
భారత సోలిసిటర్ జనరల్‌గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా నియమితులయ్యారు.
సాక్షి, న్యూఢిల్లీ : భారత సోలిసిటర్ జనరల్‌గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా నియమితులయ్యారు. గతేడాది అక్టోబర్ 20న సీనియర్ న్యాయవాది రంజీత్ కుమార్ రాజీనామా చేసినప్పటి నుంచి సోలిసిటర్ జనరల్ స్థానం ఖాళీగా ఉంది. దాదాపు ఏడాది తర్వాత ఎట్టకేలకు ఆయన స్థానంలో తుషార్ మెహతాకి కేంద్రం పదోన్నతి కల్పించింది.
2014 నుంచి అదనపు సోలిసిటర్ జనరల్‌గా పలు కీలకమైన కేసుల్లో మెహతా వాదనలు వినిపించారు. 2020 జూన్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన సోలిసిటర్ జనరల్‌గా కొనసాగనున్నారు.