
సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో, ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఐదు రోజులు పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుబాటులో ఉండటం లేదు. ఈ మేరకు ఆమె మంగళవారం ట్వీట్ చేశారు. అలాగే కరోనా బారిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
(చదవండి : ఎమ్మెల్యేకు కరోనా, నిన్ననే కవితకు విషెస్)
I wish for your speedy and healthy recovery Anna. As I recently came in contact with you, I’ll be quarantining myself for next 5 days as a precautionary measure. I humbly request @trspartyonline cadre to avoid visiting my office for next few days. https://t.co/7Meoco2UCZ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 13, 2020
Comments
Please login to add a commentAdd a comment