సాక్షి, హైదరాబాద్: బీరు, బ్రాందీ వ్యాపారాలు చేసి.. ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్లను అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నిలదీశారు. శనివారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దర్యాప్తు సంస్థల నోటీసులకు ఆన్సర్ ఇవ్వకుండా కేజ్రీవాల్ తప్పించుకొని తిరిగారని దుయ్యబట్టారు.
కేజ్రీవాల్ దీని మీద డొంక తిరుగులు తిరుగుతూ.. సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. ఈ కుంభకోణంలో ఆరోపణలు కాదు.. సాక్ష్యాలు ఉన్నాయి. కేసీఆర్ కుటుంబానికి ఢిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధం లేదని కేసీఆర్ చెప్తారా?. ఆప్ నేతలకు ఢిల్లీ స్కాంకి ఆప్ నేతలకు సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా? అంటూ కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో వందల కోట్లు చేతులు మారాయని నేను నిరుపిస్తా?. ఇది తప్పని కేసీఆర్ నిరుపిస్తారా?. దీనిపై చర్చకు ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధం. బీఆర్‌ఎస్ నేతలు కవిత అరెస్ట్‌కు, తెలంగాణకు సంబంధం పెడుతున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్‌ను కాంగ్రెస్ కూడా తప్పు బడుతుంది. దీనిలో ఆశ్చర్యం ఏమీ లేదు. కాంగ్రెస్ అంటేనే స్కాంలు చేసే పార్టీ. కాంగ్రెస్ కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచే ప్రయత్నం చేస్తుంది’’ అని ధ్వజమెత్తారు.
‘‘గతంలో కేసీఆర్ అవినీతిపై రేవంత్ మాట్లాడారు. మేడిగడ్డ దర్యాప్తు ఏమైంది?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ సీబీఐ విచారణకు కేంద్రానికి లేఖరాసింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ దర్యాప్తు చేయలేమని వారు రీప్లే ఇచ్చారు. ఇప్పుడు మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా?. మీకు దమ్ముంటే సీబీఐ దర్యాఫ్తు కు లేఖ రాయండి. మీరు లేఖ రాసిన రెండు గంటల్లో అనుమతి ఇప్పించే బాధ్యత నాది’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌పై ఫోర్జరీ కేసు
Comments
Please login to add a commentAdd a comment