rajiv swagruha plots
-
Bandlaguda: రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలానికి అనూహ్య స్పందన
సాక్షి, హైదరాబాద్: బండ్లగూడ, పోచారంలలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు హెచ్ఎండీఏ నిర్వహించిన వేలానికి వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మొత్తం 3,716 ఫ్లాట్లకు సంబంధించి 39,082 మంది వినియోగదారులు ఆన్లైన్లో బిడ్లు దాఖలు చేశారు. ఇందులో బండ్లగూడలోని 2,246 ఫ్లాట్లకు 33,161 మంది బిడ్లు దాఖలు చేశారు. పోచారంలోని 1470 ఫ్లాట్టకు 5921 మంది బిడ్లు దాఖలు చేశారు. బిడ్లు దాఖలు చేసిన వారిలో లాటరీ ద్వారా ఎంపిక చేసి ఫ్లాట్లను కేటాయించనున్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి పోచారం ఫ్లాట్స్ వినియోగదారులకు లాటరీ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఫేస్బుక్, యూట్యూ బ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ నిర్వహిస్తున్నారు. బండ్లగూడ ఫ్లాట్స్‌కు మంగళవారం లాటరీ నిర్వహించనున్నారు. బండ్లగూడ డీలక్స్ ఫ్లాట్స్ వినియోగదారులకు బుధవారం లాటరీ నిర్వహించనున్నట్లు హెచ్ఎండీఏ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. (క్లిక్: పబ్ కేసులో మరో ట్విస్ట్.. కోర్టును ఆశ్రయించిన పోలీసులు) -
తక్కువ ధరకే ప్రభుత్వ ఫ్లాట్లు,రాజీవ్ స్వగృహ ఇళ్ల కోసం ఎగబడుతున్న జనం!
తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ ఇళ్లను సేల్కు పెట్టింది. గతంలో కట్టిన ఇళ్లను అమ్మేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. తక్కువ ధరకే ఫ్లాట్లు అమ్మకానికి రావడంతో.. వాటిని సొంతం చేసుకునేందుకు కొనుగోలు దారులు పోటీపడుతున్నారు. ప్రభుత్వ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం..బండ్లగుడాతో పాటు పోచారంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్ల అమ్మకానికి ఈనెల11న హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఫ్లాట్ల అమ్మకపు నోటిఫికేషన్‌కు ఊహించని రీతిలో రెస్సాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాట్ల ధర తక్కువ కావడంతో మే 12నుంచి ప్రారంభమైన అప్లికేషన్ల రిజిస్ట్రేషన్లు మే 23 వరకు 3వేల ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు 14వేల మంది అప్లయ్ చేశారు. ఈ అప్లికేషన్ల సంఖ్య 20రోజుల్లో 30వేలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 3,271 ఫ్లాట్లు హైదరాబాద్ బండ్లగూడలో 1501 ఫ్లాట్లు, గట్కేసర్ సమీపంలో ఉన్న పోచారంలో 1470 ఫ్లాట్లను అమ్మకానికి పెట్టింది.వచ్చే నెల 14వ తేదీన గడువు ముగుస్తుండడంతో ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు భారీ ఎత్తున అప్లయ్ చేస్తున్నారు. లాటరీ సిస్టమ్‌లో స్వగృహ ఫ్లాట్లను అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం..లాటరీ ద్వారా వివిధ ఫ్లాట్ల స్కైర్ ఫీట్ విలువ ఎంతనేది ఫైనల్ చేయనుంది. ఇందుకోసం ఒక వ్యక్తి రూ.1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉండగా..లాటరీలో కార్నర్ ఫ్లాట్ల కొనుగోలు దారుల కుటుంబ సభ్యులు, వారి బంధువులతో పాటు ఉద్యోగులు సైతం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.కాగా పెండింగ్‌లో ఫ్లాట్ల పనులను త్వరగా పూర్తి చేసి రీసేల్ పెట్టే అవకాశం ఉందని, అదృష్టం ఉంటే రీసేల్‌లో సైతం ఫ్లాట్లను సొంతం చేసుకోవచ్చు. స్వగృహా ఫ్లాట్లును ఎక్కడ ఎక్కువగా కొంటున్నారంటే ఓఆర్ఆర్, నాగోల్ మెట్రోస్టేషన్, సిటీ దగ్గర్లో ఉండడంతో పోచారం కంటే బండ్లగూడ స్వగృహలో ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు మక్కువ చూపుతున్నారు. కాబట్టే 14వేల అప్లికేషన్లలో 12వేల మంది బండ్లగూడ ఫ్లాట్లపై మక్కువ చూపుతుంటే కేవలం 2వేల మంది మాత్రమే పోచారం ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు అప్లికేషన్లు పెట్టుకున్నారు. బండ్లగూడా స్వగృహా ఫ్లాట్లు ఎన్నంటే మే 23 వరకు బండ్లగూడాలో 345..3బీహెచ్‌కే డీలెక్స్ ఫ్లాట్లను, 444..3బీహెచ్‌కే ఫ్లాట్లను,712..2బీహెచ్‌కే స్వగృహా ఫ్లాట్ల కోసం అప్లికేషన్లు వచ్చాయి. పోచారం స్వగృహా ఫ్లాట్లు ఎన్నంటే మే 23 వరకు పోచారంలో 91..3బీహెచ్‌కే డీలెక్స్ ఫ్లాట్లు, 53..3బీహెచ్‌కే ఫ్లాట్లు, 884..2బీహెచ్‌కే ఫ్లాట్లు, 442..1బీహెచ్‌కే ఫ్లాట్ల కోసం అప్లికేషన్లు వచ్చాయి. -
పట్టణ పక్కా గృహ పథకానికి ప్రభుత్వం మంగళం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లావ్యాప్తంగా సొంతిల్లు కల సాకారం చేసుకునేందుకు 3లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కేవలం రచ్చబండ కార్యక్రమాల్లోనే 2.19 లక్షల మంది అర్జీలు సమర్పించగా, వివిధ రూపాల్లో మరో 80వేల దరఖాస్తులు అధికారుల దరిచేరాయి. అయితే, ప్రభుత్వం పట్టణ గృహనిర్మాణ పథకాలను విస్మరించడంతో బడుగుల గూడు కల నెరవేరడం లేదు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) కూడా గృహనిర్మాణ పథకాలపై అంతగా ఆసక్తి కనబరచడం లేదు. దీంతో యూపీహెచ్ పథ కం అటకెక్కింది. మరోవైపు వివిధ రూపాల్లో వచ్చిన 18,398 అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన జీహెచ్ఎంసీ, జిల్లా యంత్రాంగం లబ్ధిదారుల స్థితిగతులపై సామాజిక ఆర్థిక సర్వే కూడా నిర్వహించింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ల సిఫార్సులతో 1,284, సీఎంవో నుంచి 1,150, ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు సూచించిన 8,362 అర్జీలు సహా కుల సంఘాలు ఇచ్చిన 19,881 దరఖాస్తులు అధికారులకు చేరాయి. శివారు ప్రాంతాల్లో స్థలాల కొరత ఉండడం, ఉన్న కొద్ధిపాటి స్థలాల ధరలు ఆకాశన్నంటడంతో ప్రభుత్వం పట్టణ హౌసింగ్‌ను పక్కనపెట్టింది. స్థలాలను ఎంపిక చేసినప్పటికీ, మౌళిక సదుపాయాల కల్పనకు నిధుల సమస్య ఉత్పన్నమవుతుండడంతో జీహెచ్ఎంసీ గృహ నిర్మాణ పథకాలకు రాం రాం పలికింది. ఈ నేపథ్యంలోనే గతంలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప కాలనీల్లో ఇప్పటివరకు కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఆఖరికి వాటర్ బోర్డు కూడా మంచినీళ్లు సరఫరా చేయడం లేదు. ఈ తరుణంలో పట్టణ పక్కా గృహనిర్మాణ పథకం నిలిచిపోయిందని చెప్పవచ్చు. దానికితోడు జేఎన్ఎన్యూఆర్ఎం స్థానే ప్రవేశపెట్టిన రాజీవ్ ఆవాస్‌యోజన(రే) పథకం ఆచరణ యోగ్యం లేకపోవడంతో పట్టణ గృహ నిర్మాణాలకు గ్రేటర్ అంతగా ఆసక్తి చూపడంలేదు. దీంతో వైఎస్సార్ మరణానంతరం జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా ఒక ఇల్లు కూడా ప్రభుత్వం మంజూరు చేయలేకపోయింది. అడపాదడపా ఏడాది 2వేల చొప్పున గ్రామీణ నియోజకవర్గాలకు ఇళ్లు మంజూరు చేస్తున్నప్పటికీ, పట్టణ ప్రాంతాలను మాత్రం పూర్తిగా విస్మరించింది. మరోవైపు ఏయేటికాయేడు రాజధాని నగరానికి వలసల తాకిడి పెరగడంతో శివారు ప్రాంతాల్లో ఇళ్లకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. స్థలాలను గుర్తిస్తున్నాం: కలెక్టర్ శ్రీధర్ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. గృహానిర్మాణ సముదాయాలకు అవసరమైన స్థలాలను గుర్తించమని ఆర్డీవోలకు ఆదేశాలిచ్చా. స్థలాలను ఎంపిక చేసిన అనంతరం నిధుల సర్దుబాటుకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలను చేపడతాం. ఖాళీగా ఉన్న 9వేల మంది ఇళ్లను అర్హులైనవారికీ కేటాయించడమేకుండా, స్థానికులకు కూడా కొంత మేర అవకాశం కల్పించాలని నిర్ణయించాం. -
ప్లాట్ల వేలం రణరంగం
మహబూబ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్ మండలం సాయిబాబగుడి సమీపంలో నిర్మిస్తున్న రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం ప్రక్రియ బు ధవారం రణరంగంగా మారింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య వేలంలో పాల్గొన్న టెం డర్దారులు ఉద్వేగానికి లోనై ఒకరిపై మరొకరు దాడులకు పూనుకున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. వేలం నిర్వహిస్తున్న సాయిబాబగుడి పరిసర ప్రాంతాల్లో యుద్ధవాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్లల్లో ఖాళీగా ఉన్న 28 ప్లాట్లకు వేలం వేస్తున్నట్లు అధికారులు ముందుగా ప్రకటించారు. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కోప్లాటుకు మాత్రమే డీడీలు కట్టాలని, ఆ డీడీని రెండు మూడు ప్లాట్లకు అనుమతించబోమని తేల్చిచెప్పారు. ఆ ప్రకారమే వేలంలో పాల్గొనేందుకు వచ్చిన వారంతా డీడీలను తీసుకుని అక్కడికి చేరుకున్నారు. ఇదిలాఉండగా వేలం వేసేందుకు సంస్థ ఇక్కడికి జనరల్ మేనేజర్ కాకుండా హైదరాబాద్ నుంచి ప్రత్యేకాధికారి రామకృష్ట వచ్చి ఒకరు ఎన్ని ప్లాట్లకైనా వేలంపాటలో పాల్గొనవచ్చని ప్రకటించారు. దీంతో అక్కడికి వచ్చిన వారంతా గందరగోళానికి గురై ఆగ్రహావేశాలకు లోనయ్యారు. అంతకుముందు తమకు అలా చెప్పలేదని, ఇప్పుడు అలా చెబితే పరిస్థితి ఏమిటని అధికారులను నిలదీశారు. నిబంధనల ప్రకారమే తాము వేలం నిర్వహిస్తున్నామని సదరు అధికారి సర్దిచెప్పారు. ఇలాగైతే రేటు పెరిగితే తామెలా కొనుగోలుచేయాలని అక్కడికివచ్చిన వారు వాపోయారు. మీరు ఒక విధంగా.. జీఎం మరోవిధంగా చెబుతారా? అంటూ మం డిపడ్డారు. టెండర్‌దారులు వినిపించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేసి మధ్యాహ్నం వరక వేలం ప్రక్రియను నిలిపేశారు. పోలీసుల రంగప్రవేశంతో వేలం.. మధ్యాహ్నం అనంతరం మహబూబ్‌నగర్ రూరల్ పోలీసులు రంగప్రవేశం చేయడంతో వేలంలో పాల్గొనే వారికి అధికారులు మరోమారు అవగాహన కల్పిం చి టెండర్లు కొనసాగించారు. ఇవే కాకుం డా, ఇంకా ఖాళీలు చాలా ఉన్నాయని, వా టన్నింటి కీ వేలం నిర్వహిస్తామని చెప్పడంతోఆందోళనకు దిగినవారు శాంతించా రు. తిరిగి వేలం పాట ప్రారంభమైంది. వేలం ఇలా.. 266 గజాలకు సంబంధించి 8ప్లాట్లకు 43మంది వేలం పాటలో పాల్గొన్నారు. వీ రిలో ఎక్కువ గజానికి రూ.6వేలు, తక్కు వ రూ.4300 కేటాయించారు. ఇక 200గజాలకు సంబంధించి మూడు ప్లాట్లకు గాను 28మంది పాల్గొనగా, ఎక్కువ రూ. 4800, తక్కువ రూ.4500 కేటాయిం చారు. 150 గజాలకు 12 ప్లాట్లకు గాను 25మంది, రూ.4500 ఎక్కువ రూ.2800 తక్కువ కేటాయించారు. 100గజాలకు సంబంధించి ఐదుప్లాట్లకు 13మంది పా ల్గొనగా, రూ.3300 ఎక్కువ, రూ.2600 తక్కువ చొప్పున కేటాయించారు. కార్యక్రమంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సుదర్శన్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆంజనేయులుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.