కాంగ్రెస్ గూండాలను వదిలి బీఆర్‌ఎస్ నేతల అరెస్టులా?: కేటీఆర్
ఇది ప్రభుత్వ దిగజారుడుతనం.. ఈ జులుంను సహించేది లేదు
ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడం ఖాయమని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు సమావేశం పెట్టుకునేందుకు కూడా అనుమతులు లేవా అనిప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రి వెన్నులో వణుకు వస్తోందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నివాసంపై దాడి చేసిన అరికెపూడి గాంధీ అనుచరులు, గూండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
కౌశిక్‌రెడ్డిపై దాడి చేసిన వారిని వదిలేసి బీఆర్‌ఎస్ నేతలను అరెస్టు చేయడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. బీఆర్‌ఎస్ నేతలపై ప్రభుత్వ జులుంను సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని.. ప్రశి్నస్తున్న ప్రజాప్రతినిధులపై సీఎం కనుసన్నల్లోనే గూండాలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులకు దిగే సంస్కృతిని రేవంత్ తీసుకొచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పారీ్టకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment