సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఎన్నికలకు సిద్ధమైన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి మరోసారి పదునైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులందరికీ నాయుడు బాబే ఫైనాన్షియర్ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ రాహుల్‌గాంధీ దూతగా అమరావతికి వచ్చి చంద్రబాబుతో జరిపిన భేటీ వెనుక రహస్యమిదేనని ఆయన ట్వీట్ చేశారు. మొత్తం మీద రూ. వెయ్యి కోట్లు పెట్టడానికి డీల్ కుదిరిందని, ఈ సొమ్మంతా పాలు, కూరగాయలు అమ్మతే వచ్చిన లాభం కదా! అంటూ చంద్రబాబును వ్యంగ్యంగా ప్రశ్నించారు.
జననేత వైఎస్ జగన్ హత్యకు ప్రయత్నించిన కోడి కత్తి ముఠా ఇప్పుడు తప్పించుకోలేదని హెచ్చరిస్తూ మరో ట్వీట్ చేశారు. ‘వెయ్యిగొడ్లను తిన్న రాబంధు ఒక్క గాలివానకు కుప్పకూలుతుంది. పింగళి దశరథ రామ్‌ను, రాఘవేంద్ర రావును, మల్లెల బాబ్జీని, వంగవీటి రంగాను చంపించిన, ఇంకా ఎంతోమంది హత్యలకు పథక రచన చేసిన ముఠా అప్పుడు తప్పించుకోవచ్చు. కానీ జననేత వైఎస్ జగన్ హననానికి ప్రయత్నించిన కోడికత్తి ముఠా ఇప్పుడు తప్పించుకోలేదు’ అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఎన్నికలకు మహా కూటమి అభ్యర్ధులందరికీ నాయుడు బాబే ఫైనాన్షియర్. కాంగ్రెస్ నేత గెహ్లాట్ రాహుల్ దూతగా అమరావతి వచ్చి బాబుతో జరిపిన భేటీ వెనుక రహస్యం ఇదే. మొత్తం మీద 1000 కోట్లు పెట్టడానికి డీల్. ఇదంతా పాలు, కూరగాయలు అమ్మితే వచ్చిన లాభం కదా!
— Vijayasai Reddy V (@VSReddy_MP) 14 November 2018
వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు కుప్పకూలుతుంది.పింగళి దశరథ రామ్‌ను,రాఘవేంద్ర రావును,మల్లెల బాబ్జీని,వంగవీటి రంగాను చంపించిన,ఇంకా ఎందరి హత్యలకో పథక రచన చేసిన ముఠా అప్పుడు తప్పించుకోవచ్చు.కానీ జననేత జగన్ గారి హననానికి ప్రయత్నించిన కోడి కత్తి ముఠా ఇప్పుడు తప్పించుకోలేదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) 14 November 2018
Comments
Please login to add a commentAdd a comment