Country Garden: కరోనా మహమ్మారి ప్రపంచ పరిస్థితులనే తలకిందులు చేసింది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించేశాయి. ఇప్పటికి కూడా ఆ ప్రభావం ఏదో ఒక మూల కనిపిస్తూనే ఉంది. చైనాలో ఒక దిగ్గజ రియల్ ఎస్టేట్ కంపెనీ గతంలో దాదాపు రూ. 6 లక్షల కోట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే.. కాగా ఇదే బాటలో మరో కంపెనీ కూడా కొనసాగుతున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, ప్రాపర్టీ డెవలపర్ 'కంట్రీ గార్డెన్' నష్టాల్లో కూరుకుపోయినట్లు, మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికి సుమారు 7.6 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 57వేల కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కంపెనీ షేర్లు కూడా చాలా వరకు కుప్పకూలాయి.
ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగినిపై నిఘా - పర్ఫామెన్స్ చూసి ఖంగుతిన్న కంపెనీ!
గత సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ 265 మిలియన్ డాలర్ల లాభంతో ఉండేది, ఆ తరువాత క్రమంగా నష్టాల్లోనే ముందుకు సాగింది. మొత్తం మీద అటు లాభాలు.. ఇటు కంపెనీ షేర్లు పతనమవుతున్నాయి. దీంతో కంట్రీ గార్డెన్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! ప్రపంచమే సలాం కొట్టేలా..
కంట్రీ గార్డెన్ కంపెనీ దాదాపు మూడువేల హోసింగ్ ప్రాజెక్టులను చేపడుతున్నట్లు, ఇందులో సుమారు 70 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. కంపెనీ ఇదే తీరుగా నష్టాల్లోనే పయనిస్తే వీరందరి భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment