హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. ప్రస్తుతం ఎమ్మెల్యే రోజా నిమ్స్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సభా హక్కుల కమిటీ భేటీని 15 రోజులు వాయిదా వేయాలని కోరారు. ఈ భేటీకి రోజా హాజరుకాలేకపోతున్నట్లు తెలిపారు.
అసెంబ్లీ హాల్లో శనివారం మధ్యాహ్నం సభా హక్కుల కమిటీ విచారణ జరిగింది. ఈ విచారణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. అంతకు ముందు అనారోగ్యం కారణంగా విచారణకు హాజరుకావడం లేదని ఎమ్మెల్యే రోజా కూడా కమిటీకి లేఖ పంపారు.