Hud hud victims
-
మూడేళ్లూ పట్టని గోడు.. మార్చి నాటికి గూడు
2014 అక్టోబర్ 12... విశాఖ నగరాన్ని విశోక నగరంగా మార్చేస్తూ హుద్ హుద్ ప్రళయం విరుచుకు పడిన రోజది. ఆ విపత్తులో ఇళ్లు కోల్పోయిన బాధితుల కోసం కొమ్మాది, పరదేశిపాలెం ప్రాంతాల్లో 800 ఇళ్లను జీ ప్లస్ 3 విధానంలో నిర్మించాలని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భావించింది. ఆలస్యంగా మూడేళ్ల కిందట మొదలుపెట్టిన ఆ ఇళ్ల నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. బాధితులు నెత్తీనోరు కొట్టుకున్నా టీడీపీ హయాంలో పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే పేదల ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టిన అధికారులు ఆయా పనుల కోసం టెండర్లను ఆహ్వానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే మార్చిలోగా కచ్చితంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎప్పుడో ఎందుకు... సరిగ్గా నిన్న కాక మొన్న నగరంలో మకాం వేసిన టీడీపీ అధినేత, మాజీ సీఎం .చంద్రబాబునాయుడు చెప్పిన కబుర్లను ఒక్కసారి పరిశీలిద్దాం. విశాఖ నగరానికి గత టీడీపీ సర్కారు ఎంతో చేసిందని, సిటీకి బ్రాండ్ ఇమేజ్ తెచ్చేసిందని.. ఇంకా చాలా చాలా చెప్పుకున్నారు. సరే బాబు ’కళ్లార్పకుండా’ చెప్పినవన్నీ లెక్క చూస్తే ఎవరికైనా కళ్లు తిరిగిపోవాలి. ఒకే ఒక్క విషయంలో చూద్దాం. పేద ప్రజల కోసం ఇచ్చిన హామీ ఏ మేరకు అందిందో పరిశీలిద్దాం. సరిగ్గా ఐదేళ్ల కిందట ఇదే రోజుల్లో హుద్ హుద్ తుపాను సృష్టించిన విధ్వంసం నష్టానికి పరిహారం ఎంతవరకు అందిందో ఒకసారి పరిశీలిద్దాం. 2014 అక్టోబర్ 12వ తేదీన హుద్‌హుద్ దెబ్బకు విశాఖ నగరంలో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. సర్వం కోల్పోయిన బాధితులకు ఇళ్లు నిర్మిస్తామంటూ నాటి విపక్షాల డిమాండ్, ఆందోళనల ఫలితంగా అప్పటి పాలకులు ఎట్టకేలకు ముందుకు వచ్చారు. కొమ్మాదిలోని సర్వే నెంబర్ 83లో 608 ఇళ్లను, పరదేశిపాలెంలోని సర్వే నెంబర్ 21లో 192 ఇళ్లను మొత్తంగా 800 ఇళ్లను నిర్మించాలని నాటి తెలుగుదేశం ప్రభుత్వం భావించింది. అయితే శరవేగంగా మాత్రం చర్యలు చేపట్టలేదు. లబ్ధిదారులు, విపక్షాల డిమాండ్లతో ఎట్టకేలకు 2016లో మొదలుపెట్టిన ఆ ఇళ్ల నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. విచిత్రమేమింటే హుద్‌హుద్ ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టు తీసుకున్న సంస్థ విశాఖ నగరంలోనే మరో నాలుగుచోట్ల చేపట్టిన ఇళ్ల నిర్మాణం కాలపరిమి తిలోనే పూర్తి చేసింది. కానీ పేదల గూడు కోసం చేపట్టిన హుద్‌హుద్ ఇళ్ల నిర్మాణం మాత్రం అటకెక్కించేశారంటేనే నాటి పాలకులు ఏ మాత్రం శ్రద్ధ చూపించారో అర్ధం చేసుకోవచ్చు. నాటి ఇళ్ల పనులకు తాజాగా టెండర్లు పేదల గూడులో నాటి టీడీపీ సర్కారు అంతులేని నిర్లక్ష్యం వహించగా.. తాజాగా వైఎస్సార్ ప్రభుత్వం ఆ ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. హుద్‌హుద్ ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టిన పాలకులు ఆయా పనుల కోసం రూ.8,53,50387 వ్యయంతో టెండర్లను ఆహ్వానించారు. కొమ్మాదిలోని సర్వే నెంబర్ 83లో 608 ఇళ్లు, పరదేశిపాలెంలోని సర్వే నెంబర్ 21లో 192 ఇళ్లు మొత్తంగా 800 మిగిలిపోయిన ఇళ్ల పనుల కోసం ఈనెలాఖరులోగా టెండర్లను ఖరారు చేయనున్నారు. జీ ప్లస్ 3 విధానంలో నిర్మిస్తున్న ఈ ఇళ్ల పనుల నిర్మాణానికి యూనిట్ వ్యయం రూ.1,06,687 అవుతుందని లెక్క తేల్చారు. మార్చి నాటికి పూర్తి చేస్తాం:గృహ నిర్మాణ సంస్థ పీడీ సి.జయరామాచారి హుద్‌హుద్ ఇళ్ల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసే క్రమంలో ఈనెలాఖరులోగా టెండర్లను ఖరారు చేస్తామని గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సి.జయరామాచారి వెల్లడించారు. టెండర్లు ఖరారు కాగానే పనులు చేపట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనూ 2020 మార్చిలోగా లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. -
ఏలికల పాపాలు.. లబ్ధిదారులకు శాపాలు
సాక్షి, సోంపేట/ కవిటి (శ్రీకాకుళం): తుపానులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇళ్లు కోల్పోయిన బాధితులకు, గూడులేని దారిద్య్రరేఖరు దిగువన ఉన్న పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే ఆశయం నెరవేరకుండా పోయింది. 2016లో కవిటి మండలంలో 64 ఇళ్లు హుద్‌హుద్ తుపాను బాధితులకు అందించాలనే లక్ష్యంతో నిర్మాణం చేశారు. రూ.2.55 కోట్లతో 64 ఇళ్ల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. ఒక్కో యూనిట్ ధర రూ.3.98 లక్షలుగా నిర్థారించారు. ఈ ఇళ్ల నిర్మాణం హౌసింగ్ అధికారుల పర్యవేక్షణలో గుత్తేదారు చేపట్టాడు. ఇంటినిర్మాణాలు పూర్తికావచ్చినప్పటికీ నేటికి ఏడాదిన్నర అవుతోంది. కానీ ఇప్పటివరకు స్థానిక ప్రజాప్రతినిధులు ఆ ఇళ్లను బాధితులకు అందించే ప్రక్రియను ప్రారంభించకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా లబ్ధిదారుల ఎంపిక అనధికారికంగా చేసేందుకు ఓ రహస్య భేటీ కూడా జరిగినట్టు కవిటిలో గుసగుసలువినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కొందరు ఇళ్లకోసం ఎదురుచూపులు చూస్తున్న తెలుగుతమ్ముళ్ల అనుయాయులైన లబ్ధిదారుల నుంచి రేట్లు కూడా ఫిక్స్ చేసుకున్నారనే వాదన ప్రచారంలో ఉంది. వాస్తవానికి ఏడాది క్రితం జరగాల్సిన లబ్ధిదారుల ఎంపిక నేటికీ పూర్తిచేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కవిటి చింతామణిగుడి పక్కన కొనుగోలు చేసిన కాలనీలో ఈ ఇళ్లను నిర్మించారు. కానీ అప్పట్లోనే కొంతమందికి ఇళ్ల పట్టాలు కూడా కేంద్ర మాజీ మంత్రి కృపారాణి హయాంలో మాజీ ఎమ్మెల్యే నరేష్కుమార్ అగర్వాలా ఒక పట్టా ఇచ్చి కాలనీలో లబ్ధిదారుల ఎం పిక చేసినప్పటికీ ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. వాస్తవానికి ఈ ఇళ్లకు సంబంధించి కిటికీలు తదితర సామగ్రి విరిగిపోయి దెబ్బతిన్నాయి. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో దిక్కుతోచని దీనస్థితిలో అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా ఈ ఇళ్లు ఉపయోగపడుతున్నాయి. విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్న పాలకులు తీరు పై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నాసిరకంగా నిర్మాణాలు సోంపేట పట్టణంలో పది సంవత్సరాలుగా 110 మంది లబ్ధిదారులు ఇళ్ల స్థలాల పట్టాలు చేత పట్టుకుని స్థలాల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. 2003లో సోంపేట పట్టణంలోని 110 మంది పేదలకు అప్పటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. వివిధ కారణాల వల్ల లబ్ధిదా రులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోయారు. 2014లో హుద్‌హుద్ తుపాను రావడంతో సోంపేట మండలాలనికి హుద్‌హుద్ ఇళ్లు 128 మంజూ రయ్యాయి. వీటిని అప్పట్లో స్థలాలు ఇచ్చినవారిని లబ్ధిదారులుగా గుర్తించి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. మీ ఇంటి కల నెరవేరేందుకు హుద్‌హుద్ ఇళ్ల పేరిట బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టి ఇళ్లను అందజేస్తామని ప్రజా ప్రతినిధులు తెలిపారు. పదిహేను సంవత్సరాలుగా తాము కంటున్న కలలు సాకారమవుతున్నందుకు సంతోషపడ్డారు. పేదల గూడు నిర్మించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు, ప్రమాణాలు పాటిం చాల్సిన అవసరం ఉన్నా నాసిరకం నిర్మాణాలు చేపడుతుండడంతో ఇళ్లు ఉంటాయా కూలుతాయా అనే అనుమానాలు లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు. 2016లో శంకుస్థాపన స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ హుదూద్ ఇళ్ల నిర్మాణాలకు 2016 సంవత్సరం ఏడో నెలలో సోంపేట పట్టణంలోని నూకలమ్మ కొండపై శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ విలువ రూ.5.09 కోట్లతో 128 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. నాసిరకపు నిర్మాణంతో ఇళ్లు పూర్తికాకముందే కూలిపోతున్నాయి. మరో రెండు సంవత్సరాలు ఆగాతే పూర్తిగా కూలిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవస రం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తి పడడంతో గుత్తేదారుడు తనకు నచ్చినట్టు నిర్మాణాలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికా రులు, ప్రజా ప్రతినిధులు స్పందించి నాణ్యమైన నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాల ని స్థానికులు, లబ్ధిదారులు కోరుతున్నారు. మొ త్తం 128 మందికి ఇళ్లు మంజూరు చేయాల్సి ఉండంగా 110 మంది లబ్ధిదారులను గుర్తించి వారిలో 85 మందికి మాత్రమే అర్హులుగా ప్రకటించారు. పట్టాలు అందజేసిన మిగతావారికి వివిధ కారణాలను సాకుగా చూపి ఇళ్లు మంజూరు చేయలేదు. దీంతో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.లక్ష నుంచి రూ.లక్షా యాభైవేల వరకు వసూలు చేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది హుదూద్ ఇళ్ల నిర్మాణంలో తగు జాగ్రత్తలు తీసుకొని, నాణ్యమైన నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ గుత్తేదారుడు ఇష్టారా జ్యంగా ఇళ్లు నిర్మిస్తున్నా ప్రజా ప్రతినిధులు చూసి చూడనట్టు వ్యవహరించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి లబ్ధిదారులకు నాణ్యమైన ఇళ్లు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలి. – తడక జోగారావు, వైఎస్సార్ సీపీ మండల కమిటీ అధ్యక్షుడు అనుమానాలకు తావిస్తోంది కవిటిలో హుదూద్ బాధితులకు నిర్మించిన 64 ఇళ్ల ను లబ్ధిదారులకు ఇప్పటి కీ అందించలేదు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ అధికారులుగా నీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ లబ్ధిదారుల ఎంపికలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థంకావడం లేదు. ఇప్పటికే ఇళ్ల కేటాయింపు, లబ్ధిదారుల ఎంపికకు సంబం ధించిన బేరసారాలు జోరుగా సాగాయన్న వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. – పీఎం తిలక్, మాజీ ఎంపీపీ, కవిటి మండలం -
వైఎస్సార్ సీపీలో చేరిన బీజేపీ నాయకులు
సాక్షి, విజయనగరం: జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, మహిళా మోర్చా నాయకురాలు రమణిలు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ కండువాలతో సాదరంగా వైఎస్ జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు 200 మంది బీజేపీ కార్యకర్తలు కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. అనంతరం మధు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర దేశ రాజకీయాల్లో మరెవ్వరికి సాధ్యం కాని ఘనత అని తెలిపారు. వైఎస్ జగన్‌కు లభిసున్న ప్రజాదరణ అపూర్వం అని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా విజయనగరం జిల్లాలో టీడీపీ నేతలు చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. వైఎస్ జగన్‌ను కలిసిన హుద్‌హుద్ తుపాన్ బాధితులు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్‌ను హుద్‌హుద్ తుపాన్ బాధితులు కలిశారు. మూడేళ్లయిన ప్రభుత్వం తమకు ఇళ్లు ఇవ్వలేదని జననేతకు ఫిర్యాదు చేశారు. ఇళ్ల జాబితా ప్రకటించి మళ్లీ రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇళ్లు అడిగితే అధికారులు డబ్బులు అడుగుతున్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. మూడేళ్లుగా వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గీత, ఎంపీ అశోక్ గజపతిరాజులు తమను పట్టించుకోవడం లేదని అన్నారు. థర్డ్ పార్టీ విధానం రద్దుపై సానుకూలత వ్యక్తం చేసిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్‌ను కాంట్రాక్టు విద్యుత్ కార్మికులు కలిశారు. థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని జననేతకు వారు వినతిపత్రం అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో కాంట్రాక్టు ఉద్యోగులను నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచుతామని, క్రమబద్దీకరిస్తామని ఇచ్చిన హామీలు అమలు చేయలేదని వారు జననేతకు తమ సమస్యలను నివేదించారు. వారి సమస్యలపై స్పందించిన వైఎస్ జగన్ థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. ఉద్యోగుల విద్యార్హత ఆధారంగా కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత వారు మాట్లాడుతూ.. చంద్రబాబు మోసాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తాము వైఎస్ జగన్ మద్దతు తెలుపుతామని ప్రకటించారు. వైఎస్ జగన్‌ను కలిసిన శెట్టిబలిజ నేతలు శెట్టిబలిజ సామాజిక వర్గం నేతలు పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను తాము ఎదుర్కొంటున్న సమస్యలపై కలిసి వినతి పత్రం అందజేశారు. శెట్టిబలిజ కులాన్ని ఉత్తరాంధ్రలో తొలి నుంచి బీసీలుగా పరిగణించారని.. కానీ 2017 నుంచి ఓసీలుగా పరిగణిస్తూ ప్రభుత్వం ధ్రువపత్రాలు విడుదల చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తమ వర్గానికి చెందిన విద్యార్థులు నష్టపోతున్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. లోకల్ గవర్నమెంట్స్ ఛాంబర్ ప్రతినిధులు వైఎస్ జగన్‌ను కలిశారు. పంచాయతీ ఎన్నికలు వెంటనే నిర్వహించి గ్రామ స్వరాజ్యాన్ని కాపాడాలని ఛాంబర్ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు వినతి పత్రం అందజేశారు. అలాగే న్యాయవాదులు కూడా వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. జనసంద్రంగా విజయనగరం మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న విజయనగరం నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొంది. సాంస్కృతిక రాజధాని విజయనగరం పట్టణంలో అడుగుపెట్టిన జననేతకు ప్రజలు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. పులివేషాలు, కోలాటం, గరగ నృత్యం, తప్పెట గుళ్లుతో స్వాగతం పలికి వైఎస్ జగన్‌పై తమ ప్రేమను చాటుకున్నారు. పట్టణంలోని రోడ్లన్ని జనసంద్రంగా మారాయి. విశాఖ-రాయ్‌పూర్ జాతీయ రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. పాదయాత్ర సాగుతున్న మార్గంలో వైఎస్ జగన్ రాకకోసం వేల సంఖ్యలో మహిళలు ఎదురు చూస్తున్నారు. ఈ సాయంత్రం మూడు లాంతర్ల జంక్షన్లో జరిగే భారీ బహిరంగ సభలో జననేత ప్రసగించనున్నారు. -
మీ కొమ్మలలోచివురులు మేమై..