
న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్‌కుమార్ మిశ్రా పదవీకాలాన్ని అక్టోబర్ 15 వరకూ పెంచేందుకు అనుమతి కోరుతూ కేంద్రం బుధవారం సుప్రీంకోర్టు తలుపు తట్టింది.
63 ఏళ్ల మిశ్రా పదవీకాలాన్ని పదేపదే పెంచడం చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇటీవలే తప్పుబట్టడం తెలిసిందే. ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) సమీక్షకు సంజయ్ కుమార్ గైర్హాజరైతే భారత ప్రయోజనాలకు భంగకరమని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. అందువల్ల తమ పిటిషన్‌పై జూలై 28లోగా విచారణ జరపాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment