సాక్షి, జగిత్యాల: క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ సహాయనిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అప్పుడప్పుడు వైద్యం వికటించడం సహజమని, డాక్టర్లే కాకుండా సిబ్బంది వల్ల కూడా తప్పు జరగొచ్చంటూ వ్యాఖ్యానించారు.
స్వయంగా డాక్టర్ అయిన సంజయ్ కుమార్ కు కంటి వైద్యంలో మంచి పేరుంది. డాక్టర్లు, చికిత్స గురించి సంపూర్ణ అవగాహన ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. ఒకటి రెండు సంఘటనల వల్ల ప్రభుత్వాసుపత్రుల పట్ల అభిప్రాయాన్ని చెడుగా మార్చుకోవద్దని కోరారు.
"మహిళ కడుపులో గుడ్డ ఉంచి కుట్లు వేశారన్నది రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఘటన.. కానీ ఇపుడు పేపర్లలో వస్తోందన్నారు. కింది స్థాయిలో ఒకరు చేసిన పొరపాటుకు మొత్తం వ్యవస్థను నిందించవద్దు. డాక్టర్లు, నర్సుల సమిష్ఠి బాధ్యతతో ఆపరేషన్లు జరుగుతాయని, ప్రభుత్వాసుపత్రులపై నమ్మకంతో రండి, మాతా శిశు ఆస్పత్రులలో ఉచితంగా వైద్యం చేయించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.
కాగా, జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటన గత వారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొడిమ్యాల మండలం నమిలికొండకు చెందిన నవ్యశ్రీ అనే మహిళకు పదహారు నెలల క్రితం.. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయింది. అయితే ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు కడుపులోనే క్లాత్ వదిలేయడం కలకలం రేపింది.
ఏడాది తర్వాత నవ్యశ్రీకి తీవ్ర కడుపు నొప్పి రావడంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకుంది. స్కానింగ్‌లో కడుపులో బట్ట ఉన్నట్టు గుర్తించగా.. వెంటనే ఆసుపత్రిలో సర్జరీ చేసి బట్ట తొలగించారు. ఈ మొత్తం విషయాన్ని లేఖలో పేర్కొంటూ నవ్యశ్రీ కుటుంబీకులు జగిత్యాల DMHOకు ఫిర్యాదు చేశారు.
చదవండి: నిప్పులకొలిమి.. ఎండకు వెళ్తే మండిపోతారు! డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment