సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం(ఏప్రిల్ 7) ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఫొటోను కేటీఆర్ పోస్టు చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ తాజాగా రిలీజ్ చేసిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో రాజ్యాంగ పరిరక్షణ అనే చాప్టర్ 13వ పాయింట్ గురించి ప్రస్తావించారు. ఎమ్మెల్యే లు, ఎంపీలు ఒక పార్టీ లో గెలిచి ఇంకో పార్టేకి వెళితే ఆటోమెటిక్‌గా అనర్హతకు గురయ్యేలా చట్ట సవరణ చేస్తాం అని మేనిఫెస్టోలో చెబుతున్న కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఏకంగా ఎంపీ టికెట్ కేటాయించిందని మండిపడ్డారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలను కండుడవా కప్పి మరీ చేర్చుకుంటున్నారన్నారు. గెలిచేంత వరకు ఒక మాట ... గెలిచాక ఇంకో మాట. ఇదే కాంగ్రెస్ రీతి .. నీతి. బీజేపీకి కాంగ్రెస్‌కు తేడా ఏంటి. మేనిఫెస్టోలు అమలు చేసే ఉద్దేశం లేనపుడు ఎందుకీ నాటకాలు రాహుల్‌గాంధీ అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇదీ చదవండి.. బీఆర్‌ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment