సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన విజయనగరం, అనంతపురం జిల్లాలోని బొబ్బిలి, హిందుపూర్‌లలో నెలకొల్పుతున్న గ్రోత్ సెంటర్ల (పారిశ్రామిక పార్కులు) అభివృద్ధి, ఆధునీకీకరణ పనులు పూర్తయితే ప్రత్యేక్షంగా, పరోక్షంగా దాదాపు 75వేల మందికి ఉపాధి లభిస్తుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌధురి తెలిపారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లోగల ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, పార్కులు, గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులలో పారిశ్రామిక మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా హిందూపూర్, బొబ్బిలిలోని పారిశ్రామికి క్లస్టర్స్ అభివృద్ధి, ఆధునీకీకరణకు 2016లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు.
54 కోట్ల రూపాయలతో హిందూపూర్‌లోని గ్రోత్ సెంటర్, గోల్లపురంలోని పారిశ్రామిక పార్కు, 10 కోట్ల రూపాలయతో బొబ్బిలిలోని పారిశ్రామిక గ్రోత్ సెంటర్ అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి చెప్పారు. హిందూపూర్ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు కేంద్ర గ్రాంట్ కింద 14 కోట్లు, బొబ్బిలికి 2.64కోట్లు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. హిందూపూర్ ప్రాజెక్టు నిర్మాణం ఈ ఏడాది మార్చి చివరినాటికి పూర్తవుతుందని, బొబ్బిలి ప్రాజెక్టు పూర్తయిందని అన్నారు. ఈ రెండు క్లస్టర్స్‌లోని పారిశ్రామిక యూనిట్లకు నాణ్యమైన, నమ్మకమైన మౌలిక వసతులను కల్పిలంచాలన్నదే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా మంత్రి పేర్కొన్నారు.
విశాఖ ఫిషింగ్ హార్బన్ ఆధునీకీకరణ జాప్యానికి కారణాలు
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్డ్ (డీపీఆర్) అసమగ్రంగా ఉన్నందునే దానిని తిప్పి పంపినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయక మంత్రి సీఆర్ చౌధురి బుధవారం రాజ్యసభకు తెలిపారు. ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణకు ఎదురవుతున్న ఆటంకాలు, అవాంతరాల గురించి ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ అందుకు గల కారణాలను సుదీర్ఘంగా వివరించారు.దేశంలో ఫిషింగ్ హార్బర్ల ఆధునికీకరణ, అభివృద్ధి కోసం తమ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తున్న మెరైన్ ప్రాడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటి(ఎంపెడా) ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఫిషింగ్ హార్బర్‌లో ఆధునిక సౌకర్యాల కల్పన కోసం ఒక కోటి రూపాయల వరకు సాయం అందచేస్తుంది. ఈ పథకంలో భాగంగా ఫిషింగ్ హార్బర్‌లో జెట్ వాషింగ్ సౌకర్యం, స్టీల్ ఐస్ క్రషర్, ఐస్ రవాణకు కన్వేయర్ వ్యవస్థ, స్టీల్ ట్రాలీలు, టాయిటెట్లు, ఓవర్ హెడ్ ట్యాంక్, ఎత్తైన స్టీల్ ప్టాట్‌ఫారాలు, జెనరేటర్ ఇత్యాది సౌకర్యాలను కల్పిండం జరుగుతుందని మంత్రి చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్ ఎంపెడా నిర్దేశించిన ప్రమాణాలు, లక్ష్యాలకు అనుగుణంగా లేదు. కేరళలోని మునాంభం ఫిషింగ్ హార్బర్ మాదిరిగా ఉండేలా రాష్ట్ర ఫిషరీష్ శాఖ సమన్వయంతో ఈ పథకం కింద ఆర్ధిక సాయం పొందడానికి ఏం చేయాలో నిర్ణయించేందకు ఆ జిల్లా కలెక్టర్ సారధ్యంలో హార్బర్ మెమేజ్‌మెంట్ కమిటీని నెలకొల్పాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment