
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలో డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేశారు. ఈయనతో పాటు ఛాయా విరానీ, రైనా కరానీ, మంజరి కక్కర్, సురేశ్ రంగాచార్‌లు డైరెక్టర్లుగా రాజీనామా చేశారని స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ సమాచారం ఇచ్చింది. దివాలా ప్రకటించిన ఈ కంపెనీ ఆస్తుల విక్రయానికి రెడీ అవుతోంది. ఇందులోభాగంగానే సంస్థ డైరెక్టర్‌గా అనిల్ రాజీనామాచేశారు. సీఎఫ్‌ఓ మణికంఠన్ సైతం రాజీనామాను సమర్పించారు.