Director Post
-
‘కరెంటు’లో కూటమి కాసుల వేట
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో కాసులు దండుకొనే ప్రక్రియలో కూటమి నేతలు మరో అంకాన్ని మొదలెట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే బలవంతంగా రాజీనామా చేయించిన డైరెక్టర్ల స్థానంలో కొత్త వారి నియామకానికి ఇంటర్వ్యూలు ప్రారంభించారు. ఇప్పటికే డైరెక్టర్ల పోస్టుల్లో ఎవరిని నియమించాలో ఖరారై పోవడంతో ఇప్పుడు ఇంటర్వ్యూలు మొక్కుబడిగానే సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలి రోజు ఆంధ్రప్రదేశ్ తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ (డిస్కం)ల డైరెక్టర్ల పోస్టులకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డిస్కంల సీఎండీలు, ఓ సాంకేతిక నిపుణుడు (మాజీ డైరెక్టర్) ఇంటర్వ్యూలు నిర్వహించారు.మొత్తం ముడుపుల కోసమేకూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అధికార పార్టీ నేతలు డిస్కంలతో పాటు ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కోలో గత ప్రభుత్వంలో నియమితులైన 10 మంది డైరెక్టర్ల చేత జూలై 3న బలవంతంగా రాజీనామా చేయించారు. వీరితో పాటు గత నబంబర్లో పదవీకాలం పూర్తయిన ఐదుగురితో కలిపి మొత్తం 15 మంది డైరెక్టర్ల పోస్టులపై కన్నేసిన కూటమి పెద్దలు.. తమకు ముడుపులిచ్చే వారిని నియమించేందుకు నిబంధనలను మార్చేసుకున్నారు. గత్యంతరం లేక వారికి ఉన్నతాధికారులు సహకరిస్తున్నారు. గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచారు. చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి వారితో పాటు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు కూడా అర్హులేనంటూ నిబంధనలు సవరించేశారు.పవర్ జనరేషన్ కార్పొరేషన్లో ఓ మహిళా అధికారిని హెచ్ఆర్ డైరెక్టర్‌గా కూర్చోబెట్టేందుకు ఆమె మాత్రమే అర్హత సాధించేలా నిబంధనలు మార్చారు. జాయింట్ సెక్రటరీ కేటగిరీకి అర్హత ఇచ్చి, చీఫ్ ఇంజినీర్ కేటగిరీని తీసేశారు. మిగతా పోస్టులకు మాత్రం చీఫ్ ఇంజనీర్ అర్హులేనంటూ ఆదేశాలిచ్చారు. తర్వాత కూటమి పెద్దలు కొందరు ఒక్కో పోస్టుకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరిగా ‘చినబాబు’ ఓ జాబితాను ఖరారు చేశారని, అందులో ఉన్నవారికే ఈ పోస్టులు కట్టబెడతారని సమాచారం.ఆరంభమే గందరగోళంఏపీ ట్రాన్స్‌కోలో ఫైనాన్స్, టెక్నికల్, ఏపీ జెన్కోలో థర్మల్, ఫైనాన్స్, హెచ్ఆర్, హైడల్, కోల్, ఏపీఈపీడీసీఎల్‌లో ఆపరేషన్స్, ప్రాజెక్ట్స్, ఏపీసీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో ప్రాజెక్ట్స్, టెక్నికల్, ఫైనాన్స్ పోస్టులకు 189 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 167 మందికి రాష్ట్ర సచివాలయంలో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయని తెలియజేశారు. అభ్యర్థులు ఉదయమే సచివాలయానికి చేరుకోగా.. ఇక్కడ కాదు.. విజయవాడ గుణదలలోని విద్యుత్ సౌధకు వెళ్లాలని అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ రెండింటికీ మధ్య 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది.అంత దూరం ట్రాఫిక్‌ను దాటుకుని విద్యుత్ సౌధను చేరుకోవడానికి అభ్యర్థులు నానా తంటాలు పడ్డారు. ఉదయం 10 గంటలకల్లా ఇంటర్వ్యూకు వెళ్లాల్సిన వాళ్లు ఆలస్యంగా చేరుకున్నారు. కొందరు వెనక్కి వెళ్లిపోయారు. మరికొందరు వర్చ్యువల్‌గా హాజరయ్యారు. ఆలస్యంగా వచ్చారని వారిని అనర్హులను చేసి, మెచ్చిన వారికి పోస్టులు ఇవ్వడం కోసమే ఇలా దారి మళ్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్లో డైరెక్టర్ల పోస్టులకు ఇంటర్వ్యూలను సోమవారం రాత్రికి పూర్తి చేశారు. మంగళవారం జెన్కో, ట్రాన్స్‌కో, బుధవారం సీపీడీసీఎల్‌లో డైరెక్టర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.డబ్బులు వసూలు చేస్తే ఫోన్ చేసి చెప్పండిడైరెక్టర్ల పోస్టుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఎవరికైనా సమాచారం తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఇంధన శాఖ సోమవారం ఓ ప్రకటనలో కోరింది. ఇందుకోసం ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగం మొబైల్ నంబర్ 9490154719కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని కోరింది. -
ఈడీ డైరెక్టర్‌ను కొనసాగిస్తాం
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్‌కుమార్ మిశ్రా పదవీకాలాన్ని అక్టోబర్ 15 వరకూ పెంచేందుకు అనుమతి కోరుతూ కేంద్రం బుధవారం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. 63 ఏళ్ల మిశ్రా పదవీకాలాన్ని పదేపదే పెంచడం చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇటీవలే తప్పుబట్టడం తెలిసిందే. ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సమీక్షకు సంజయ్ కుమార్ గైర్హాజరైతే భారత ప్రయోజనాలకు భంగకరమని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. అందువల్ల తమ పిటిషన్‌పై జూలై 28లోగా విచారణ జరపాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు. -
సింగరేణిలో ఇద్దరు డైరెక్టర్ల నియామకం
సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి సంస్థలో రెండు డైరెక్టర్ పోస్టుల నియామక ప్రక్రియ సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో జరిగింది. పోటీ పడుతున్న వారి వివరాలను పరిగణనలోకి తీసుకున్నాక ఇద్దరి ని ఎంపిక చేశారు. మణుగూరు ఏరియా జీఎం జి.వెంకటేశ్వరరెడ్డిని డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్‌గా, ఆండ్రియాల ప్రాజెక్ట్ జీఎం ఎన్వీకే శ్రీనివాస్‌ను డైరెక్టర్(ఆపరేషన్స్)గా నియ మిస్తూ సింగరేణి సీఎండీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి పదవీకాలం రెండేళ్లు. కాగా, సింగరేణిలో డైరెక్టర్(పా) పోస్టు ఖాళీగానే ఉంది. -
ఆర్‌కామ్‌లో డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలో డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేశారు. ఈయనతో పాటు ఛాయా విరానీ, రైనా కరానీ, మంజరి కక్కర్, సురేశ్ రంగాచార్లు డైరెక్టర్లుగా రాజీనామా చేశారని స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ సమాచారం ఇచ్చింది. దివాలా ప్రకటించిన ఈ కంపెనీ ఆస్తుల విక్రయానికి రెడీ అవుతోంది. ఇందులోభాగంగానే సంస్థ డైరెక్టర్‌గా అనిల్ రాజీనామాచేశారు. సీఎఫ్ఓ మణికంఠన్ సైతం రాజీనామాను సమర్పించారు. -
ఎన్పీడీసీఎల్ సీఎండీ బదిలీకి డీల్!
హన్మకొండ : ఎన్పీడీసీఎల్ సీఎండీ బదిలీపై డీల్ మొదలైంది. సీఎండీ కార్తికేయ మిశ్రాను బదిలీ చేయడం... ఓ సీజీఎంను ఇక్కడికి సీఎండీగా తీసుకొచ్చేందుకు కొందరు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్తుత సీఎండీని బదిలీ చేసేందుకు గత ఏడాది కూడా సంస్థలోని పలు ఇంజినీరింగ్ యూనియన్లు భారీ ఎత్తున పైరవీలు చేశాయి. అప్పుడే రూ. 2 కోట్లకు బేరం పెట్టారు. తాజాగా .... కాంట్రాక్టర్లు రంగంలోకి దిగారు. సీఎండీ, డెరైక్టర్ పోస్టు కోసం ఆశతో ఉన్న అధికారుల తరఫున ఇద్దరు మంత్రుల వద్ద ఇప్పటికే రాయబారం నడుపుతున్నారు. దీనిపై ఇప్పటికే కాంట్రాక్టర్లు ఇద్దరు మంత్రులను కలిశారు. వారి వెంట సీఎండీ కుర్చీ కోసం ఆశపడుతున్న ఓ అధికారిని తీసుకెళ్లినట్లు సమాచారం. నిజామాబాద్‌లో మంత్రి సన్నిహితుడిగా ఉన్న ఓ ఏడీఈ... పౌల్ట్రీ వ్యాపారం నిర్వహించినప్పుడు మరో మంత్రితో సంబంధాలున్న ఓ ఎన్పీడీసీఎల్ కాంట్రాక్టర్‌తోపాటు ురో సీనియర్ కాంట్రాక్టర్ ఇటీవల రాయబారం నడిపినట్లు తెలిసింది. అందుకే.. టార్గెట్ ఎన్పీడీసీఎల్లో ఇటీవల సబ్స్టేషన్ల నిర్మాణానికి టెండర్లు పిలిచిన సందర్భంలో ధరలు పెంచాలని కాంట్రాక్టర్లు పట్టుబట్టిన విషయం తెలిసిందే. మిశ్రా ఇందుకు ఒప్పుకోకపోవడంతో టెండర్లు ఫైనల్ కాలేదు. అంతేకాకుండా పనుల పరిశీలన తర్వాతే బిల్లుల చెల్లింపులు చేయూలని, పనులు పూర్తికాకుంటే చెల్లించొద్దని సీఎండీ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పలువురు ఐఏఎస్‌లు, రాజకీయ నేతలతో కాంట్రాక్టర్లు ఆయనపై ఒత్తిడి సైతం తీసుకొచ్చారు.అయినప్పటికీ సీఎండీ ఫైళ్లను పెండింగ్‌లో పెడుతుండడంతో ఆయనను కాంట్రాక్టర్లు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన్ను బదిలీ చేయించి... తమకు అనుకూలంగా ఉండే వారిని సీఎండీగా రప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రూ. 3 కోట్ల నుంచి రూ.4 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కుర్చీ కోసం పోటీ సీఎండీ కుర్చీ కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఎన్పీడీసీఎల్లో డెరైక్టర్‌గా పనిచేసి గత ఏడాది కేబుల్ కొనుగోలులో ఆరోపణలు ఎదుర్కొన్న డెరైక్టర్‌తోపాటు ప్రస్తుతం సీజీఎంలుగా పనిచేస్తున్న ఇద్దరు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. కంపెనీలోని మరో సీనియర్ డెరైక్టర్ కూడా సీఎండీ పోటీలో ఉన్నట్లు సమాచారం. జెన్కో తరహాలోనే ఎన్పీడీసీఎల్కు ఈసారి ఐఏఎస్ అధికారిని కాకుండా ఇంజినీరింగ్, నాన్ ఐఏఎస్‌లకు సీఎండీ పోస్టు అప్పగించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సీఎండీలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు అధికారులు సీఎండీ పోస్టుకు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా... సీఎండీ కార్తికేయ మిశ్రా బదిలీపై వెళ్లేందుకు ఇప్పటికే పలుమార్లు రిక్వెస్ట్ పెట్టుకున్నారని... ఈసారి ఎలాగైనా బదిలీ చేయించుకుంటారని.. లేనిపక్షంలో కొన్ని రోజులు సెలవులో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.