సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశంపై ఆయన కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ‘ రాజధాని ఎక్కడుండాలనే విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చినప్పటి నుంచి చంద్రబాబు మైండ్‌లో వైబ్రేషన్స్ పెరిగాయి. కేంద్ర ప్రభుత్వంపైనా రుసురుసలాడుతున్నాడు. రాజధాని పెట్టడం వరకే రాష్ట్రం ఇష్టమట. మార్చే అధికారం లేదంట. ఇంకా ఏమేం రూల్సున్నాయో ఒకేసారి చెప్పేయండి విజనరీ!’ అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు.
(చదవండి : రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’)
కాగా, రాష్ట్ర రాజధాని అంశంలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించిన విషయం తెలిసిందే. తమ ప్రాదేశిక భూభాగంలో రాజధానిని ఎక్కడైనా నిర్ణయించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment