హైదరాబాద్ సిటీ: తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన వారితో బంగారు తెలంగాణను నిర్మిస్తారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని అసెంబ్లీలో చెప్పిన సీఎం కేసీఆర్ నియంతృత్వం, అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలే ఉండకూడదనే విధంగా పాలనసాగిస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌లో చేరితేనే నిధులు, పనులు, అభివృద్ధి అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
తెలంగాణ ప్రజల ఓట్లతోనే గెలిచిన ప్రజాప్రతినిధులను ఎందుకు అవమానిస్తున్నాడని ప్రశ్నించారు. ప్రజల్లో ఓడిపోయినవారు, ప్రజలు ఛీకొట్టినవారే మంత్రులు అవుతున్నారని, ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడానికి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నియోజకవర్గంలో ఇళ్లు తప్ప రాష్ట్రంలో ఎక్కడా లేవన్నారు. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి దగ్గర సచివాలయం అని చెప్పి ఇప్పుడేమో సికింద్రాబాద్‌లో సచివాలయం అంటూ రోజుకో కొత్త మాటలతో ప్రజలను మోసం చేస్తున్నాడని కిషన్ రెడ్డి విమర్శించారు.