న్యూఢిల్లీ: సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టంచేశారు. రంజిత్ తన రాజీనామా లేఖను న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కార్యాలయానికి పంపారు.
2014లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదవి చేపట్టిన రంజిత్ మూడేళ్ల పాటు పలు కీలక కేసుల్లో ప్రభుత్వం తరఫున వాదించారు. వాటిలో నోట్లరద్దు, కాలుష్యం పెరుగుదలకు సంబంధించిన కేసులున్నాయి. కేంద్రంలో అత్యంత కీలక న్యాయ పదవిలో ఉంటూ రాజీనామా చేసిన వారిలో రంజిత్ రెండోవారు.
Comments
Please login to add a commentAdd a comment