Solicitor General
-
లడ్డూ కల్తీపై పిటిషన్లు... విచారణ రేపటికి వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై నేటి సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. సోలిసిటర్ జనరల్ అభ్యర్థనతో చివరి నిమిషంలో విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు.గత విచారణ సమయంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు కొనసాగించాలా? లేదంటే స్వతంత్ర దర్యాప్తు జరిపించాలా? అనే అంశంపై కేంద్రాన్ని స్పష్టత కోరింది సర్వోన్నత న్యాయస్థానం. ఇందుకు ఇవాళ్టి లోపు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అభిప్రాయం చెప్పమని కోరింది.అయితే ఇవాళ 3గం.30ని. విచారణ జరగాల్సి ఉండగా.. రేపటి వరకు సమయం కావాలని సోలిసిటర్ జనరల్ అభ్యర్థించారు. దీంతో రేపు సుదీర్ఘంగా విచారిస్తామని, ఇరువైపుల వాదనలు వింటామని చెబుతూ విచారణను చివరినిమిషంలో వాయిదా వేసింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.నాలుగు పిటిషన్లపై విచారణ.. ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యితో అపవిత్రం అయ్యిందంటూ చేసిన ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అలాగే లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు, స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని అభ్యర్ధిస్తూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై సంపత్, శ్రీధర్, సురేష్ చవంకేలు వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నాలుగు వ్యాజ్యాలను కలిపి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కిందటి నెల 30వ తేదీన విచారణ జరగ్గా.. సీఎం హోదాలో బాధ్యతారాహిత్యంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషనర్ సుబ్రహ్మణ్య స్వామి తరఫున సీనియర్ న్యాయవాది రాజశేఖర్‌రావు, సంపత్, శ్రీధర్ తరఫున రాఘవ్ అవస్తీ, సురేష్ చవంకే తరఫున సీనియర్ న్యాయవాది సోనియా మాథుర్.. అలాగే ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, టీటీడీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. దాదాపు గంట పాటు ఇరుపక్షాల వాదనలు సాగగా.. వాటిని కోర్టు రికార్డు చేసింది.ఇదీ చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టు -
PM Narendra Modi: దేశాల సమన్వయంతోనే న్యాయ వితరణ
న్యూఢిల్లీ: నేరగాళ్లు ఖండాంతరాల్లో నేరసామ్రాజ్యాన్ని విస్తరించేందుకు సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్న వేళ దేశాలు సత్వర న్యాయ వితరణ కోసం మరింతగా సహకరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీలో కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘కామన్వెల్త్ దేశాల అటార్నీలు, సొలిసిటర్ జనరళ్ల సమావేశం’లో ఆయన ప్రసంగించారు. ‘‘ఒక దేశ న్యాయస్థానాన్ని మరో దేశం గౌరవించిన నాడే ఈ సహకారం సాధ్యం. అప్పుడే సత్వర న్యాయం జరుగుతుంది. క్రిప్టోకరెన్సీ, సైబర్ దాడుల విజృంభిస్తున్న ఈ తరుణంలో ఒక దేశ న్యాయస్థానం ఇచ్చే తీర్పులు, ఉత్తర్వులు మరో దేశంలోనూ అమలుకు సాధ్యమయ్యేలా సంస్కరణలు తేవాలి. అప్పుడే బాధితులకు తక్షణ న్యాయం అందుతుంది. ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నౌకాయానంలో ఇది సాధ్యమైంది. ఇకపై ఈ ఉమ్మడి విధానాన్ని కేసుల దర్యాప్తు, న్యాయవ్యవస్థలకూ విస్తరింపజేయాలి’’ అని అభిలషించారు. ఒక దేశంలో జరిగిన ఆర్థిక నేరాలు ఇంకొక దేశంలో అలాంటి కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. లా స్కూళ్లలో మహిళల అడ్మిషన్లు పెరగాలని, అప్పుడే న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. న్యాయవ్యవస్థకు టెక్నాలజీ బలం: సీజేఐ న్యాయ వితరణలో న్యాయ స్థానాలకు సాంకేతికత అనేది శక్తివంతమైన పరికరంగా ఎదిగిందని సర్వో న్నత న్యాయస్థానం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. అటార్నీల సదస్సులో సీజేఐ పాల్గొని ప్రసంగించారు. ‘‘ సత్వర న్యాయం అందించేందుకు న్యాయవ్యవస్థ సాంకేతికతను శక్తివంతమైన ఉపకరణంగా వాడుతూ సద్వినియోగం చేస్తోంది. సాంకేతికతలను ఎల్లప్పుడూ సమాన త్వం, సమ్మిళితత్వాన్ని దృష్టిలో ఉంచుకునే అభివృద్ధిచేయాలి. న్యాయం అందించేందుకు కామన్వెల్త్ దేశాలు ఉమ్మ డిగా కట్టుబడి ఉండాలి. న్యాయ వితరణ లో రాజకీయాలకు ఏమాత్ర జోక్యం లేకుండా చూడాల్సిన బాధ్యత న్యాయా ధికారులైన అటార్నీలు, సొలిసిటర్ జనరళ్లదే. అప్పుడే న్యాయవ్యవస్థ నైతిక త నిలబడుతుంది. సత్వర న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థకు టెక్నాలజీ బలం తోడైంది. ప్రభుత్వాధికారులకు అనవసరంగా సమన్లు జారీ చేసే సంస్కృతి పోవాలి’’ అని సీజేఐ అన్నారు. -
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ పదవీ విరమణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ రిటైరయ్యారు. ఆఖరి పనిదినమైన శుక్రవారం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సహ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ మాట్లాడుతూ..న్యాయవ్యవస్థ కోసం ముఖ్యంగా రాజ్యాంగ సంబంధ అంశాల్లో ఆయన అందించిన సేవలు నిరుపమానమని కొనియా డారు. 1979 నుంచి ఆయనతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆదిష్ అగర్వాల్ పాల్గొన్నారు. 2019 సెప్టెంబర్ 23న జస్టిస్ భట్ సుప్రీంకోర్టులో నియమితులై నాలుగేళ్లపాటు సేవలందించారు. పలు చారిత్రక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. 1958లో మైసూరులో జన్మించిన జస్టిస్ భట్ 1982లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. -
లంచం తీసుకున్న చట్టసభ సభ్యులకు విచారణ నుంచి మినహాయింపు ఉండదు
న్యూఢిల్లీ: చట్టసభ సభ్యుడు లంచం తీసుకొంటే తదుపరి విచారణ నుంచి అతడు ఎలాంటి మినహాయింపు, వెసులుబాటు పొందలేడని, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని అటార్నీ జనరల్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినప్పటికీ చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నప్పటికీ చట్ట ప్రకారం విచారించి, శిక్ష విధించాలని చెప్పారు. లంచం ఇచి్చనా, తీసుకున్నా అవినీతి నిరోధక చట్టం కింద విచారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చట్టసభల్లో మాట్లాడడానికి, ఓటు వేయడానికి లంచం తీసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి వెసులుబాటు ఉంటుందంటూ 1998 నాటి జేఎంఎం ముడుపుల కేసులో నాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కొన్ని వర్గాల విజ్ఞప్తి మేరకు ఈ తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పున:పరిశీలిస్తోంది. భాగస్వామ్యపక్షాల వాదనలు వింటోంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ఎదుట తమ వాదనలు వినిపించారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నట్లు ఒక్క సంఘటన బయటపడినా సరే విచారణ చేపట్టాలని తుషార్ మెహతా అన్నారు. లంచం స్వీకరించిన పార్లమెంట్ సభ్యుడికి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 105, 194 కింద విచారణ నుంచి వెసులుబాటు కలి్పంచవద్దని కోర్టును కోరారు. పార్లమెంట్ సభ్యుడికి కలి్పంచిన వెసులుబాట్లు, ఇచి్చన మినహాయింపులు అతడి వ్యక్తిగత అవసరాల కోసం కాదని గుర్తుచేశారు. చట్టసభ సభ్యుడిగా బాధ్యతలను నిర్భయంగా నిర్వర్తించడానికే వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు. ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. -
Manipur violence: రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలింది
న్యూఢిల్లీ: మణిపూర్‌లో జాతుల మధ్య వైరంలో మహిళలు సమిధలుగా మారిన వైనాన్ని సర్వోన్నత న్యాయస్థానం మరోమారు తీవ్రంగా తప్పుబట్టింది. మే నాలుగో తేదీన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరులో తిప్పిన ఘటనకు సంబంధించిన కేసుల విచారణ సందర్భంగా మణిపూర్‌లో శాంతిభద్రతలు, పోలీసుల పనితీరును సుప్రీంకోర్టు తూర్పారబట్టింది. సోమవారం జరిగిన కేసుల వాదోపవాదాలు మంగళవారమూ కొనసాగాయి. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందించింది. ‘ కేసులను సమర్థవంతంగా దర్యాప్తుచేయలేని స్థితిలో పోలీసులున్నారు. దర్యాప్తులో దమ్ము, చురుకుతనం లేదు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనల్లో ఆరువేలకుపైగా ఎఫ్ఐఆర్లు నమోదైతే ఎంత మందిని అరెస్టుచేశారు? నగ్న పరేడ్‌కు సంబంధించిన జీరో ఎఫ్ఐఆర్, సాధారణ ఎఫ్ఐఆర్, పూర్తి వివరాలు ఉన్నాయా ? హేయమైన ఘటన జరిగిన చాలా రోజులకు ఎఫ్ఐఆర్ నమోదైంది. కొన్ని ప్రాంతాల్లోకి పోలీసులు కూడా వెళ్లలేని అసమర్థత. పరిస్థితి చేయి దాటడంతో అరెస్టులు చేయలేని దుస్థితి. అక్కడ అసలు శాంతిభద్రతలు అనేవే లేవు. రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలింది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 6,523 ఎఫ్ఐఆర్ల నమోదు కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి వివరణ ఇచ్చారు. ‘ మేలో హింస మొదలైననాటి నుంచి ఇప్పటిదాకా 6,523 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నగ్న పరేడ్ ఉదంతంలో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో జువెనైల్సహా ఏడుగురిని అరెస్ట్‌చేశారు. ఘటన తర్వాత బాధిత మహిళల వాంగ్మూలం తీసుకున్నారు’ అని తెలిపారు. ఈ కేసులో 11 కేసులను సీబీఐకి బదిలీచేస్తున్నట్ల అట్నారీ జనరల్ ఆర్.వెంకటరమణి తెలిపారు. కాగా, వాంగ్మూలాల కోసం ఆ మహిళలను మళ్లీ విచారించవద్దని సీబీఐకు కోర్టు సూచించింది. తమ ముందు హాజరుకావాలని బాధిత మహిళలను సీబీఐ ఆదేశించిందన్న అంశాన్ని వారి లాయర్ నిజాం పాషా మంగళవారం కోర్టు దృష్టికి తీసుకురావడంతో ధర్మాసనం పై విధంగా మౌఖిక ఆదేశాలిచ్చింది. ఏడో తేదీ(సోమవారం రోజు)న స్వయంగా హాజరై వివరాలు తెలపాలని మణిపూర్ డీజీపీని కోర్టు ఆదేశించింది. 6,523 కేసుల్లో హత్య, రేప్, బెదిరింపులు, లూటీలు, విధ్వంసం ఇలా వేర్వేరుగా కేసులను విభజించి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. -
ఈడీ డైరెక్టర్‌ను కొనసాగిస్తాం
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్‌కుమార్ మిశ్రా పదవీకాలాన్ని అక్టోబర్ 15 వరకూ పెంచేందుకు అనుమతి కోరుతూ కేంద్రం బుధవారం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. 63 ఏళ్ల మిశ్రా పదవీకాలాన్ని పదేపదే పెంచడం చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇటీవలే తప్పుబట్టడం తెలిసిందే. ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సమీక్షకు సంజయ్ కుమార్ గైర్హాజరైతే భారత ప్రయోజనాలకు భంగకరమని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. అందువల్ల తమ పిటిషన్‌పై జూలై 28లోగా విచారణ జరపాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు. -
Yasin Malik: మరీ ఇంత నిర్లక్ష్యమా?
ఢిల్లీ: కశ్మీరీ వేర్పాటువాద నేత, ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్న అభియోగాలతో జీవిత ఖైదు అనుభవిస్తున్న యాసిన్ మాలిక్ ఉన్నపళంగా కోర్టులో ప్రత్యక్షం కావడంపై సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వర్చువల్‌గా విచారించే అవకాశం ఉన్నా.. కోర్టుకు తీసుకురావడం ఏంటని? జైలు అధికారులను ప్రశ్నించింది. అదే సమయంలో సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ అంశంపై కేంద్ర హోం శాఖకు ఓ ఘాటు లేఖ సైతం రాశారు. ఆదేశాలు ఇవ్వకున్నా సరే.. యాసిన్ మాలిక్‌ను అధికారులు విచారణకు తీసుకురావడాన్ని సుప్రీం కోర్టు శుక్రవారం తీవ్రంగా తప్పుబట్టింది. టెర్రర్ ఫండింగ్ కేసులో జీవిత ఖైదు పడిన యాసిన్ మాలిక్ ప్రస్తుతం ఢిల్లీ తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. తోటి ఖైదీల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలోనూ అతన్ని ప్రత్యేకంగా ఉంచారు కూడా. అలాంటిది.. వర్చువల్‌గా విచారించే ఛాన్స్ ఉన్నా.. జమ్ము కశ్మీర్ ప్రత్యేక కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన ఓ అభ్యర్థన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ సాగుతోంది. ఈ క్రమంలో.. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం జైలు అధికారులు యాసిన్ మాలిక్‌ను కోర్టుకు తీసుకొచ్చారు. చుట్టూ అధికారులున్నా.. మాలిక్ కోర్టు ప్రాంగణంలోనే కాసేపు కలియ తిరిగాడు. అయితే.. మాలిక్‌ను కోర్టులో భౌతికంగా హాజరుపర్చాలని కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని.. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వర్చువల్‌గా విచారించే అవకాశం ఉంది కాదా అని ధర్మాసనం ప్రశ్నించగా.. అందుకు వీలున్నా జైలు అధికారులు ఆ పని చేయలేదని అదనపు సోలిసిటర్ జనరల్ వివరించారు. ‘‘ఇది భద్రతా వైఫల్యం కిందకే వస్తుంది. యాసిన్ మాలిక్ ప్రాణాలకు సంబంధించిన అంశం ఇది. భవిష్యత్తులో అతన్ని బయటకు తీసుకురాకపోవడమే మంచిది’’ అని తెలిపారు. అయితే ఈ అంశం తమ పరిధిలో లేదని.. సంబంధిత బెంచ్ నుంచి ఆదేశాలు పొందాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తలతో కూడిన బెంచ్ అదనపు సోలిసిటర్ జనరల్‌కు సూచించింది. హోం శాఖకు లేఖ యాసిన్ మాలిక్‌ను జైలు నుంచి బయటకు తీసుకువస్తుండడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఓ ఘాటు లేఖ రాశారు. యాసిన్ మాలిక్‌కు పాక్ సంబంధిత ఉగ్ర సంస్థలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. అతనెంత కీలకమో హోంశాఖకు తెలుసు. ఇలా బయటకు తీసుకొస్తే.. అతను తప్పించుకునే అవకాశం ఉంది. లేదంటే అతన్ని ఎత్తుకెళ్లడమో కుదరకుంటే చంపేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది సర్వోన్నత న్యాయస్థానం భద్రతకు సంబంధించిన అంశం కూడా. జైలు అధికారులకు అతన్ని బయటకు తీసుకొచ్చే అధికారం ఉండదన్న విషయం గుర్తించాలి. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అని తుషార్ మెహతా లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై తీహార్ జైలు డీజీ విచారణకు ఆదేశిస్తూ.. రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని జైలు అధికారులను కోరారు. సుప్రీం కోర్టు నుంచి నిత్యం ఇలాంటి నోటీసులు సర్వసాధారణంగా వెళ్తుంటాయని.. అయితే జైలు అధికారులు వాటిని తీవ్రంగా పరిగణించినందునే మాలిక్‌ను కోర్టుకు తీసుకెళ్లి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1989లో నలుగురు ఐఏఎఫ్ సిబ్బందిని హతమార్చడంతో పాటు అప్పటి కశ్మీర్ హోం మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ కూతురు రుబియాను అపహరించిన వ్యవహరానికి సంబంధించిన కేసులో యాసిన్ మాలిక్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంది. అయితే.. యాసిన్ మాలిక్ విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 268 ఆదేశాలు ఉన్నాయి. అంటే.. కోర్టులో అతన్ని హాజరుపర్చడం నుంచి మినహాయింపు ఉంది. కానీ, జమ్ము కశ్మీర్ ప్రత్యేక కోర్టు(టాడా కోర్టు) అదనపు సెషన్స్ జడ్జి నిర్లక్ష్యంగా హాజరు పర్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలనే సవాల్ చేస్తూ.. సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
సొలిసిటర్ జనరల్‌గా మళ్లీ తుషార్ మెహతా
న్యూఢిల్లీ: సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా భారత సొలిసిటర్ జనరల్‌గా మళ్లీ నియమితులయ్యారు. 2018లో మొదటిసారిగా సొలిసిటర్ జనరల్‌గా నియమితులైన తుషార్ మెహతా పదవీ కాలాన్ని ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు పొడిగించింది. తాజాగా, మూడోసారి మరో మూడేళ్ల కాలానికి ఆయన్ను నియమిస్తూ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతోపాటు సుప్రీంకోర్టుకు ఆరుగురు అదనపు సొలిసిటర్ జనరల్‌ను మూడేళ్ల కాలానికి పునర్నియమించింది. వీరు..విక్రమ్‌జీత్ బెనర్జీ, కేఎం నటరాజ్, బల్బీర్‌సింగ్, ఎస్వీ రాజు, ఎన్ వెంకటరామన్, ఐశ్వర్య భాటి. -
తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసుపై సుప్రీంలో పూర్తయిన విచారణ
-
రాజకీయ విరాళాల స్వీకరణకు సరైన విధానమే
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల విధానం లోపభూయిష్టంగా ఉందంటూ, వాటి కొనుగోళ్లను ఆపాలంటూ గతంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై శుక్రవారం కేంద్రప్రభుత్వం స్పందించింది. ‘ రాజకీయ పార్టీలు విరాళాలు స్వీకరించేందుకు వినియోగిస్తున్న ఈ బాండ్ల వ్యవస్థ అత్యంత పారదర్శకమైంది. లెక్కల్లో లేని, నల్లధనం ఎంత మాత్రం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు చేరబోదు’ అని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సుప్రీంకోర్టులో స్పష్టంచేశారు. ‘ ప్రతిసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాండ్ల తంతు మొదలవుతోంది. తమకు వచ్చిన విరాళాల ఖాతాల ప్రతీ లావాదేవీ సమగ్ర సమాచారాన్ని రాజకీయ పార్టీలు స్పష్టంగా వెల్లడించట్లేవు. బాండ్ల విక్రయం ఆపండి’ అని పిటిషన్ వేసిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ ఎన్జీవో తరఫున హాజరైన లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. విస్తృత ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలిస్తే బాగుంటుందని మరో పిటిషనర్ తరఫున వాదిస్తున్న లాయర్ కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. దీంతో బాండ్ల ద్వారా పార్టీలు విరాళాలు పొందేందుకు అనుమతిస్తున్న చట్టాలను సవాల్ చేస్తున్న అంశాన్ని విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయాలా వద్దా అనేది డిసెంబర్ ఆరో తేదీన ఖరారుచేస్తామని సుప్రీం బెంచ్ పేర్కొంది. దాతల పేర్ల విషయంలో గోప్యత పాటించాలని కేంద్ర ప్రభుత్వం, పేర్లు బహిర్గతం చేయాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం.. సుప్రీంకోర్టులో గతంలో భిన్న వాదనలు లేవనెత్తాయి. -
‘వైవాహిక అత్యాచార’ పిటిషన్ల విచారణ.. కీలక పరిణామం
సాక్షి, ఢిల్లీ: వైవాహిక జీవితంలో బలవంతపు శృంగారాన్ని.. నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది ఢిల్లీ హైకోర్టు. ఈ క్రమంలో మరింత గడువు కోరుతూ.. పిటిషన్ విచారణ వాయిదా వేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని సోమవారం సున్నితంగా తిరస్కరించింది ఢిల్లీ హైకోర్టు. పిటిషన్లపై స్పందించేందుకు మరింత సమయం కావాలని కోరిన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్‌లకు ఫిబ్రవరి 10వ తేదీనే అభిప్రాయసేకరణకు సమాచారం అందించామని, అయితే ఇంకా స్పందన రాలేదని తెలిపారు. అయితే కోర్టు మాత్రం కేంద్రం విజ్ఞప్తిని తోసిపుచ్చింది. జస్టిస్ రాజీవ్ శక్ధేర్, జస్టిస్ సి హరిశంకర్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రం వైఖరిని ‘‘త్రిశంకు’’ లాంటిదంటూ పేర్కొంది. గడువు కోరే అంశం ఎప్పుడో దాటిపోయిందని గుర్తు చేసింది. Marital Rapeను నేరంగా పరిగణించాలంటూ పలు పిటిషన్లు ఢిల్లీ హైకోర్టులో దాఖలు అయ్యాయి. ఇదిలా ఉండగా.. భారతదేశం పరిస్థితుల నేపథ్యంలో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించేందుకు సిద్ధంగా లేమని గతంలో కేంద్ర ప్రభుత్వం ఓసారి పేర్కొంది. ఇష్టం లేకున్నా, ఆమె సమ్మతి లేకుండా బలవంతపెట్టి భార్యను శారీరకంగా అనుభవించడాన్ని నేరంగా పరిగణిస్తూ సంబంధిత చట్టాన్ని సవరించేందుకు సిద్ధంగా లేమని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. ‘‘అంతర్జాతీయ నిర్వచనం వేరు, భారత సమాజ స్థితిగతులు వేరు. లా కమిషన్ కూడా నివేదికలు సమర్పించే సమయంలో ఈ అంశాన్ని సిఫారసు చేయలేదు. ’’ అని కేంద్రం తరపున ఆ సందర్భంలో ప్రకటన వెలువడింది. సంబంధిత వార్త: మారిటల్ రేప్.. డబుల్ గేమ్ ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కోర్టుల్లో ఈ అంశంపై పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. 2017లో కేంద్రం స్టాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు.. ఆ తర్వాత కొత్తగా కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనను తీసుకోలేదు. మరోవైపు.. ఈ వ్యవహారంపై కేంద్రం ఈ ఏడాదిలో వాదనలు వినిపించకపోవడం గమనార్హం. సెక్షన్ 375 భారతీయ శిక్షాస్మృతి (IPC) మినహాయింపు 2 ప్రకారం.. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించకూడదు. అలాగే 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు లేని తన భార్యతో.. భర్త లైంగిక సంబంధం కలిగి ఉన్నా కూడా అది అత్యాచారం కాదని నిర్దేశిస్తుంది. భారతదేశంలో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని చాలా మంది న్యాయవాదులు, రాజకీయ నాయకులు, పౌరుల నుండి భారీ డిమాండ్ ఉంది. ఏది ఏమైనప్పటికీ, నేరీకరణ అనేది సామాజిక-చట్టపరమైన ప్రభావాన్ని కలిగి ఉంటుందని కేంద్రం వాదిస్తోంది. -
Pegasus: బహిరంగ పర్చలేం
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ అంశంపై కోర్టులో సమగ్ర అఫిడవిట్ సమర్పించలేమని, ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారమని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. తాము మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. పెగాసస్ హ్యాకింగ్ అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన కోర్టు సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించడం తెల్సిందే. పిటిషన్లపై సుప్రీం బెంచ్ సోమవారం విచారణ జరిపింది. ఈ కేసులో సమగ్ర ఆఫిడవిట్ దాఖలుపై ప్రభుత్వానికి పునరాలోచన ఏదైనా ఉంటే తమకు తెలియజేయాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. మరో 2–3రోజుల్లో మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తామని, అప్పటిలోగా స్పందించాలని పేర్కొంది. ‘ఈ అంశంపై నిజానిజాలను నిర్ధారించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని, కమిటీ కోర్టుకు నివేదిక ఇస్తుందని మీరు(సొలిసిటర్ జనరల్) చెబుతున్నారు. అందుకే ఈ మొత్తం వ్యవహారాన్ని క్షుణ్నంగా పరిశీలించి, మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తాం’ అని కోర్టు స్పష్టం చేసింది. దాచడానికి ఏమీ లేదు: కేంద్రం విచారణ సందర్భంగా తుషార్ మెహతా స్పందిస్తూ.. ఒక నిర్ధిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం ఉపయోగిస్తోందా? లేదా? అనేది ప్రజల్లో చర్చ జరగాల్పినన అంశం కాదని అన్నారు. పెగాసస్‌ను కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన అంశంగా పరిగణిస్తోందని, ఇందులో దాచడానికి ఏమీ లేదని తేల్చిచెప్పిందని గుర్తుచేశారు. జాతి భద్రతకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని తాము ఆశించడం లేదని ధర్మాసనం పేర్కొంది. దేశ పౌరులపై నిఘా పెట్టడానికి పెగాసస్ స్పైవేర్‌ను కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఉపయోగించిందా? లేదా? అనేది మాత్రమే తాము తెలుసుకోవాలని కోరుకుంటున్నామని సొలిసిటర్ జనరల్‌కు తెలిపింది. అసలు విషయం ఏమిటో సూటిగా చెప్పకుండా డొంకతిరుగుడు వైఖరి అవలంబించడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. చట్టం నిర్దేశించిన ప్రక్రియ మేరకే స్నూపింగ్ సమగ్ర అఫిటవిట్ దాఖలు చేస్తే పెగాసస్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తమకు తెలుస్తుందని కోర్టు వివరించింది. తమ గోప్యతకు(ప్రైవసీ) భంగం కలిగేలా కేంద్రం పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందని, ఫోన్లపై నిఘా పెట్టిందని జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు ఇతరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఉద్ఘాటించింది. ‘‘చట్ట ప్రకారం ఒక ప్రక్రియ ఉంటుంది. దేశ భద్రత దృష్ట్యా అనుమానితులపై నిఘా పెట్టడానికి చట్టం కూడా అనుమతిస్తుంది’ అని పేర్కొంది. ఒకవేళ స్పైవేర్‌ను ప్రభుత్వం ఉపయోగిస్తున్నట్లయితే చట్టం నిర్దేశించిన ప్రక్రియ ప్రకారమే అది జరగాల్సి ఉంటుందని సూచించింది. చట్టం అనుమతించిన ప్రక్రియ కాకుండా ఇంకేదైనా ప్రక్రియను ప్రభుత్వం ఉపయోగిస్తోందా? అనేది తెలుసుకోవాలని పిటిషనర్లు ఆశిస్తున్నారని ధర్మాసనం గుర్తుచేసింది. వాస్తవాలు చెప్పడం ప్రభుత్వం విధి: సిబల్ పిటిషనర్లు ఎన్.రామ్, శశి కుమార్ తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అఫిడవిట్ దాఖలు చేయబోమని కేంద్రం తేల్చిచెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దేశ ప్రజలకు వాస్తవాలను వెల్లడించడం ప్రభుత్వం విధి అని అన్నారు. స్పైవేర్‌ను ఉపయోగించే విషయంలో చట్టబద్ధమైన ప్రక్రియను ప్రభుత్వం పాటించలేదని మరో సారి తేలిపోయిందని చెప్పారు. మరో పిటిషనర్ తరపున సీనియర్ అడ్వొకేట్ శ్యామ్ దివాన్ వాదిస్తూ... స్పైవేర్‌తో పౌరుల ఫోన్లపై నిఘా పెట్టడం ప్రజాస్వామ్యంపై ముమ్మాటికీ దాడేనని అన్నారు. విశ్వసనీయమైన దర్యాప్తు జరిపించాలని కోరారు. చట్టం అనుమతించదు ఫలానా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాం, ఫలానా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం లేదు అని బయటకు చెబితే ఉగ్రవాద శక్తులు దాన్నొక అవకాశంగా మార్చుకొనే ప్రమాదం ఉందని సొలిసిటర్ జనరల్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సాఫ్ట్‌వేర్‌కు కౌంటర్–సాఫ్ట్వేర్ ఉంటుందన్నారు. కొన్ని కేసుల్లో ఇలాంటి వాటిని బహిర్గతం చేయడానికి టెలిగ్రాఫ్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం అనుమతించవని వివరించారు. పెగాసస్‌పై ఏర్పాటు చేయబోయే కమిటీలో ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఉండబోరని, ఐటీ రంగానికి చెందిన నిపుణులే ఉంటారని తెలిపారు. నివేదిక తమకు అందిన తర్వాత బహిర్గతం చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని తుషార్ మెహతా బదులిచ్చారు. దేశ భద్రత నేపథ్యంలో ఇలాంటివి ప్రజల్లోకి రాకపోవడమే మంచిదని అన్నారు. -
కొవిడ్ పరిహారం 4 లక్షలు.. ఏం తేల్చారు?
న్యూఢిల్లీ: కొవిడ్-19తో మరణించిన బాధితులకు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించే విషయంపై సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ అభ్యర్థనల వ్యహారంలో ఏం తేల్చారని శుక్రవారం సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆరా తీసింది. దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, సహేతుకమైన ఈ అంశం పరిశీలనలో ఉందని, దీనిపై బదులు ఇవ్వడానికి మరికొంత టైం కావాలని కోర్టును కోరాడు. బిహార్ ప్రభుత్వం కరోనా వైరస్‌తో చనిపోయిన బాధితులకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద నాలుగు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ విషయం మీడియా ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని బెంచ్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ అభ్యర్థనల విషయంలో ఏం తేల్చారని, కరోనా మరణాల ఎక్స్‌గ్రేషియా స్పష్టమైన రూల్స్ తెలపాలని బెంచ్ కోరింది. అంతేకాదు మరో పిటిషన్లో కొవిడ్ డెత్ సర్టిఫికెట్లు మంజూరు చేయడంలో అవకతవకలు, జాప్యం జరుగుతోందన్న ఆరోపణలపై ఏం స్పందిస్తారని కోర్టు ఆరా తీసింది. దీనిపై మెహతా స్పందిస్తూ.. ఈ సమస్యలు తమ దృష్టికి వచ్చా యని, వీటిని పరిష్కరించడంపైనే కేంద్రం దృష్టి సారించిందని పేర్కొన్నాడు. అయితే సొలిసిటర్ జనరల్ రెండువారాల గడువు కోరగా కోర్టు అందుకు ఒప్పుకోలేదు. మే 24నే పిటిషన్లు దాఖలు కావడంతో.. ఇంకెంత గడువు ఇవ్వాలని బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 18న కేంద్రం తన వివరణను అందించాలని డెడ్‌లైన్ విధిస్తూ, జూన్21న తదుపరి విచారణ ఉంటుందని మెహతాకు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 12(ii) ప్రకారం.. కరోనాతో చనిపోయిన వాళ్లకు నాలుగు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేకాదు బాధిత కటుంబాల బాధ్యతల్ని ప్రభుత్వాలే భరించాలని ఓ పిటిషన్‌దారుడు పేర్కొన్నాడు. ఇక మరో పిటిషన్లో కొవిడ్ మరణాల సర్టిఫికెట్ల జాప్యంపై పేర్కొనగా, ఐసీఎంఆర్ గైడ్లెన్స్ ప్రకారం సర్టిఫికెట్లు మంజూరు చేయాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. చదవండి: వాక్సినేషన్.. దేవుడ్ని ప్రార్థించండి -
‘ఆ ప్రాజెక్టును అడ్డుకోలేం’
సాక్షి, న్యూఢిల్లీ : నూతన పార్లమెంట్ భవన నిర్మాణాలకు రూ 20,000 కోట్లతో చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సంబంధించి క్షేత్రస్ధాయి పనులను అడ్డుకోలేమని సర్వోన్నత న్యాయస్ధానం శుక్రవారం తేల్చిచెప్పింది. నిర్మాణ పనులకు అనుమతులివ్వడంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ప్రాజెక్టు పనులపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చట్టబద్ధంగా తమ విధులను నిర్వర్తించే అధికారలను నిలువరించగలమా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎం కన్విల్కార్ పిటిషనర్‌ను ప్రశ్నించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ సర్వోన్నత న్యాయస్ధానం వద్ద పెండింగ్‌లో ఉన్నా ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇస్తోందని పిటిషనర్ రాజీవ్ సూరి తరపు న్యాయవాది శిఖిల్ సూరి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కాగా పిటిషనర్ల ఆరోపణలపై జులై 3లోగా ప్రభుత్వం బదులివ్వాలని కోరుతూ జులై 6 తర్వాత పిటిషన్‌పై విచారణను చేపడతామని కోర్టు పేర్కొంది. పార్లమెంట్ భవన నిర్మాణానికే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు చేపడుతుంటే పిటిషనర్‌కు అభ్యంతరం ఏమిటని ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రశ్నించారు. చదవండి : వడ్డీమీద వడ్డీనా..? -
అదనపు సొలిసిటర్ జనరల్‌గా సూర్యకరణ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది టి.సూర్యకరణ్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్‌జోన్ నుంచి భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సూర్యకరణ్‌రెడ్డి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో కూడిన సౌత్‌జోన్ పక్షాన అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి సూర్యకరణ్‌రెడ్డి కావడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
సోలిసిటర్ జనరల్‌గా తుషార్ మెహతా
సాక్షి, న్యూఢిల్లీ : భారత సోలిసిటర్ జనరల్‌గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా నియమితులయ్యారు. గతేడాది అక్టోబర్ 20న సీనియర్ న్యాయవాది రంజీత్ కుమార్ రాజీనామా చేసినప్పటి నుంచి సోలిసిటర్ జనరల్ స్థానం ఖాళీగా ఉంది. దాదాపు ఏడాది తర్వాత ఎట్టకేలకు ఆయన స్థానంలో తుషార్ మెహతాకి కేంద్రం పదోన్నతి కల్పించింది. 2014 నుంచి అదనపు సోలిసిటర్ జనరల్‌గా పలు కీలకమైన కేసుల్లో మెహతా వాదనలు వినిపించారు. 2020 జూన్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన సోలిసిటర్ జనరల్‌గా కొనసాగనున్నారు. -
సొలిసిటర్ జనరల్ రంజిత్ రాజీనామా
న్యూఢిల్లీ: సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టంచేశారు. రంజిత్ తన రాజీనామా లేఖను న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కార్యాలయానికి పంపారు. 2014లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదవి చేపట్టిన రంజిత్ మూడేళ్ల పాటు పలు కీలక కేసుల్లో ప్రభుత్వం తరఫున వాదించారు. వాటిలో నోట్లరద్దు, కాలుష్యం పెరుగుదలకు సంబంధించిన కేసులున్నాయి. కేంద్రంలో అత్యంత కీలక న్యాయ పదవిలో ఉంటూ రాజీనామా చేసిన వారిలో రంజిత్ రెండోవారు. -
ఈ-రిక్షాలపై నిషేధం 20 వరకు
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో ఈ-రిక్షాలపై నిషేధం ఈ నెల 20 వరకు కొనసాగనుంది. ఇందుకు సంబంధించి కేసుపై విచారణను హైకోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. అక్టోబర్ 15 వరకు ఈ-రిక్షాలను నడిపేందుకు తాత్కాలిక లెసైన్సులు మంజూరు చేస్తామంటూ కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ సమర్పించిన ప్రతిపాదనను న్యాయమూర్తులు బి.డి.అహ్మద్, , సిద్దార్ధ్ మృదుల్‌లతో కూడిన ధర్మాసనం పరిశీలించనుంది. ఈ-రిక్షాలపై విధిం చిన నిషేధంఎత్తివేతకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ-రిక్షాలపై నిషేధం వల్ల లక్షలమంది జీవనోపాధికి సమస్యను ఎదుర్కొంటున్నారని, అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నిషేధాన్ని ఎత్తివేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ న్యాయస్థానాన్ని కోరారు. అయితే న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వ ప్రతిపాదనను అఫిడవిట్‌తో సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. న్యాయస్థానం సూచన మేరకు నిబంధనలకు లోబడి నడుచుకుంటున్న ఈ-రిక్షా చోదకులకు కమర్షియల్ డ్రైవింగ్ లెసైన్సు ఇవ్వడం కోసం రవాణా విభాగం నగరమంతటా కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ-రిక్షా ప్రమాదాలలో తీవ్రంగా గాయపడిన లేదా ప్రాణపాయం సంభవించిన కేసుల్లో బాధితులకు నష్టపరిహారం చెల్లించడం కోసం ఈ-రిక్షా సంఘాలు రూ.10 లక్షల బీమా నిధిని ఏర్పాటు చేస్తాయని కూడా పేర్కొ ంది. ఈ-రిక్షా దుర్ఘటనల్లో తీవ్రంగా గాయపడినవారికి రూ. 25 వేలు, మృతుల బంధువులకు రూ. లక్షను నష్టపరిహారం కింద చెల్లించనున్నట్లు తెలిపింది. గుర్తింపు చిహ్నాలు, స్టిక్కర్లను కూడా జారీ చేస్తుందని పేర్కొంది. -
సొలిసిటర్ జనరల్‌గా రంజిత్ కుమార్
ఆరుగురు అదనపు ఎస్‌జీల నియామకం న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్‌ను నూతన సొలిసిటర్ జనరల్(ఎస్జీ)గా ప్రభుత్వం నియమించింది. రంజిత్‌కుమార్‌ను ఎస్జీగా నియమిస్తూ శనివారం న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సీనియర్ న్యాయవాదులు మనిందర్ సింగ్, తుషార్ మెహతా, ఎల్ నాగేశ్వరరావు, పీఎస్ పత్వాలియా, నీరజ్ కిషన్ కౌల్, పీఎస్ నరసింహలను అదనపు సొలిసిటర్ జనరల్ పదవుల్లో నియమించింది. వీరి నియామకాలను జూన్ 4వ తేదీనే కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. సొహ్రాబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసు సహా పలు కేసుల్లో గుజరాత్ తరఫున సుప్రీంకోర్టులో రంజిత్‌కుమార్ వాదించారు. ఇటీవల సంచలనం సృష్టించిన ‘స్నూప్‌గేట్’ కేసులో గూఢచర్యానికి గురైన మహిళ కుటుంబం తరఫున కూడా రంజిత్ సుప్రీంకోర్టులో వాదించారు. ఒక మహిళపై గుజరాత్ ప్రభుత్వం గూఢచర్యానికి పాల్పడిందని, అందులో ప్రస్తుత ప్రధాని, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హస్తం ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అదే ‘స్నూప్‌గేట్’గా ప్రఖ్యాతిగాంచింది.అయితే, కేంద్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయాధికారి అయిన అటార్నీ జనరల్ నియామకంపై ప్రభుత్వం ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆ పదవికి తన సమ్మతిని తెలియజేసినట్లు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఇటీవలే వెల్లడించారు.