కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క
సాక్షి, హైదరాబాద్: తమ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.సంపత్‌కుమార్‌ల శాసన సభ్య త్వాలను పునరుద్ధరించాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శికి కాంగ్రెస్ పార్టీ లీగల్ మెమొరాండం ఇచ్చింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి బుధవారం అసెంబ్లీ కార్యదర్శికి ఈ మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం అన్యాయమని రాజ్యాంగాన్ని రక్షించే అన్ని సంస్థలను సంప్రదించామన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకుండా ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని, శాసనసభ వెబ్‌సైట్‌లోనూ వారిద్దరినీ ఎమ్మెల్యేలుగా చూపిస్తున్నారని, దీన్ని అధారంగా చేసుకుని వారి శాసన సభ్యత్వాలను పునరుద్ధరించాలని మెమొరాండం ఇచ్చామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment