సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో అత్యంత సీనియర్ రాజకీయ నేతను నేనే, ఎన్టీఆర్‌కు, నరేంద్ర మోదీకి రాజకీయ సలహాలు ఇచ్చింది నేనే.. ఎక్కడా లేనటువంటి పథకాలు ప్రవేశ పెట్టింది నేనే’ అంటూ గొప్పలు చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నాయుడు బాబు పక్కా కాపీ క్యాట్. ఏ ఐడియా, స్కీము బాబు సొంతం కాదు. చదువులో మొదలెట్టి రాజకీయాల వరకు కాపీ కొట్టడంలో బాబు చూపిన నేర్పరితనానికి డాక్టరేట్ ఇవ్వడానికి ఏ యూనివర్సిటీ ముందుకు రాకపోవడం విచారకరం. ఐటీ పరిభాషలో బాబు కాపీ-పేస్ట్ మ్యాన్’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.
అలా చేస్తే ఏపీ అప్పులు తీరుతాయి
ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉందని పదేపదే చెబుతున్న టీడీపీ ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి చురకలు అంటించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మరో ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ప్రభుత్వ ఖజానా దోచుకోవడంతోనే ఏపీ అప్పుల్లో కూరుకపోయింది. చంద్రబాబు ఆస్తులు, అదేవిధంగా ఆయన బినామీ ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొస్తే ఏపీ అప్పుల నుంచి కచ్చితంగా బయటపడుతుంది’ అంటూ విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment