సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది టి.సూర్యకరణ్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్‌జోన్ నుంచి భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సూర్యకరణ్‌రెడ్డి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో కూడిన సౌత్‌జోన్ పక్షాన అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి సూర్యకరణ్‌రెడ్డి కావడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment