సాక్షి, సనత్‌నగర్ (హైదరాబాద్): ప్రముఖ సినీనటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆయన స్ఫూర్తితో హైదరాబాద్‌లోని బేగంపేటలో ఓ యువకుడు నిర్వహిస్తున్న ‘లక్ష్మీ సోనూ సూద్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్’ను శుక్రవారం సందర్శించారు. అనిల్ అనే యువకుడు కరోనా కష్టకాలంలో తన చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను తొలగించి, పూర్తిగా హైదరాబాదీ స్టైల్‌లో ఫుడ్ కోర్టు నిర్వహిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సోనూ.. ఆ ఫుడ్ కోర్టును సందర్శించేందుకు రాగా అనిల్ ఘనస్వాగతం పలికాడు. ఈ సందర్భంగా సోనూ తానే స్వయంగా ఎగ్ ఫ్రైడ్‌రైస్‌ను తయారు చేసుకుని ఆరగించారు. చదవండి: (విగ్రహం ఏర్పాటుపై సోనూసూద్ కామెంట్)
మరోసారి ఉదారతను చాటుకున్న సోనూసూద్
Published Sat, Dec 26 2020 1:13 AM | Last Updated on Sat, Dec 26 2020 12:50 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment