హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇళ్ల అద్దెలు 24 శాతం పెరిగాయి. అంతేకాదు, దేశవ్యాప్తంగా 13 పట్టణాల్లో సగటున 22.4 శాతం మేర అద్దెలు పెరిగినట్టు (క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు) మ్యాజిక్‌బ్రిక్స్ రెంటల్ ఇండెక్స్ ప్రకటించింది. అదే క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఈ పెరుగుదల 4.6 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్) గణాంకాలను మ్యాజిక్‌బ్రిక్స్ విడుదల చేసింది.
మ్యాజిక్‌బ్రిక్స్ ప్లాట్‌ఫామ్‌పై 2 కోట్లకు పైగా కస్టమర్ల ప్రాధాన్యతల ఆధారంగా ఈ నివేదికను సంస్థ రూపొందించింది. వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు థానేలో ఇళ్ల ధరలు 57.3 శాతం, గురుగ్రామ్‌లో 41.4 శాతం, గ్రేటర్ నోయిడాలో 28.7 శాతం, నోయిడాలో 25.2 శాతం చొప్పున పెరిగాయి. ఈ పట్టణాల్లో అద్దెల డిమాండ్‌లో యువత (18.34 ఏళ్లు) పాత్ర 67 శాతంగా ఉంది. 41 శాతం మంది కిరాయిదారులు రూ.10,000–30,000 మధ్య అద్దెల ఇళ్లకు మొగ్గు చూపిస్తున్నారు.
అద్దె ఇళ్లల్లో 52.7 శాతం సెమీ ఫర్నిష్డ్ ఇళ్లకే డిమాండ్ ఉంటోంది. కానీ, వీటి సరఫరా 48.7 శాతంగా ఉంది. ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న పట్టణీకరణ, తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిన పరిస్థితులు అద్దెలు పెరగడానికి కారణాలుగా మ్యాజిక్‌బ్రిక్స్ సీఈవో సుధీర్‌పాయ్ పేర్కొన్నారు. ఒకవైపు అద్దె ఇళ్లకు అధిక డిమాండ్, మరోవైపు సరఫరా తగినంత లేకపోవడం ధరలను పెంచుతున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment