కాంగ్రెస్ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. పార్టీ మారినందుకు తనపై విమర్శలు గుప్పించటం మానుకోవాలని హితవు పలికారు. గురువారం సాయంత్రం ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. బుధవారం జరిగిన సమన్వయక మిటీ సమావేశంలో కూడా ఆ పార్టీ నేతలు పరస్పరం దూషించుకున్నారన్నారు. వాళ్లలో వాళ్లకే ఐకమత్యం లేదని చెప్పారు. కాంట్రాక్టుల కోసం తాను పార్టీ మారాననడం సిగ్గుచేటని తెలిపారు. తనకు కాంట్రాక్టులు లేవని, తన వియ్యంకుడు నిజాం కాలం నుంచే పెద్ద కాంట్రాక్టరని గుత్తా తెలిపారు. సమయం, సందర్భంగా చూసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.