సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో ఈ-రిక్షాలపై నిషేధం ఈ నెల 20 వరకు కొనసాగనుంది. ఇందుకు సంబంధించి కేసుపై విచారణను హైకోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. అక్టోబర్ 15 వరకు ఈ-రిక్షాలను నడిపేందుకు తాత్కాలిక లెసైన్సులు మంజూరు చేస్తామంటూ కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ సమర్పించిన ప్రతిపాదనను న్యాయమూర్తులు బి.డి.అహ్మద్, , సిద్దార్ధ్ మృదుల్‌లతో కూడిన ధర్మాసనం పరిశీలించనుంది. ఈ-రిక్షాలపై విధిం చిన నిషేధంఎత్తివేతకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ-రిక్షాలపై నిషేధం వల్ల లక్షలమంది జీవనోపాధికి సమస్యను ఎదుర్కొంటున్నారని, అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నిషేధాన్ని ఎత్తివేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ న్యాయస్థానాన్ని కోరారు.
అయితే న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వ ప్రతిపాదనను అఫిడవిట్‌తో సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. న్యాయస్థానం సూచన మేరకు నిబంధనలకు లోబడి నడుచుకుంటున్న ఈ-రిక్షా చోదకులకు కమర్షియల్ డ్రైవింగ్ లెసైన్సు ఇవ్వడం కోసం రవాణా విభాగం నగరమంతటా కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ-రిక్షా ప్రమాదాలలో తీవ్రంగా గాయపడిన లేదా ప్రాణపాయం సంభవించిన కేసుల్లో బాధితులకు నష్టపరిహారం చెల్లించడం కోసం ఈ-రిక్షా సంఘాలు రూ.10 లక్షల బీమా నిధిని ఏర్పాటు చేస్తాయని కూడా పేర్కొ ంది. ఈ-రిక్షా దుర్ఘటనల్లో తీవ్రంగా గాయపడినవారికి రూ. 25 వేలు, మృతుల బంధువులకు రూ. లక్షను నష్టపరిహారం కింద చెల్లించనున్నట్లు తెలిపింది. గుర్తింపు చిహ్నాలు, స్టిక్కర్లను కూడా జారీ చేస్తుందని పేర్కొంది.
ఈ-రిక్షాలపై నిషేధం 20 వరకు
Published Thu, Aug 14 2014 10:43 PM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM
Advertisement
Advertisement