
'చెట్టు కన్నతల్లి లాంటిది'
బాన్సువాడ: చెట్టు కన్నతల్లి లాంటిదని..ఇంటికి నాలుగు చెట్లు పెంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలోని మంత్రి స్వగ్రామం పోచారంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామంలోని ప్రజలకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. గ్రామంలో అందరూ చెత్తబుట్టలోనే వేయాలిన సూచించారు.
మూడు రోజులకు ఒక సారి రిక్షా వచ్చి చెత్తను తీసుకెళ్తుందని ఆయన తెలిపారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి గ్రామస్తులకు సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిలో చెట్లు పెంచాలని.. చెట్టు తల్లిలాంటిదని మంత్రి అన్నారు. అనంతరం మండలంలోని సోమేశ్వరం గ్రామంలో జరిగిన గ్రామసభలో మంత్రి పాల్గొన్నారు.