రియల్ ఎస్టేట్ మార్కెట్లో రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లలో భూముల అమ్మకాలు, ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 2024 ఆగష్టులో రూ. 4043 కోట్ల విలువైన గృహాలు హైదరాబాద్‌లో అమ్ముడైనట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించిన నివేదికలో ప్రస్తావించింది. ఇది అంతకు ముందు ఏడాది కంటే 17 శాతం ఎక్కువ.
ఆగష్టు 2024లో హైదరాబాద్‌లో 6439 ఇళ్ల రిజిస్ట్రేషన్స్ జరిగినట్లు సమాచారం. ఈ రిజిస్ట్రేషన్స్ అంతకు ముందు ఏడాది ఆగష్టు నెల కంటే కూడా ఒక శాతం తక్కువ. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఆగష్టు నెల వరకు హైదరాబాద్‌లో 54483 (ఎనిమిది నెలల కాలంలో) ఇల్లు అమ్ముడయ్యాయి. ఈ అమ్మకాలు అంతకు ముందు ఏడాది కంటే 41 శాతం ఎక్కువ.
ఇదీ చదవండి: రూ.1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు.. ఇవే!
నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకారం ఇళ్ల అమ్మకాలు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. ఆగష్టులో 50 లక్షల రూపాయల విలువైన ఇళ్ల అమ్మకాలు 67 శాతం. రూ. కోటి కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల అమ్మకాలు 15 శాతం. ఈ అమ్మకాలు అంతకు ముందు ఏడాది ఇదే నెలకంటే కూడా ఎక్కువే అని గణాంకాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment