
ఎమ్మెల్సీ కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ ఎంపీటీసీ అరుణ. చిత్రంలో జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో నందిపేట బీజేపీ ఎంపీటీసీ అరుణ చావన్ ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. అరుణతో పాటు బీజేపీ నేతలకు కవిత గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నంది పేట జెడ్పీటీసీ యమున ముత్యం, ఎంపీటీసి మురళి, టీఆర్‌ఎస్ పార్టీ నందిపేట మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, అయిలాపూర్ సుదర్శన్, సిలిండర్ లింగం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment