![HYD: Actor Sonu Sood Honored By Sanskruti Township - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/19/sonu.jpg.webp?itok=qaThNvB8)
సంస్కృతి టౌన్‌షిప్ వాసులతో సోనూసూద్
సాక్షి, పోచారం: సంస్కృతి టౌన్‌షిప్‌కు విచ్చేసిన బాలీవుడ్ రియల్ హీరో సోనూసూద్‌ను ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీగిరి వెంకట్ మాధవ్‌రెడ్డి గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన సంస్కృతి టౌన్‌షిప్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోందన్నారు. లాక్‌డౌన్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించిన సోనూసూద్‌ను సత్కరించుకోవడం సంతోషంగా ఉందని వెంకట్ మాధవ్ అన్నారు. కార్యక్రమంలో కాలనీ నాయకుడు వాకిటి శ్రీకాంత్‌రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.
చదవండి: ఆ పాత్ర మర్చిపోలేనిది: సోనుసూద్
పేదలకు మరో సహాయం చేసిన సోనూసూద్
Comments
Please login to add a commentAdd a comment