ఏలికల పాపాలు.. లబ్ధిదారులకు శాపాలు | Hudhud House Constructions Are Delaying In Srikakulam | Sakshi
Sakshi News home page

ఏలికల పాపాలు.. లబ్ధిదారులకు శాపాలు

Published Fri, Apr 5 2019 3:52 PM | Last Updated on Fri, Apr 5 2019 3:52 PM

Hudhud House Constructions Are Delaying In Srikakulam - Sakshi

కవిటి: నిర్మాణాలు పూర్తయినా గృహ ప్రవేశాలకు నోచుకోని హుదూద్‌ ఇళ్లు

సాక్షి, సోంపేట/ కవిటి (శ్రీకాకుళం): తుపానులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇళ్లు కోల్పోయిన బాధితులకు, గూడులేని దారిద్య్రరేఖరు దిగువన ఉన్న పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే ఆశయం నెరవేరకుండా పోయింది. 2016లో కవిటి మండలంలో 64 ఇళ్లు హుద్‌హుద్‌ తుపాను బాధితులకు అందించాలనే లక్ష్యంతో నిర్మాణం చేశారు. రూ.2.55 కోట్లతో 64 ఇళ్ల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. ఒక్కో యూనిట్‌ ధర రూ.3.98 లక్షలుగా నిర్థారించారు. ఈ ఇళ్ల నిర్మాణం హౌసింగ్‌ అధికారుల పర్యవేక్షణలో గుత్తేదారు చేపట్టాడు.

ఇంటినిర్మాణాలు పూర్తికావచ్చినప్పటికీ నేటికి ఏడాదిన్నర అవుతోంది. కానీ ఇప్పటివరకు స్థానిక ప్రజాప్రతినిధులు ఆ ఇళ్లను బాధితులకు అందించే ప్రక్రియను ప్రారంభించకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా లబ్ధిదారుల ఎంపిక అనధికారికంగా చేసేందుకు ఓ రహస్య భేటీ కూడా జరిగినట్టు కవిటిలో గుసగుసలువినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కొందరు ఇళ్లకోసం ఎదురుచూపులు చూస్తున్న తెలుగుతమ్ముళ్ల అనుయాయులైన లబ్ధిదారుల నుంచి రేట్లు కూడా ఫిక్స్‌ చేసుకున్నారనే వాదన ప్రచారంలో ఉంది. వాస్తవానికి ఏడాది క్రితం జరగాల్సిన లబ్ధిదారుల ఎంపిక నేటికీ పూర్తిచేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కవిటి చింతామణిగుడి పక్కన కొనుగోలు చేసిన కాలనీలో ఈ ఇళ్లను నిర్మించారు. కానీ అప్పట్లోనే కొంతమందికి ఇళ్ల పట్టాలు కూడా కేంద్ర మాజీ మంత్రి కృపారాణి హయాంలో మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్‌ అగర్వాలా ఒక పట్టా ఇచ్చి కాలనీలో లబ్ధిదారుల ఎం పిక చేసినప్పటికీ ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. వాస్తవానికి ఈ ఇళ్లకు సంబంధించి కిటికీలు తదితర సామగ్రి విరిగిపోయి దెబ్బతిన్నాయి. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో దిక్కుతోచని దీనస్థితిలో అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా ఈ ఇళ్లు ఉపయోగపడుతున్నాయి. విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్న పాలకులు తీరు పై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

నాసిరకంగా నిర్మాణాలు
సోంపేట పట్టణంలో పది సంవత్సరాలుగా 110 మంది లబ్ధిదారులు ఇళ్ల స్థలాల పట్టాలు చేత పట్టుకుని స్థలాల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. 2003లో సోంపేట పట్టణంలోని 110 మంది పేదలకు అప్పటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. వివిధ కారణాల వల్ల లబ్ధిదా రులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోయారు. 2014లో హుద్‌హుద్‌ తుపాను రావడంతో సోంపేట మండలాలనికి హుద్‌హుద్‌ ఇళ్లు 128 మంజూ రయ్యాయి. వీటిని అప్పట్లో స్థలాలు ఇచ్చినవారిని లబ్ధిదారులుగా గుర్తించి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. మీ ఇంటి కల నెరవేరేందుకు హుద్‌హుద్‌ ఇళ్ల పేరిట బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టి ఇళ్లను అందజేస్తామని ప్రజా ప్రతినిధులు తెలిపారు. పదిహేను సంవత్సరాలుగా తాము కంటున్న కలలు సాకారమవుతున్నందుకు సంతోషపడ్డారు. పేదల గూడు నిర్మించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు, ప్రమాణాలు పాటిం చాల్సిన అవసరం ఉన్నా నాసిరకం నిర్మాణాలు చేపడుతుండడంతో ఇళ్లు ఉంటాయా కూలుతాయా అనే అనుమానాలు లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు.

2016లో శంకుస్థాపన
స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ హుదూద్‌ ఇళ్ల నిర్మాణాలకు 2016 సంవత్సరం ఏడో నెలలో సోంపేట పట్టణంలోని నూకలమ్మ కొండపై శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్‌ విలువ రూ.5.09 కోట్లతో 128 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. నాసిరకపు నిర్మాణంతో ఇళ్లు పూర్తికాకముందే కూలిపోతున్నాయి. మరో రెండు సంవత్సరాలు ఆగాతే పూర్తిగా కూలిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవస రం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తి పడడంతో గుత్తేదారుడు తనకు నచ్చినట్టు నిర్మాణాలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

ఇప్పటికైనా అధికా రులు, ప్రజా ప్రతినిధులు స్పందించి నాణ్యమైన నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాల ని స్థానికులు, లబ్ధిదారులు కోరుతున్నారు. మొ త్తం 128 మందికి ఇళ్లు మంజూరు చేయాల్సి ఉండంగా 110 మంది లబ్ధిదారులను గుర్తించి వారిలో 85 మందికి మాత్రమే అర్హులుగా ప్రకటించారు. పట్టాలు అందజేసిన మిగతావారికి వివిధ కారణాలను సాకుగా చూపి ఇళ్లు మంజూరు చేయలేదు. దీంతో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.లక్ష నుంచి రూ.లక్షా యాభైవేల వరకు వసూలు చేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.

నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది
హుదూద్‌ ఇళ్ల నిర్మాణంలో తగు జాగ్రత్తలు తీసుకొని, నాణ్యమైన నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ గుత్తేదారుడు ఇష్టారా జ్యంగా ఇళ్లు నిర్మిస్తున్నా ప్రజా ప్రతినిధులు చూసి చూడనట్టు వ్యవహరించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి లబ్ధిదారులకు నాణ్యమైన ఇళ్లు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
– తడక జోగారావు, వైఎస్సార్‌ సీపీ మండల కమిటీ అధ్యక్షుడు

అనుమానాలకు తావిస్తోంది
కవిటిలో హుదూద్‌ బాధితులకు నిర్మించిన 64 ఇళ్ల ను లబ్ధిదారులకు ఇప్పటి కీ అందించలేదు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ అధికారులుగా నీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ లబ్ధిదారుల ఎంపికలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థంకావడం లేదు. ఇప్పటికే ఇళ్ల కేటాయింపు, లబ్ధిదారుల ఎంపికకు సంబం ధించిన బేరసారాలు జోరుగా సాగాయన్న వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. 
– పీఎం తిలక్, మాజీ ఎంపీపీ, కవిటి మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

సోంపేట: నిర్మాణం జరుగుతున్న సమయంలోనే కూలిన గోడలు

2
2/2

సోంపేటలో అసంపూర్ణంగా ఉన్న హుదూద్‌ ఇళ్ల నిర్మాణం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement