు నిర్మిం చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. వీటి లో ఇప్పటివరకు అయిజలోని కుట్కనూ రు, ఇటిక్యాల మండలం ఆర్.గార్లపాడు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకుని నిర్వాసితులకు అప్పగించారు. రాజోలిలో 3015 ఇళ్లు కూలిపోగా ఇప్పటివరకు 508 ఇళ్లను నిర్మించారు. కాగా, పడమటి గార్లపాడు, మానవపాడు మండలం మద్దూరు, అలంపూర్‌లో ఇప్పటికి ఇళ్ల నిర్మాణం ప్రా రంభించలేదు. అలంపూర్‌లో 926 మందికి ఇళ్లస్థలాలు చూపించారు.
మిగిలిన వరద బాధితుల కోసం అదనంగా మరో 20 ఎకరాలు, మద్దూరు, పడమటి గార్లపాడు గ్రామాల్లో స్థల సేకరణను పరిశీలిస్తున్నారు. అయితే ప్రభుత్వం డిసెంబర్‌లోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని గృహ నిర్మాణశాఖ అధికారులు ప్రకటించారు. అం దుకు ఓసీ, బీసీలకు రూ.1.40 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.1.70లక్షలు ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పా రు. అందుకు వారం రోజుల్లో జీఓ విడుదల చేస్తామన్నారు. 14రోజులు గడిచినా జీఓ ఊసేలేదు. డిసెంబర్ నాటికి ఇళ్లని ర్మాణం పూర్తిచేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పినా.. పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో నిర్వాసితులు ఆం దోళన చెందాల్సి వస్తుంది.
తెరపైకి కొత్త ప్రతిపాదనలు
ప్రభుత్వంతో కలిసి వరద బాధితులకు ఇళ్లు నిర్మించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. అందులో భాగంగానే రాజోలి, ఆర్.గార్లపాడు, కూట్కనూరు, టి.గార్లపాడు, తుమ్మలపల్లి, తుమ్మిల్లా, నసనూరు గ్రామాల్లో ఆర్డీటీ, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ముందుకొచ్చి ఇళ్ల నిర్మా ణం చేపడుతున్నాయి. అయితే అలంపూ ర్, మద్దూరు, పడమటి గార్లపాడు గ్రామా ల్లో స్థలసేకరణలో మెలికపడటంతో నిర్మాణ పనులు మరుగునపడ్డాయి. నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ స్థల సేకరణ విషయం ఓ కొలిక్కిరాలేదు.
అయితే తా జాగా గృహనిర్మాణ శాఖ మంత్రి ఆధ్వర్యంలో కలెక్టర్, గృహనిర్మాణ శాఖ ఎండీలతో సమీక్ష సమావేశం నిర్వహించి ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. కానీ వారం రోజులు గడవక ముందే మళ్లి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ద్వారా ఇళ్లు మం జూరు చేస్తాం..నిర్వాసితులే తమ ఇళ్ల ని ర్మించుకోవాలనే ప్రతిపాదన తెరపైకి తె చ్చారు. దీంతో వరద బాధితుల ఇళ్ల నిర్మాణంపై మరోసారి అయోమయం నెల కొంది. ఈ విషయమై సంబంధిత అధికారులను సంప్రదించగా ఇప్పటివరకు తమ కు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు అందలేదని చెబుతున్నారు.
గూడు లేదు..నీడ లేదు
Published Thu, Sep 5 2013 6:28 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement