
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరోనా బారినపడ్డారు. అసెంబ్లీలో కరోనా పరీక్ష చేయించుకున్న ఎమ్మెల్యేకు మంగళవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా ఎమ్మెల్యే సంజయ్ పలువురిని కలిసినట్టుగా తెలిసింది. నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవితను ఆయన సోమవారం కలిసి అభినందించారు. కొద్ది రోజుల కిందట ఆయన కరోనా రోగులకు సేవలందించారు. ఎమ్మెల్యే సంజయ్ త్వరగా కోలుకోవాలని పార్టీ నేతలు ఆకాక్షించారు. ఇక ఇటీవల కరోనా బారినపడ్డ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, కోరుకంటి చందర్ బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల సంతోష్ గుప్త, కేపీ వివేకానంద్, మంత్రి హరీష్‌రావు, హోంమంత్రి మహమూద్ అలీ తదితరులు కోలుకున్న సంగతి తెలిసిందే.
(చదవండి: ఎమ్మెల్సీ ఉపఎన్నికలో సత్తా చాటిన టీఆర్‌ఎస్ )
Comments
Please login to add a commentAdd a comment