'పార్టీ ఫిరాయింపులు- స్పీకర్ పాత్ర' అనే అంశంపై సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆదివారం సదస్సు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: 'పార్టీ ఫిరాయింపులు- స్పీకర్ పాత్ర' అనే అంశంపై బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టీస్ బీపీ జీవన్ రెడ్డి, జస్టీస్ బీ సుదర్శన్ రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టీస్ పి. లక్ష్మణరెడ్డి, జస్టీస్ బి, శేషశయనారెడ్డి, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కే. రామచంద్రమూర్తి, లోక్సత్తా జేపీ, వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.