![Arun Bhavani says that We will build houses if the government allows - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/11/ar.jpg.webp?itok=qfxiXcFN)
లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల మంది నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలను ఇవ్వనుందని, తమకు ప్రభుత్వం అనుమతిస్తే ఆ స్థలాల్లో చక్కటి ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇస్తామని ఆశ్రయం ప్రాజెక్ట్స్ సీఈవో, కొండూరు ఆర్కా గ్రూప్ ఆఫ్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరుణ్‌భవానీ చెప్పారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే..
► ఆశ్రయం ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మక నిర్మాణాలు పూర్తి చేశాం.
► ప్రభుత్వం పేదలకిచ్చే స్థలాల్లో మా కంపెనీ ఆధ్వర్యంలో అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి 400 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వ అనుమతి కోరతాం.
► అందుకు సంబంధించిన డిజైన్‌ను ముఖ్యమంత్రికి, మంత్రులకు చూపించనున్నాం.
► వైఎస్సార్ గృహనిర్మాణ్ పేరుతో ఆకృతి నమూనాను విడుదల చేశాం.
► ప్రభుత్వం కానీ, లబ్ధిదారులు కానీ ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అనువైన స్థలాన్ని తమకు కేటాయిస్తే చాలు.
Comments
Please login to add a commentAdd a comment