కడప నగరంలోని అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రభుత్వ భూముల్లో వేసిన గుడిసెల తొలగింపు మానుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. సీపీఎం రాష్ట్ర నాయకుడు ఎం.బాలకాశి, జిల్లా కార్యదర్శి బి.నారాయణ శిబిరాన్ని ప్రారంభించారు.
శంకర్, మగ్బూల్‌బాష, సిద్దిరామయ్య, తస్లీమ్, దస్తగిరిమ్మ దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి ఎన్.రవిశంకర్‌రెడ్డి, నాయకులు సావంత్ సుధాకర్, పాపిరెడ్డి, దస్తగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- న్యూస్‌లైన్, కడప కలెక్టరేట్