ఏపీ అసెంబ్లీ కార్యదర్శి ఎవరు? | Who is the Andhra pradesh State secretary ? | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీ కార్యదర్శి ఎవరు?

Published Tue, Jun 3 2014 2:12 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Who is the Andhra pradesh State secretary ?

సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్న రాజసదారాం పదవీకాలం కొద్దినెలల క్రితం ముగిసినా పొడిగింపుపై కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజనతో ఆయన కొత్త కార్యదర్శి నియామకమయ్యే వరకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిగా కొనసాగనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కార్యదర్శిగా ఎవరు రానున్నారనేది మాత్రం సందిగ్దంగా మారింది. కార్యదర్శిగా ఉండాలంటే లా పట్టా ఉండాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతమున్న డిప్యుటీ కార్యదర్శుల్లో ఒక్కరికీ లా డిగ్రీ లేకపోవడం వారి ఎంపికకు ఆటంకంగా మారింది. ఆ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చి వారిలో ఒకరిని కార్యదర్శిగా తీసుకోవాలా? లేదా డిప్యుటేషన్‌పై ఎవరినైనా తీసుకోవాలా? అన్న చర్చ సాగుతోంది. అసెంబ్లీ వ్యవహారాలు ఇతర శాఖల కార్యకలాపాలకు భిన్నంగా ఉంటాయి కనుక అనుభవమున్న వారినే తీసుకోవడం మంచిదన్న అభిప్రాయం కొందరు నేతల్లో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement