Assembly secretary
-
TG: పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం: కౌశిక్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: శాసన సభా సంప్రదాయాన్ని కాపాడే వ్యక్తి కోర్టును అగౌర పరిచేలా మాట్లాడటం సరికాదని బీఆర్ఎష్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు క్రెడిబిలిటీ కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని కోరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం(సెప్టెంబర్11) అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కె.పి. వివేకానంద అసెంబ్లీ సెక్రటరీకి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.‘‘ పార్టీ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి , తెల్లం వెంకట్రావ్ల అనర్హతపై నాలుగు వారాల్లో నివేదిక ప్రకటించాలని ఆ సెంబ్లీ కార్యదర్శిని హైకోర్టు కోరింది. నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వక పొతే సుమోటోగా హైకోర్టు కేసును నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. తీర్పు కాపీ రాలేదని.. టై పాస్ చేయొద్దని, తక్షణం యాక్షన్ తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీని కలిశాం. మిగతా ఎడుగురి ఎమ్మెల్యే అనర్హత స్పీకర్ కార్యాలయంలో వుంది. వారిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి.. అప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. మంత్రి శ్రీధర్‌బాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయి.సభా సంప్రదాయాన్ని కాపాడే వ్యక్తి కోర్టును అగౌరపరిచేలా మాట్లాడటం సరికాదు. శ్రీధర్ బాబు క్రెడిబిలిటీ కోల్పోతున్నారు. 10 ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. పార్టీ పిరాయించిన రాహుల్ గాంధీ ఏమో వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. చట్టం తీసుకొస్తా అని చెప్పింది రాహుల్ గాంధే కదా.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. సీఏసీ చైర్మన్ నియామకం సభ నియమావళికి విరుద్దంగా జరిగింది. 14 నామినేషన్ వేస్తే ఎన్నికలు పెట్టాలి.. కానీ పెట్టలేదు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి. హరీశ్ రావ్ నామినేషన్ ఎక్కడికి పోయింది. పార్టీ తరుపున 3 పేర్లు ఇచ్చారు. నాలుగో పేరు ఎవరు ఇచ్చారు. శ్రీధర్ బాబు దిగజారి మాట్లాడుతున్నారు. తీర్పు వచ్చాక పార్టీ మరీనా ఎమ్మెల్యేలు ఒక్కోరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. 10 ఎమ్మెల్యేలను మోసం చేశారు రేవంత్ రెడ్డి. ముందు నోయీ వెనక గొయ్యిలాగా వుంది వారి పరిస్థితి.పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయంతెలంగాణలో పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ‘ దానం నాగేందర్ బిచ్చగాడు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు, దానం నాగేందర్ బిగ్ చీటర్, మాజీ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ మిలిగిపోతారు. కడియం శ్రీహరి పచ్చి మోసగాడు. కడియం రాజీనామా చేయాలి. డిపాజిట్ కూడా కడియంకు రాదు. చీరలు , గాజులు 10 మంది ఎమ్మెల్యేలకు కొరియర్ చేస్తా వేసుకొని తిరగండి. స్పీకర్ నిర్ణయం కంటే ముందే మీరు రాజీనామా చేయాలి. గత 10 ఏళ్లలో ఒక్క ఎమ్మెల్యేకు అయినా వ్యక్తి గతంగా పార్టీ కండువా కేసీఆర్ కప్పినట్టుగా చూపితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’అని అన్నారు. ప్రస్తుతం కౌశిక్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.చదవండి: పార్టీ ఫిరాయింపుల కేసు: అసెంబ్లీ సెక్రటరీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుచదవండి: నిబంధనల ప్రకారం ముందుకెళ్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ -
అసెంబ్లీకి డీకే అరుణ.. ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత డీకే అరుణ మంగళవారం అసెంబ్లీకి వెళ్లారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శితో భేటీ అయ్యారు. తనను గద్వాల ఎమ్మేల్యేగా గుర్తించాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హైకోర్టు తీర్పు కాపీ, కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. కాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ, ఎమ్మెల్యేగా డీకే అరుణను డిక్లేర్ చేస్తూ హైకోర్టు ఇటీవల తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ గెజిట్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, సీఎస్ అసెంబ్లీ కార్యదర్శలకు ఉత్తర్వులు పంపింది. ఇక 2018లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా డీకే అరుణ, తెరాస నుంచి కృష్ణమోహన్‌రెడ్డి పోటీ చేయగా.. కృష్ణమోహన్‌రెడ్డి గెలుపొందారు. అయితే నామినేషన్ సందర్భంగా కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసినట్లు డీకే అరుణ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో గద్వాల ఎమ్మెల్యే బీ కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం డీకే అరుణ ఎన్నికను ధ్రువీకరిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. దానికి హైకోర్టు తీర్పు కాపీని సైతం జత చేశారు. 2018 డిసెంబరు 12 నుంచి ఆమెను ఎమ్మెల్యేగా పరిగణించాలని న్యాయస్థానం ఆ తీర్పులో పేర్కొన్న అంశాన్నీ కేంద్ర ఎన్నికల సంఘం ఉటంకించింది. చదవండి: విషాదం.. నాలాలో పడిపోయి నాలుగేళ్ల బాలుడు మృతి -
AP: అసెంబ్లీ కార్యదర్శిగా బాలకృష్ణమాచార్యుల పునర్నియామకం
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శిగా బాలకృష్ణమాచార్యులను పునర్నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరో రెండేళ్ల పాటు ఏపీ అసెంబ్లీ కార్యదర్శిగా బాలకృష్ణమాచార్యులు కొనసాగనున్నారు. 2023 ఏప్రిల్ వరకు ఆయన అసెంబ్లీ కార్యదర్శి పదవిలో కొనసాగుతారు. చదవండి: పరిషత్ ఎన్నికలపై తీర్పు వాయిదా -
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతి
సాక్షి, విజయవాడ: కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. సమావేశాలు జరిగేటప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సిబ్బందని వెంట తీసుకురావద్దని అసెంబ్లీ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక బులెటిన్‌ను విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సభ్యులంతా కచ్చితంగా భౌతికదూరం పాటించాల్సిందేనని నిబంధనలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అసెంబ్లీలోకి అనుమతి ఉంటుదని తెలిపారు. కారు పాస్ ఖచ్చితంగా వాహనాలకు అతికించాలని స్పష్టం చేశారు. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. (అచ్చెన్నకు మా ఉసురే తగిలింది) గుర్తు తెలియనివారికి అసెంబ్లీలోకి అనుమతించేది లేదని పేర్కొన్నారు. అలాగే గన్మెన్లను, విజిటర్లను అసెంబ్లీలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇక అసెంబ్లీలోకి ఎలాంటి ఆయుధాలు తీసుకురావద్దని సభ్యులకు ఆదేశాలు జారీచేశారు. బ్యానర్లు, ఫ్లకార్డ్స్, కర్రలు, స్ప్రేలు వంటివేవీ అనుమతించమని, అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదన్నారు. సభ్యులు తమవెంట పీఎస్‌లు, పీఏలు, పీఎస్‌ఓలను తీసుకురావొద్దని కోరారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. (కార్మికుల ఉసురు తీశారు) -
అచ్చెన్నాయుడు, రవికుమార్లకు నోటీసులు
సాక్షి, అమరావతి : స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్లకు అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం సభాహక్కుల నోటీసులు పంపారు. నోటీసులపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో ఆదేశించారు. -
‘బహిష్కరణ’ కేసులో మరో మలుపు
సాక్షి, హైదరాబాద్: ఆది నుంచి అనేక మలుపులు తిరుగుతూ వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ కేసు తాజాగా మరో మలుపు తిరిగింది. కోమటిరెడ్డి, సంపత్‌లను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానం, వారి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తాము తీర్పునిచ్చినా వారిని శాసనసభ్యుల జాబితాలో చేర్చకపోవడం కోర్టు ధిక్కారమేనంటూ సింగిల్ జడ్జి ప్రాథమిక అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఇప్పుడు శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావు అప్పీళ్లు దాఖలు చేశారు. ఏప్రిల్ 17న సింగిల్ జడ్జి జస్టిస్ బి.శివశంకరరావు తీర్పునివ్వగా, 61 రోజుల తర్వాత వారు ఈ అప్పీళ్లు దాఖలు చేయడం గమనార్హం. కోర్టు తీర్పును పట్టించుకోవద్దన్న వైఖరితో.. కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్‌ను విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు.. తమకు కోర్టు ధిక్కారం కింద ఫారం–1 నోటీసు జారీ చేసి, వాదనలు విని శిక్షించే అవకాశం ఉందని భావించిన కార్యదర్శులు ఆశ్చర్యకరంగా ఇన్ని రోజుల తర్వాత అప్పీళ్ల మార్గాన్ని ఎంచుకున్నారు. మొదట్లో ఈ కేసులో కోర్టు తీర్పును పట్టించుకోకూడదన్న వైఖరితో వ్యవహరించిన శాసనసభ కార్యదర్శి.. రోజు రోజుకూ పరిస్థితి చేయి దాటుతుండటం, కోర్టు ధిక్కారం విషయంలో జస్టిస్ శివశంకరరావు గట్టిగా వ్యవహరిస్తుండటంతో భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తప్పవన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే అప్పీల్ దాఖలు చేశారు. కోర్టు తీర్పును అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ గత వారం జరిగిన కోర్టు ధిక్కార పిటిషన్ విచారణలో ఇద్దరు కార్యదర్శులు కూడా నివేదించారు. ఇందుకు రెండు వారాల గడువు కోరగా.. న్యాయమూర్తి వారం గడువునిచ్చారు. సింగిల్ జడ్జి వద్ద తీర్పు అమలుకు ప్రయత్నిస్తున్నామని చెప్పి, ఇప్పుడు అప్పీళ్లు దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. న్యాయశాఖ కార్యదర్శి తరఫున హాజరవుతున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు బుధవారం ఉదయం ఈ అప్పీళ్ల గురించి ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. సింగిల్ జడ్జి ముందు ఈనెల 10న కోర్టు ధిక్కార కేసు విచారణకు వస్తుందని, ఈ కేసులో స్పీకర్‌ను ప్రతివాదిగా చేర్చి నోటీసులిచ్చేందుకు సింగిల్ జడ్జి సిద్ధమవుతున్నారని, అందువల్ల ఈ అప్పీళ్లపై అత్యవసర విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరారు. దీంతో ధర్మాసనం కేసు పూర్వాపరాల గురించి తెలుసుకుంది. అప్పీళ్ల దాఖలులో ఎన్ని రోజుల ఆలస్యం జరిగిందని ధర్మాసనం ప్రశ్నించింది. 61 రోజుల ఆలస్యం జరిగిందని అదనపు ఏజీ బదులివ్వగా, మరి ఇన్ని రోజుల ఆలస్యంతో అప్పీళ్లు దాఖలు చేసినప్పుడు, అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. అత్యవసర విచారణకు నిరాకరించింది. కనీసం గురువారమైనా విచారించాలని అదనపు ఏజీ అభ్యర్థించగా ససేమిరా అన్న ధర్మాసనం, ‘గతంలో అసలు కోర్టుకు విచారణ పరిధి లేదని చెప్పినట్లున్నారు..? ముందు కోర్టు ధిక్కార కేసును ఎదుర్కోండి. సింగిల్ జడ్జి ఫారం–1 నోటీసు జారీ చేస్తే అప్పుడు దానిపై ధిక్కార అప్పీల్ దాఖలు చేసుకోండి. పరిస్థితిని బట్టి అప్పుడు విచారణ జరుపుతాం’అని తేల్చి చెప్పింది. కోర్టులిచ్చే తీర్పు విషయంలో ఉదాసీనంగా ఉండరాదంటూ పరోక్షంగా కోర్టు తీర్పును అమలు చేయకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. 61 రోజుల ఆలస్యంగా అప్పీళ్లు దాఖలు చేయడంపై తాము తమ అభ్యంతరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కోమటిరెడ్డి న్యాయవాది తెలిపారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. -
దిగొచ్చిన అసెంబ్లీ కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌లను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానంపై న్యాయస్థానాల్లో దాఖలైన వ్యాజ్యాలకు ఏ మాత్రం స్పందించని అసెంబ్లీ కార్యదర్శి ఇప్పుడు దిగొచ్చారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదంటూ కోమటిరెడ్డి, సంపత్‌లు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్లో హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో స్పందించక తప్పలేదు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు తరఫు న్యాయవాది సాయికృష్ణ శుక్రవారం కోర్టుకు నివేదించారు. మరో ప్రతివాదిగా ఉన్న న్యాయ శాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావు తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు కూడా కౌంటర్ దాఖలుకు గడువు కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 27వ తేదీనే పూర్తిస్థాయి వాదనలు వింటానని ఉభయ పక్షాలకు స్పష్టం చేశారు. ఫుటేజీ సమర్పిస్తానని అప్పటి ఏజీ హామీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై ఇయర్ ఫోన్ విసిరి గాయపరిచారన్న ఆరోపణలపై తమను శాసనసభ నుంచి బహిష్కరించడంతో పాటు నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేస్తూ శాసనసభ కార్యదర్శి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ కోమటిరెడ్డి, సంపత్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ, న్యాయ శాఖ, ఎన్నికల కమిషన్ కార్యదర్శులను ఇందులో ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి.. ఇయర్ ఫోన్ విసిరిన నాటి వీడియో ఫుటేజీ సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అప్పటి అడ్వొకేట్ జనరల్ డి.ప్రకాశ్‌రెడ్డి.. ఆదేశాలు అవసరం లేదని, ఫుటేజీ సమర్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో న్యాయశాఖ, ఎన్నికల సంఘం కార్యదర్శికి నోటీసులిచ్చారు. అయితే ప్రకాశ్‌రెడ్డి ఇచ్చిన హామీ ఆయన పదవికి ఎసరు తెచ్చింది. ఆ హామీ ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. చివరకు ఆయన రాజీనామాకు దారి తీసింది. ధిక్కార పిటిషన్‌తో కదలిన కార్యదర్శి ఫుటేజీ ఇస్తానని ఏజీ హామీ ఇచ్చినా అసెంబ్లీ కార్యదర్శి మాత్రం ఏ రకంగానూ స్పందించలేదు. ఫుటేజీ ఇస్తానని కాని, ఇవ్వనని కాని కోర్టుకు చెప్పలేదు. కౌంటర్ కూడా దాఖలు చేయలేదు. దీంతో ప్రభుత్వం తరఫున న్యాయ శాఖ కార్యదర్శి, ఎన్నికల కమిషనర్ దాఖలు చేసిన కౌంటర్లను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. అసెంబ్లీ కార్యదర్శి స్పందిం చకపోవడంతో వీడియో ఫుటేజీలోని అంశాలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లు భావిస్తున్నామని తీర్పులో పేర్కొన్నారు. ఆ తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా ప్రధాన పిటిషన్లో ప్రతివాదులు కాని ఆ 12 మందికి అప్పీల్ దాఖలు చేసే అర్హత లేదంటూ ప్రాథమిక దశలోనే కోర్టు దాన్ని కొట్టేసింది. మరోవైపు బహిష్కరణను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి తీర్పునిచ్చినా అసెంబ్లీ దాన్ని అమలు చేయకపోవడంతో కోమటిరెడ్డి, సంపత్‌లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ, న్యాయ శాఖ కార్యదర్శులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. ధిక్కార పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బి.శివశంకరరావు ప్రతివాదులుగా ఉన్న నర్సింహాచార్యులు, నిరంజన్‌రావులకు గత నెల 15వ తేదీన నోటీసులు జారీ చేశారు. విచారణను శుక్రవారానికి (జూలై 13వతేదీకి) వాయిదా వేశారు. కోమటిరెడ్డి, సంపత్‌లను సభకు అనుమతించడం లేదు విచారణ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది హాజరవుతారని, వకాలత్ కూడా దాఖలు చేశామని, గడువిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కార్యదర్శి తరఫు న్యాయవాది సాయికృష్ణ శుక్రవారం కోర్టుకు నివేదించారు. న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు తరఫున అదనపు ఏజీ హోదాలో తాను హాజరవుతున్నట్లు జె.రామచంద్రరావు తెలిపారు. కౌంటర్ దాఖలుకు గడువు కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను తొలుత ఆగస్టు 3కు వాయిదా వేశారు. ఈ సమయంలో కోమటిరెడ్డి, సంపత్‌ల న్యాయవాది స్పందిస్తూ.. కోర్టు ఆదేశాలను అసెంబ్లీ కార్యదర్శి అమలు చేయలేదన్నారు. వారి పేర్లను శాసనసభ సభ్యుల జాబితాలో అప్లోడ్ చేయలేదన్నారు. వారిని సభలోకీ అనుమతించడం లేదన్నారు. దీంతో విచారణను 27కు న్యాయమూర్తి వాయిదా వేశారు. ఆ రోజే పూర్తిస్థాయి విచారణ జరుపుతానన్నారు. -
శాసన సభ్యత్వాలు పునరుద్ధరించండి: భట్టి
సాక్షి, హైదరాబాద్: తమ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.సంపత్‌కుమార్‌ల శాసన సభ్య త్వాలను పునరుద్ధరించాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శికి కాంగ్రెస్ పార్టీ లీగల్ మెమొరాండం ఇచ్చింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి బుధవారం అసెంబ్లీ కార్యదర్శికి ఈ మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం అన్యాయమని రాజ్యాంగాన్ని రక్షించే అన్ని సంస్థలను సంప్రదించామన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకుండా ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని, శాసనసభ వెబ్సైట్లోనూ వారిద్దరినీ ఎమ్మెల్యేలుగా చూపిస్తున్నారని, దీన్ని అధారంగా చేసుకుని వారి శాసన సభ్యత్వాలను పునరుద్ధరించాలని మెమొరాండం ఇచ్చామని చెప్పారు. -
సీఈసీకి తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. తమ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లను ఎమ్మెల్యే పదవుల నుంచి అనైతికంగా తొలగించారని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా సీఈసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీని రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ బాధ్యతల నుంచి తొలగించాలని కోరారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పార్లీ ఎమ్మెల్యేల బహిష్కరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఎలాంటి కారణం లేకుండా ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరించారని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. రాజ్యసభ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి అయిన అసెంబ్లీ సెక్రటరీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించి ఓటరు జాబితా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు తొలగించారని విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల ఓటర్ల జాబితాలో కోమటిరెడ్డి, సంపత్‌ల పేర్లు చేర్చాలని, అసెంబ్లీ సెక్రటరీని ఎన్నికల రిటర్నింగ్ బాధ్యతల నుంచి తొలగించాలని సీఈసీని కోరినట్లు ఆయన తెలిపారు. -
అసెంబ్లీ సెక్రటరీకి వైఎస్సార్సీపీ లేఖ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. ప్రస్తుతం ఎమ్మెల్యే రోజా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సభా హక్కుల కమిటీ భేటీని 15 రోజులు వాయిదా వేయాలని కోరారు. ఈ భేటీకి రోజా హాజరుకాలేకపోతున్నట్లు తెలిపారు. అసెంబ్లీ హాల్లో శనివారం మధ్యాహ్నం సభా హక్కుల కమిటీ విచారణ జరిగింది. ఈ విచారణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. అంతకు ముందు అనారోగ్యం కారణంగా విచారణకు హాజరుకావడం లేదని ఎమ్మెల్యే రోజా కూడా కమిటీకి లేఖ పంపారు. -
భూకబ్జాలపై 3 కమిటీలు
* సభా సంఘాలపై కసరత్తు ప్రారంభం * చైర్మన్లుగా ఇప్పటికే తెరపైకి ఇద్దరి పేర్లు * పార్టీల శాసనసభాపక్ష నేతలకు లేఖలు * సభ్యుల పేర్లను సూచించాలని కోరిన అసెంబ్లీ కార్యదర్శి సాక్షి, హైదరాబాద్: శాసనసభా సంఘాల ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. గత నవంబర్‌లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వివిధ అంశాలపై సభా సంఘాలు వేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా అంశాలపై విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి రాజకీయ పార్టీల శాసనసభాపక్ష నేతలకు అసెంబ్లీ కార్యదర్శి తాజాగా లేఖలు రాశారు. హౌస్ కమిటీల్లో పనిచేయడానికి ఆయా పార్టీల తరఫున సభ్యుల పేర్లను సూచించాల్సిందిగా కోరినట్లు సమాచారం. సభా సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అంశాలన్నీ భూ సంబంధమైనవే కావడం గమనార్హం. అయితే, వాటిపై మూడు వేర్వేరు కమిటీలు వేయాలన్న నిర్ణయం జరిగింది. ఈ మేరకు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లను కమిటీల చైర్మన్లుగా పరిశీలిస్తున్నట్లు అనధికారిక సమాచారం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సంబంధించిన భూముల వ్యవహారాన్ని టీఆర్ఎస్ సభ్యులు కాలింగ్ అటెన్షన్ ద్వారా లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఆయన 8.39 ఎకరాల ఎస్సీ అసైన్డు భూములను తన కబ్జాలో పెట్టుకున్నారన్న ఆరోపణలపై చర్చ జరిగింది. అదే సమయంలో సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల ఎకరాల ప్రభుత్వ అసైన్డు భూములు కబ్జాకు గురైనట్లు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిందని సభకు వివరించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని పది జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాలకు కేటాయించిన అసైన్డు భూముల కబ్జాపై నిజానిజాలు వెలుగులోకి తేవాలని, దీనిపై సభా సంఘం వేయాలని పేర్కొన్నారు. అదే మాదిరిగా, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై ఎంఐఎం కాలింగ్ అటెన్షన్ ద్వారా చర్చ జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హౌసింగ్ సొసైటీల అక్రమాలను వెలికి తీయాలని, దీనికోసం మరో సభా సంఘం ఏర్పాటు చేయాలని సీఎం ప్రకటించారు. అంతేకాకుండా, వక్ఫ్ భూములు భారీ ఎత్తున అన్యాక్రాంతమయ్యాయన్న ఎంఐఎం చర్చతో వక్ఫ్, భూదాన్, దేవాదాయ, చర్చి భూములతో పాటు సీలింగ్ భూముల అన్యాక్రాంతంపైనా ప్రత్యేకంగా మరో కమిటీని ఏర్పాటు చే యాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భూముల వ్యవహారాలపైనే మూడు కమిటీల ఏర్పాటుకు సర్కారు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రెండు కమిటీలకు చైర్మన్లుగా మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇతర పార్టీల్లోనూ సభ్యుల ఎంపికపై ఎమ్మెల్యేల్లో ఆసక్తి నెలకొంది. అయితే, వీటిని శాసనసభ, శాసనమండలి సభ్యులతో కలిపి ‘జాయింట్ లెజిస్లేచర్ కమిటీ’లుగా ఏర్పాటు చేస్తారా లేదా అన్న అంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై ఉభయ సభల్లోనూ చర్చ జరిగిన కారణంగా ఈ అంశంపై జాయింట్ కమిటీని ఏర్పాటు చేసే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. ఇక కమిటీల్లో సభ్యుల సంఖ్యపైనా ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా ఒక్కో కమిటీలో ఏడుగురు సభ్యులు ఉండే అవకాశముంది. అత్యధికంగా 15 మంది వరకు ఉండవచ్చని ఓ సీనియర్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే, అధికారికంగా కమిటీలను ఎప్పుడు ప్రకటిస్తారన్నది ఇంకా స్పష్టంకాలేదు. వాస్తవానికి రానున్న బడ్జెట్ సమావేశాల నాటికే సభ ముందుకు నివేదికలు వస్తాయని మొదట అనుకున్నా, వాటి ఏర్పాటులోనే జాప్యం జరుగుతున్నందున ఆగస్టులో జరిగే వర్షాకాల సమావేశాల నాటికి నివేదికలు సిద్ధమయ్యే అవకాశముందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. కానీ, సభాసంఘం ఏర్పాటయ్యాక మూడు నెలల్లోగా నివేదిక అందజేయాల్సి ఉంటుందని కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. -
ఏపీ అసెంబ్లీ కార్యదర్శి ఎవరు?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్న రాజసదారాం పదవీకాలం కొద్దినెలల క్రితం ముగిసినా పొడిగింపుపై కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజనతో ఆయన కొత్త కార్యదర్శి నియామకమయ్యే వరకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిగా కొనసాగనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కార్యదర్శిగా ఎవరు రానున్నారనేది మాత్రం సందిగ్దంగా మారింది. కార్యదర్శిగా ఉండాలంటే లా పట్టా ఉండాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతమున్న డిప్యుటీ కార్యదర్శుల్లో ఒక్కరికీ లా డిగ్రీ లేకపోవడం వారి ఎంపికకు ఆటంకంగా మారింది. ఆ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చి వారిలో ఒకరిని కార్యదర్శిగా తీసుకోవాలా? లేదా డిప్యుటేషన్‌పై ఎవరినైనా తీసుకోవాలా? అన్న చర్చ సాగుతోంది. అసెంబ్లీ వ్యవహారాలు ఇతర శాఖల కార్యకలాపాలకు భిన్నంగా ఉంటాయి కనుక అనుభవమున్న వారినే తీసుకోవడం మంచిదన్న అభిప్రాయం కొందరు నేతల్లో ఉంది. -
సీమాంధ్ర అసెంబ్లీ కార్యదర్శి ఎవరు?
అర్హులు లేని వైనం... డెప్యుటేషనే మార్గం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి కార్యద ర్శిగా ఎవరుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత కార్యదర్శి ఎస్.రాజ సదారాం పదవి కాలం ఇప్పటికే ముగిసినా అసెంబ్లీ సచివాలయంలో అర్హులెవరూ లేకపోవడంతో గత ప్రభుత్వం ఆయనకు పొడిగింపు ఇవ్వడం తెలిసిందే. జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలు వేరవుతున్నాయి. సదారాం తెలంగాణకు చెందిన వారు గనుక ఆయన్ను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిగా కొనసాగించే అవకాశముంది. దాంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శిపై సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే ఆ పదవిలోకి వచ్చేవారు న్యాయశాస్త్రంలో పట్టభద్రులై ఉండాలి. సంయుక్త కార్యదర్శి, అదనపు కార్యదర్శులకు కూడా ఇది వర్తిస్తుంది. కానీ అసెంబ్లీ సచివాలయంలో న్యాయశాస్త్ర పట్టభద్రులు ప్రస్తుతం డిప్యూటీ సెక్రెటరీ స్థాయిలోనే ఉన్నారు. వారికన్నా సీనియర్లకు న్యాయశాస్త్ర పట్టా లేని కారణంగా సంయుక్త, అదనపు కార్యదర్శులుగా పదోన్నతి లభించడం లేదు. దాంతో అసెంబ్లీలో ఆ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ కారణంగా కార్యదర్శి పదవికి అర్హులెవరూ లేకుండా పోయారు. 1970ల్లో ఇలాంటి పరిస్థితే ఎదురైతే న్యాయ శాఖ నుంచి ఒక అధికారిని డెప్యుటేషన్‌పై అసెంబ్లీ కార్యదర్శిగా తీసుకున్నారు. ఇప్పుడూ అదే విధానాన్ని అవలంబించక తప్పని పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఉద్యోగుల స్థానికతపై వివాదం అసెంబ్లీలో ఉద్యోగుల స్థానికతపై వివాదం తలెత్తింది. అసెంబ్లీ సచివాలయ ఉద్యోగుల విభజన జరగాల్సి ఉన్న నేపథ్యంలో వారి స్థాయీ నివేదికను అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. అయితే అందులో 22 మంది సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ వారిగా క్లెయిమ్ చేసుకుంటున్నారంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై నలుగురు సభ్యులతో కమిటీని కార్యదర్శి నియమించారు. అది శనివారం ఉద్యోగుల అభ్యంతరాలను పరిశీలించి నివేదిక ఇవ్వనుంది. -
మహంతి వద్దకు చేరిన తెలంగాణ బిల్లు
-
మహంతి వద్దకు చేరిన తెలంగాణ బిల్లు
హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ కార్యదర్శి రాజా సదారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతికి పంపారు. శాసనసభలో చర్చల సారాంశం, తీర్మానాలను క్రోడీకరించి అందులో పొందుపరిచారు. అయితే సభలో సభ్యులు అందరూ బిల్లుపై తమ అభిప్రాయాలను తెలియజేయని విషయం తెలిసిందే. విభజన బిల్లు కేంద్రం నుండి ప్రత్యేక విమానంలో తెచ్చి నేరుగా మహంతికే అప్పగించారు. ఇప్పుడు దానిని పంపించే బాధ్యత కూడా ఆయనదే. ఈ బిల్లును మహంతి కేంద్ర హొం శాఖకు పంపుతారు. సోమవారం ఉదయం విమానంలో ప్రత్యేకాధికారి దీనిని ఢిల్లీ తీసుకు వెళ్లే అవకాశం ఉంది.