
సాక్షి,హైదరాబాద్:హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో శనివారం(సెప్టెంబర్14) కేసు నమోదైంది. అడిషనల్ డీసీపీ హరిచందద్రారెడ్డి ఫిర్యాదుతో బీఎన్ఎస్‌ఎస్ 132 కింద కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.
గురువారం తన ఇంటిపై ఎమ్మెల్యే గాంధీ దాడి తర్వాత కౌశిక్‌రెడ్డి బీఆర్‌ఎస్ నేతలతో కలిసి సైబరాబాద్ కమిషనరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి తనను బెదిరించారని డీసీపీ ఫిర్యాదు చేశారు.
కాగా, కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై గచ్చిబౌలి పోలీసులు ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, గాంధీ మధ్య వాగ్యుద్ధం ముదిరి దాడులు, కేసుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి.. ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు
Comments
Please login to add a commentAdd a comment