
బిహార్ బీజేపీ లీడర్ సంజయ్ కుమార్ మహతో ఫోన్‌ని ఎవరో కొట్టేశారు. అది ఖరీదైన ఫోన్. అంతకన్నా వాల్యూ అయిన డేటా అందులో ఉంది. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ దొంగమొహం వాడెవడో కనిపెట్టే బాధ్యతను పోలీస్ డిపార్ట్‌మెంట్ మధుబాల దేవి అనే పోలీస్ ఆఫీసర్ మీద పెట్టింది. కాల్ డేటా రికార్డ్స్‌ని ట్రేస్ చేసి.. ఆ ఫో ఎవరి దగ్గర ఉందో కనిపెట్టింది మధుబాల. మరి వాడి దగ్గర్నుండి ఫోన్ రాబట్టడం ఎలా? మెసేజ్‌లు పంపడం మొదలుపెట్టింది. ముందు ‘హాయ్’ అంది. తర్వాత ‘ఐ లైక్ యూ’ అంది. ఆ తర్వాత ‘ఐ లవ్ యూ’ కూడా చెప్పింది. అతడు పడిపోయాడు. ‘ఐ టూ..’ అన్నాడు. ‘నిన్నొకసారి చూడాలని ఉంది’ అని కూడా అన్నాడు. మధుబాల ఫొటో పంపింది. ఆ వ్యక్తి మళ్లీ పడిపోయాడు. ‘మొత్తం బిహార్‌లోనే లేదు ఇంత అందగత్తె’ అనుకున్నాడు. ‘మనం వెంటనే మీట్ అవుదాం’ అన్నాడు. మధుబాల ‘ఎస్’ చెప్పింది. ఒక ప్లేస్ చెప్పి అక్కడికి రమ్మంది. దొంగోడు వచ్చాడు.
పోలీస్ ఆఫీసరమ్మా వెళ్లింది. అయితే.. బుర్ఖా వేసుకుని వెళ్లింది! అతడు ఆమెకు దగ్గరవుతుండగా, అతడికి ఎవరో నలుగురు దగ్గరయ్యారు. ఆ నలుగురూ పోలీసులు! వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. అతడి చేతిలోని ఫోన్‌ని లాక్కున్నారు. ‘ఈ ఫోన్ ఎవరిది?’ అని అడిగారు. ‘కొన్నాను’ అన్నాడు అతడు. ‘ఎక్కడ కొన్నావ్?’ అని అడిగారు. ‘ఎవరో అమ్ముతుంటే కొన్నాను’ అన్నాడు. పోలీసులకు అర్థమైంది. దొంగ దగ్గర ఇంకో దొంగ కొన్నాడని! (దొంగ సొమ్ము కొన్నవాళ్లు దొంగలే కదా). దొంగకు కూడా అర్థమైంది... ముగుసులో ఉన్నది తన లవర్ కాదు, పోలీస్ ఆఫీసర్ అని. పోయిన ఫోన్ దొరికినందుకు బీజేపీ లీడర్ హ్యాపీ. ఒక పెద్ద టాస్క్‌ని పూర్తి చేసినందుకు పోలీస్ ఆఫీసర్ హ్యాపీ. వాళ్లిద్దరికన్నా ఎక్కువ హ్యాపీ.. బిహార్ పోలీస్ డిపార్ట్‌మెంట్! ఫోన్ కోసం వేటాడితే అనుకోకుండా ఒక గ్యాంగ్‌స్టర్ వాళ్లకు పట్టుబడ్డాడు. అవును. ఇప్పటివరకు మనం దొంగ.. దొంగ.. అనుకున్న ఆ దొంగోడు.. మహమ్మద్ హస్నైన్ అనే నటోరియస్ గ్యాంగ్‌స్టర్! మధుబాల ప్లాన్‌కి అది ప్రతిఫలం. మామూలు దొంగను పట్టబోతే ఏకంగా గ్యాంగ్‌స్టరే వలలో పడ్డాడు. ఇదంతా సరే.. పైన నయరతార ఫొటో ఏమిటి? తన ఫొటో అంటూ గ్యాంగ్‌స్టర్‌కి మధుబాల పంపిన ఫొటో.. నయనతారదే!
Comments
Please login to add a commentAdd a comment