పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు వద్ద అవమానాలే మిగులుతున్నాయని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
తిరుపతి: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు వద్ద అవమానాలే మిగులుతున్నాయని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ధమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ఆయన సవాల్ విసిరారు. ఉపాధి హామీ నిధుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన.. ఈ విషయంపై ఢిల్లీకి వెళ్లి, మంత్రులను కలిసి అక్రమాలను బయటపెడతామన్నారు.