మహబూబ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్ మండలం సాయిబాబగుడి సమీపంలో నిర్మిస్తున్న రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం ప్రక్రియ బు ధవారం రణరంగంగా మారింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య వేలంలో పాల్గొన్న టెం డర్‌దారులు ఉద్వేగానికి లోనై ఒకరిపై మరొకరు దాడులకు పూనుకున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. వేలం నిర్వహిస్తున్న సాయిబాబగుడి పరిసర ప్రాంతాల్లో యుద్ధవాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.
వివరాల్లోకెళ్తే.. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్లల్లో ఖాళీగా ఉన్న 28 ప్లాట్లకు వేలం వేస్తున్నట్లు అధికారులు ముందుగా ప్రకటించారు. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కోప్లాటుకు మాత్రమే డీడీలు కట్టాలని, ఆ డీడీని రెండు మూడు ప్లాట్లకు అనుమతించబోమని తేల్చిచెప్పారు. ఆ ప్రకారమే వేలంలో పాల్గొనేందుకు వచ్చిన వారంతా డీడీలను తీసుకుని అక్కడికి చేరుకున్నారు. ఇదిలాఉండగా వేలం వేసేందుకు సంస్థ ఇక్కడికి జనరల్ మేనేజర్ కాకుండా హైదరాబాద్ నుంచి ప్రత్యేకాధికారి రామకృష్ట వచ్చి ఒకరు ఎన్ని ప్లాట్లకైనా వేలంపాటలో పాల్గొనవచ్చని ప్రకటించారు.
దీంతో అక్కడికి వచ్చిన వారంతా గందరగోళానికి గురై ఆగ్రహావేశాలకు లోనయ్యారు. అంతకుముందు తమకు అలా చెప్పలేదని, ఇప్పుడు అలా చెబితే పరిస్థితి ఏమిటని అధికారులను నిలదీశారు. నిబంధనల ప్రకారమే తాము వేలం నిర్వహిస్తున్నామని సదరు అధికారి సర్దిచెప్పారు. ఇలాగైతే రేటు పెరిగితే తామెలా కొనుగోలుచేయాలని అక్కడికివచ్చిన వారు వాపోయారు. మీరు ఒక విధంగా.. జీఎం మరోవిధంగా చెబుతారా? అంటూ మం డిపడ్డారు. టెండర్‌దారులు వినిపించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేసి మధ్యాహ్నం వరక వేలం ప్రక్రియను నిలిపేశారు.
పోలీసుల రంగప్రవేశంతో వేలం..
మధ్యాహ్నం అనంతరం మహబూబ్‌నగర్ రూరల్ పోలీసులు రంగప్రవేశం చేయడంతో వేలంలో పాల్గొనే వారికి అధికారులు మరోమారు అవగాహన కల్పిం చి టెండర్లు కొనసాగించారు. ఇవే కాకుం డా, ఇంకా ఖాళీలు చాలా ఉన్నాయని, వా టన్నింటి కీ వేలం నిర్వహిస్తామని చెప్పడంతోఆందోళనకు దిగినవారు శాంతించా రు. తిరిగి వేలం పాట ప్రారంభమైంది.
వేలం ఇలా..
266 గజాలకు సంబంధించి 8ప్లాట్లకు 43మంది వేలం పాటలో పాల్గొన్నారు. వీ రిలో ఎక్కువ గజానికి రూ.6వేలు, తక్కు వ రూ.4300 కేటాయించారు. ఇక 200గజాలకు సంబంధించి మూడు ప్లాట్లకు గాను 28మంది పాల్గొనగా, ఎక్కువ రూ. 4800, తక్కువ రూ.4500 కేటాయిం చారు. 150 గజాలకు 12 ప్లాట్లకు గాను 25మంది, రూ.4500 ఎక్కువ రూ.2800 తక్కువ కేటాయించారు. 100గజాలకు సంబంధించి ఐదుప్లాట్లకు 13మంది పా ల్గొనగా, రూ.3300 ఎక్కువ, రూ.2600 తక్కువ చొప్పున కేటాయించారు. కార్యక్రమంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సుదర్శన్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆంజనేయులుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్లాట్ల వేలం రణరంగం
Published Thu, Sep 12 2013 2:08 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement