నివాస గృహ మార్కెట్‌కు పూర్వవైభవం! | Real Estate Business Get Old Glory | Sakshi
Sakshi News home page

నివాస గృహ మార్కెట్‌కు పూర్వవైభవం!

Published Mon, Jul 8 2019 12:31 PM | Last Updated on Mon, Jul 8 2019 12:31 PM

Real Estate Business Get Old Glory - Sakshi

భారతీయ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో గత కొన్నేళ్లల్లో వృద్ధి నెమ్మదించింది. రెరా, జీఎస్‌టీ వంటివి రియల్‌ ఎస్టేట్‌ రంగం కొలుకోవడానికి కీలకమైన అంశాలు. రెరా, జీఎస్‌టీ అమలు చేసిన తర్వాత దేశంలోని 8 ప్రధాన పట్టణాల్లో 2018లో గృహాల అమ్మకాల్లో 6 శాతం వృద్ధి అంచనాలు వెలువడ్డాయి. 2017తో పోలిస్తే 2018లో 75 శాతం కొత్త ప్రాజెక్టుల్లో అమ్మకాలు జరగ్గా, అమ్ముడు కాని ప్రాజెక్టులు 11 శాతానికి తగ్గాయి. ప్రస్తుతం, గృహ, వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌లో వృద్ధి కనిపిస్తోంది. దేశంలో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ 2030 నాటికి ట్రిలియ¯Œ  డాలర్లుగా ఉండొచ్చని ఒక అంచనా. ఈ రంగం సానుకూలంగా మారడానికి కారణమైన అంశాలను పరిశీలిస్తే...రవి నారాయణసెక్యూర్డ్‌ అసెట్స్‌ హెడ్,ఐసీఐసీఐ బ్యాంకు  

రెరా, జీఎస్‌టీ
2016లో రెరా చట్టం, 2017లో జీఎస్‌టీ అమల్లోకి వచ్చింది. ఇవి రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెనుమార్పులకు నాంది పలికాయి. ఈ నిర్మాణాత్మక సంస్కరణలు నియంత్రణ విధానాన్ని బలోపేతం చేశాయి. అంతేకాకుండా మార్కెట్‌ స్థిరీకరణకు ఉపయోగపడ్డాయి. దీంతో స్థిరమైన వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు ఇవి తోడ్పడ్డాయి. కొనుగోలుదారులకు సాధికారత కల్పించడం ద్వారా గృహాలకు డిమాండ్‌ గణనీయంగా వృద్ధి చెందడంలో రెరా సహాయపడింది. తద్వారా ఈ రంగంలో సీరియస్‌గా పనిచేసే సంస్థలు ముందు నిలవడంలో సాయపడుతుంది. సమయానికి ప్రాజెక్టు పూర్తి అవుతుందన్న భరోసాతోపాటు వినియోగదారుల్లో ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఇప్పటికీ ఈ పరిశ్రమ మార్పుల దశలో ఉండగా, దీర్ఘకాలంలో మాత్రం బాగా వృద్ధి చెందనుంది. జీఎస్‌టీ సైతం ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పునరుద్ధరణలో అతి కీలకమైన పాత్ర పోషిస్తోంది. పారదర్శకత, జవాబుదారీతనం, సరళీకృత పన్నుల విధానం సాధ్యమవుతాయి. 2019 ఏప్రిల్‌ 1 నుంచి జీఎస్‌టీ రేట్ల తగ్గింపు అమల్లోకి వచ్చింది. ఇది ఈ రంగానికి మరింత ఊతమివ్వడంతోపాటు గృహాలకు డిమాండ్‌ను సైతం పెంచుతుంది. ప్రీమియం గృహ విభాగంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఇప్పుడు జీఎస్‌టీ 5 శాతంగా ఉంది. గతంలో ఇది 12 శాతంగా ఉండేది. అందుబాటు ధరల గృహాలకు ఇది 8 శాతం నుంచి 1 శాతానికి తగ్గింది. జీఎస్‌టీ కౌన్సిల్‌ ఇప్పుడు ఇ¯Œ పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ను అమలు చేస్తుండడం వల్ల కొనుగోలుదారుల సెంటిమెంట్‌ గణనీయంగా పెరగనుంది. 

అందుబాటులో గృహ విభాగం  
నిర్మాణాత్మక సంస్కరణలతోపాటు ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల కొనుగోలుదారులు ముందుకు రావడంతో ఈ రంగంలో రికవరీ సాధ్యమయింది. స్టాండర్డ్‌ డిడక్ష¯Œ  రూ.40వేల నుంచి రూ.50వేలకు పెరగడం, రూ.5 లక్షల్లోపు ఆదాయం కలిగిన వారికి పూర్తి పన్ను రాయితీ, మౌలిక వసతులు,  కనెక్టివిటీ అన్నవి మెరుగైన పెట్టుబడులకు కారణమయ్యాయి. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌లో నివాసిత  ప్రాజెక్టుల విభాగం వృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి అందరికీ ఇళ్లు అన్న లక్ష్యమే కారణం. అందుబాటు ధరల గృహ వినియోగదారులు రానున్న కాలంలో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ వృద్ధికి తోడ్పడనున్నారు.

మధ్య తరగతికి ప్రయోజనాలు
అందుబాటులో గృహ విభాగంలో ఇప్పటికే పెట్టుబడులు కూడా పెరిగాయి. 2018లో నూతన సరఫరాలో ఇది 41 శాతంగా ఉంది. ప్రభుత్వం ఇప్పుడు క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ పథకాన్ని 2020 మార్చి వరకు పొడిగించింది. దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలు (ఈడబ్ల్యూఎస్‌), అల్పాదాయ వర్గాలు (ఎల్‌ఐజీ), మధ్యతరగతి వర్గాల (ఎంఐజీ) వారికి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం ద్వారా వడ్డీ రాయితీలు అందిస్తున్నారు. 2019 ఏప్రిల్‌ నాటికి 4.45 లక్షల కుటుంబాలకు రూ.10వేల కోట్ల రాయితీని క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ ద్వారా అందించారు. గృహ రుణ రాయితీలు, స్వల్ప జీఎస్‌టీ ధరల నుంచి అధిక శాతం కొనుగోలుదారులు ప్రయోజనం పొందుతున్నారు. స్టూడెంట్‌ హౌసింగ్‌ వంటి నూతన అస్సెట్‌ క్లాసెస్‌ పెరుగుతుండడంతో నివాసిత రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ కోలుకునేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement