ఫిరాయింపులతో మేమేం లాభపడలేదు: హరీష్‌ రావు | brs mla harish rao reaction on party mlas defection | Sakshi
Sakshi News home page

ఫిరాయింపులతో మేమేం లాభపడలేదు: హరీష్‌ రావు

Published Tue, Jul 9 2024 2:23 PM | Last Updated on Tue, Jul 9 2024 4:26 PM

brs mla harish rao reaction on party mlas defection

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొడతామని తాము ఎప్పుడూ వ్యాఖ్యలు చేయలేదని మాజీ మంత్రి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆయన మంగళవారం ఫిరాయింపులపై మీడియాతో మాట్లాడారు. 

‘మా పార్టీలో  చేరిన వారిలో 10 మంది ఓడిపోయారు. ఫిరాయింపులతో మాకు లాభం జరగలేదు. మేమేం లాభపడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ​పడగొడతామని ఎప్పుడూ చెప్పలేదు. ఫిరాయింపులపై సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అసెంబ్లీ స్పీకర్‌ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. ప్రజల కోసం తాము ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాము. 

.. కాంగ్రెస్  పార్టీ వలే  ఇతర పార్టీ నేతలకు ఇంటింటికి వెళ్లి కండువాలు కప్పలేదు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం మాకు లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటేనే.. మేము ఏంటి? మా విలువ ఏంటి? అనేది ప్రజలకు తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన మాకు, పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు’’ అని అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement